Malayalam Movie: గుక్కతిప్పుకోకుండా ఒకేసారి ఈ మలయాళం మూవీ టైటిల్ చెప్పగలరా? - ఓ సారి ట్రై చేయండి
Malayalam Movie: ఈ వారం మలయాళంలో రిలీజైన సురేశాన్త్యుం సుమలతాయుదేయుం హృదయహరియాయ ప్రణయకథా టైటిల్‌తోనే ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. మలయాళ ఇండస్ట్రీలోనే అతి పెద్ద టైటిల్‌తో వచ్చిన మూవీగా నిలిచింది.
Malayalam Movie: సినిమాకు టైటిల్ చాలా ముఖ్యం. ఓసినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలన్నా..ఆ మూవీ పట్ల ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగించాలన్న మంచి టైటిల్ ఉండాల్సిందే. టైటిల్ ఎంత క్యాచీగా ఉంటే సినిమా అంత ఈజీగా ఆడియెన్స్‌కు రీచ్ అవుతుంది. అందుకే టైటిల్స్ ఫిక్స్ చేసే విషయంలో దర్శకనిర్మాతలు ఎన్నో తర్జనభర్జనలు పడుతుంటారు. కథ బాగున్నా సరైన టైటిల్స్ లేక ఫెయిలైన సినిమాలు చాలా ఉన్నాయి.
మలయాళం మూవీ…
కొన్ని సినిమాల టైటిల్ రెండు, మూడు పదాలతో పలకడానికి ఈజీగా ఉంటాయి. మరికొన్ని సినిమాల టైటిల్స్ మాత్రం చాలా క్లిష్టమైన పదాలతో పలకడమే కష్టంగా ఉంటుంది. ఇలాంటి టిఫికల్ టైటిల్‌తో ఈ వారం ఓ మలయాళం మూవీ థియేటర్లలో రిలీజైంది.
మలయాళం మూవీ...
మలయాళం మూవీ సురేశాన్త్యుం సుమలతాయుదేయుం హృదయహరియాయ ప్రణయకథా మే 16న థియేటర్లలో రిలీజైంది. మలయాళం ఇండస్ట్రీలో అతి పెద్ద టైటిల్‌తో వచ్చిన మూవీ పేరుతోనే ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది. రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు రతీష్ బాలకృష్ణన్ పోద్వాల్ దర్శకత్వం వహించారు. ఈ లవ్‌స్టోరీలో రాజేశ్ మాధవన్ చిత్ర నాయర్ హీరోహీరోయిన్లుగా నటించారు. మలయాళ హీరో కుంచకో బోబన్ అతిథి పాత్రలో నటించారు.
జంట ప్రేమకథ...
సురేశన్, సుమలత అనే జంట కథతో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. వారిద్దరి పేర్ల మీదుగా ఈ సినిమాకు సురేశాన్త్యుం సుమలతాయుదేయుం హృదయహరియాయ ప్రణయకథా అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మూవీ టైటిల్‌ను పలకడానికి నోరుతిరగడం కష్టంగానే ఉందని ఆడియెన్స్ అంటున్నారు. ఇలాంటి విచిత్రమైన టైటిల్స్ కూడా పెడతారా అంటూ అడియెన్స్ కామెంట్స్ చేస్తున్నాడు.ఈ మూవీ పేరు పలకడం కష్టంగా ఉండటంతో టైటిల్‌ను కుదించి సు..సు అంటూ పిలుస్తున్నారు.
ఆడియెన్స్ షాక్...
పేరుతోనే తన క్రియేటివిటీనీ చాటుకున్న డైరెక్టర్‌కు ఆడియెన్స్ మాత్రం ఊహించని షాకిచ్చారు. మే 16న రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. టైటిల్‌లోని ఉన్నకొత్తదనం సినిమాలో లేదని ప్రేక్షకులు చెబుతోన్నారు. మొత్తం మూడు టైమ్ పీరియల్స్‌లో ఈ లవ్‌స్టోరీ సాగుతుందని, వీటిలో ఒక్కదానిని కూడా డైరెక్టర్ ఇంట్రెస్టింగ్‌గా చెప్పలేకపోయాడని అంటున్నారు.
మలయాళంలో బెస్ట్ డైరెక్టర్‌గా...
రతీష్ బాలకృష్ణన్ గతంలో ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25, కనకం కామిని కలహం, నాతాన్ కేసు కుడు సినిమాలు చేశారు. బెస్ట్ డైరెక్టర్‌గా రెండుసార్లు కేరళ రాష్ట్ర అవార్డులను అందుకున్నాడు.
రతీష్ బాలకృష్ణన్ చేసిన అన్ని సినిమాల్లో రాజేశ్ మాధవన్ కీలక పాత్రలు పోషించారు. క్రిస్టీ, నీలవెలిచామ్, జర్నీ ఆఫ్ లవ్ 18 ప్లస్‌తో పాటు మరికొన్ని సినిమాల్లో రాజేష్ మాధవన్ నటనకు ప్రశంసలు దక్కాయి.
టాపిక్