Netflix Thriller Movie: నెట్‌ఫ్లిక్స్‌లోకి అడుగుపెట్టిన తొలి రోజే అదరగొడుతున్న మలయాళం థ్రిల్లర్ మూవీ-malayalam thriller movie officer on duty streaming in netflix ott getting positive reviews ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Netflix Thriller Movie: నెట్‌ఫ్లిక్స్‌లోకి అడుగుపెట్టిన తొలి రోజే అదరగొడుతున్న మలయాళం థ్రిల్లర్ మూవీ

Netflix Thriller Movie: నెట్‌ఫ్లిక్స్‌లోకి అడుగుపెట్టిన తొలి రోజే అదరగొడుతున్న మలయాళం థ్రిల్లర్ మూవీ

Hari Prasad S HT Telugu

Netflix Thriller Movie: మలయాళం థ్రిల్లర్ మూవీ నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టిన తొలి రోజే అదరగొడుతోంది. ఈ సినిమా చూసిన వివిధ భాషల ఆడియెన్స్.. సోషల్ మీడియా ద్వారా పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్‌లోకి అడుగుపెట్టిన తొలి రోజే అదరగొడుతున్న మలయాళం థ్రిల్లర్ మూవీ

Netflix Thriller Movie: మలయాళం థ్రిల్లర్ సినిమాలను భాషలకు అతీతంగా ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు. అలా తాజాగా నెట్‌ఫ్లిక్స్ లోకి గురువారం (మార్చి 20) వచ్చిన థ్రిల్లర్ మూవీపైనా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫిబ్రవరిలో మలయాళంలో రిలీజైన 17 సినిమాల్లో ఏకైక హిట్ మూవీ ఇదొక్కటే. ఓటీటీలోనూ పాజిటివ్ రివ్యూలు సంపాదిస్తోంది.

ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఓటీటీ స్ట్రీమింగ్

తాజాగా నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన మలయాళం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ (Officer on Duty). ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించింది. కేవలం రూ. 12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పుడు థియేటర్లతోపాటు ఓటీటీలోనూ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.

స్ట్రీమింగ్ కు వచ్చిన తొలి రోజే తెలుగుతోపాటు వివిధ భాషల ఆడియెన్స్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో సూపర్ థ్రిల్లర్ అని, కచ్చితంగా చూడాల్సిన సినిమా అని పోస్టులు చేస్తున్నారు.

మస్ట్ వాచ్ మూవీ

మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చే దాదాపు ప్రతి థ్రిల్లర్ సినిమాకు తెలుగు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమాకు కూడా అవే ప్రశంసలు దక్కుతున్నాయి. మలయాళంతోపాటు తెలుగు, కన్నడ, తమిళం భాషల్లో సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. అన్ని భాషల ప్రేక్షకులు ఎక్స్ అకౌంట్ల ద్వారా ట్వీట్లు చేస్తున్నారు.

“మలయాళం ఇండస్ట్రీ నుంచి మరో సూపర్బ్ థ్రిల్లర్ మూవీ ఇది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే. మస్ట్ వాచ్ మూవీ” అని ఒకరు అన్నారు. “మలయాళం వాళ్లు థ్రిల్లర్ సినిమాలను ఇంత సులువుగా అంత బాగా ఎలా తీయగలరో” అని మరొకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎలా అంచనాలు లేకుండా ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ చూశానని, ప్రతి విషయంలోనూ ఇదొక మాస్టర్ పీస్ అని మరో యూజర్ కామెంట్ చేశారు.

ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ గురించి..

ఈ ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ గత నెలలో రిలీజైంది. కుంచకో బొబన్ లీడ్ రోల్లో నటించాడు. పొగరు ఎక్కువగా ఉండే పోలీస్ ఆఫీసర్ పాత్రలో అతడు కనిపించాడు. ఈ ప్రవర్తన కారణంగానే అతడు డీఎస్పీ నుంచి సీఐకి డీమోట్ అవుతాడు. ఓరోజు ఓ వ్యక్తి నకిలీ గోల్డ్ చెయిన్ అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడని అతనికి ఫిర్యాదు అందుతుంది. ఆ తర్వాత జరిగే దర్యాప్తులో దానికి ఎన్నో నేరాలు లింకై ఉన్నట్లు అతడు గుర్తిస్తాడు. తన వ్యక్తిగత జీవితంలోనూ గతంలో జరిగిన విషాదానికి కూడా అదే కారణమనీ తెలుస్తుంది. ఈ కేసును వదిలేయాలన్న ఒత్తిడి వచ్చినా కూడా అతడు అలాగే ముందుకు వెళ్తాడు.

ఈ సినిమాలో కుంచకో బొబన్ తోపాటు ప్రియమణి, జగదీశ్, విశాఖ్ నాయర్, వైశాఖ్ శంకర్, విష్ణు జీ వారియర్ లాంటి వాళ్లు నటించారు. నేషనల్ అవార్డు గెలిచిన షాహి కబీర్ ఈ సినిమాకు కథ అందించాడు. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను వీకెండ్ మీరూ ప్లాన్ చేసేయండి.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం