ఓటీటీలో అదరగొడుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్ లో అదుర్స్.. జియోహాట్‌స్టార్‌ టాప్-5 ఫిల్మ్స్ ఇవే-malayalam thriller web series kerala crime files season 2 on trending on jiohotstar top 5 films ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలో అదరగొడుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్ లో అదుర్స్.. జియోహాట్‌స్టార్‌ టాప్-5 ఫిల్మ్స్ ఇవే

ఓటీటీలో అదరగొడుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్ లో అదుర్స్.. జియోహాట్‌స్టార్‌ టాప్-5 ఫిల్మ్స్ ఇవే

క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో దూసుకెళ్తోంది. ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ మలయాళ ఫస్ట్ వెబ్ సిరీస్ సీజన్ 2 ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోంది. జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో టాప్-5 ట్రెండింగ్ ఫిల్మ్స్ పై ఓ లుక్కేయండి.

ట్రెండింగ్ లో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ (x/JioHotstar Malayalam)

ఓటీటీలో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 దూసుకెళ్తోంది. గ్రిప్పింగ్ స్టోరీ లైన్ తో, ఉత్కంఠ రేపే సీన్స్ తో అదరగొడుతున్న ఈ సిరీస్ ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తోంది. జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో ఈ సిరీస్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. ఒరిజినల్ లాంగ్వేజ్ మలయాళంతో పాటు తెలుగు, కన్నడలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది ఈ సిరీస్.

టాప్-5 ఇవే

జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో డిఫరెంట్ వెబ్ సిరీస్, సినిమాలు అదరగొడుతున్నాయి. తెలుగులో టాప్-5లో రెండు వెబ్ సిరీస్ లు, మూడు సినిమాలున్నాయి. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2, శుభం, పడక్కలమ్, టూరిస్ట్ ఫ్యామిలీ, మెడికల్ డ్రామా సిరీస్ హార్ట్ బీట్ 2.. వరుసగా టాప్-5లో ట్రెండ్ అవుతున్నాయి. ఇందులో కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2, హార్ట్ బీట్ రెండు వెబ్ సిరీస్. శుభం, పడక్కలమ్, టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాలు.

హిందీలో ఇలా

హిందీలో లీగల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ క్రిమినల్ జస్టిస్ సీజన్ 2 టాప్ 1లో ట్రెండ్ అవుతోంది. కేసరి ఛాప్టర్ 2, కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2, గేమ్ ఆఫ్ ది త్రోన్స్, టెర్రిఫయర్ 2 వరుసగా టాప్-5 స్థానాల్లో ఉన్నాయి. కోర్టు డ్రామా థ్రిల్లర్ క్రిమినల్ జస్టిస్ ఆడియన్స్ ను అలరిస్తోంది.

మెడికో డ్రామా

తమిళంలో హార్ట్ బీట్ సీజన్ 2 నంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. ఈ మెడికో డ్రామా అదరగొడుతోంది. తమిళ్ లో హార్ట్ బీట్ సీజన్ 2 తర్వాత కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2, ఆఫీస్, టూరిస్ట్ ఫ్యామిలీ, పడక్కలమ్ వరుసగా టాప్ 5లో ఉన్నాయి. మలయాళంలో కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2, పడక్కలమ్, తుడరుమ్, టూరిస్ట్ ఫ్యామిలీ, శుభం వరుసగా టాప్-5లో ఉన్నాయి.

కన్నడ ట్రెండింగ్

కన్నడలో కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2, ఓ కుకింగ్ షో, పడక్కలమ్, టూరిస్ట్ ఫ్యామిలీ, క్రిమినల్ జస్టిస్ సీజన్ 2 వరుసగా టాప్-5లో స్ట్రీమ్ అవుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2, టూరిస్ట్ ఫ్యామిలీ, శుభం, క్రిమినల్ జస్టిస్ సీజన్ 2 హవా కొనసాగిస్తున్నాయి. మరి వీటిలో మీరు ఎన్ని చూశారు? మిగిలిన వాటిపైనా ఓ లుక్కేయండి మరి.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం