Malayalam Thriller: ఈ మలయాళం థ్రిల్లర్‌లోని ట్విస్టులకు మతి పోవాల్సిందే.. యూట్యూబ్‌లో ఫ్రీగా చూసేయండి-malayalam thriller movie cbi 5 the brain mammootty starrer streaming free on youtube ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Malayalam Thriller: ఈ మలయాళం థ్రిల్లర్‌లోని ట్విస్టులకు మతి పోవాల్సిందే.. యూట్యూబ్‌లో ఫ్రీగా చూసేయండి

Malayalam Thriller: ఈ మలయాళం థ్రిల్లర్‌లోని ట్విస్టులకు మతి పోవాల్సిందే.. యూట్యూబ్‌లో ఫ్రీగా చూసేయండి

Hari Prasad S HT Telugu

Malayalam Thriller: మలయాళం థ్రిల్లర్ మూవీస్ కు మీరు ఫ్యాన్ అయితే యూట్యూబ్‌లోనూ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను అస్సలు మిస్ కావద్దు. ఇందులోని ట్విస్టులకు మీకు మతి పోవాల్సిందే. మెగాస్టార్ మమ్ముట్టి నటించిన మూవీ కావడం విశేషం.

ఈ మలయాళం థ్రిల్లర్‌లోని ట్విస్టులకు మతి పోవాల్సిందే.. యూట్యూబ్‌లో ఫ్రీగా చూసేయండి

Malayalam Thriller: థ్రిల్లర్ మూవీస్ అంటే మంచి థ్రిల్ పంచాలి. ఆ థ్రిల్ ట్విస్టులతోనే వస్తుంది. ఆ ట్విస్టులు ఊహకందని విధంగా ఉంటే ఆ థ్రిల్ మరింత పెరుగుతుంది. అలాంటి థ్రిల్ పంచేదే మలయాళం థ్రిల్లర్ మూవీ సీబీఐ 5: ది బ్రెయిన్. నెట్‌ఫ్లిక్స్ తోపాటు యూట్యూబ్ లోనూ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతున్న సినిమా ఇది.

సీబీఐ 5: ది బ్రెయిన్.. మంచి థ్రిల్లర్

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన మూవీ సీబీఐ 5: ది బ్రెయిన్. 2022లో వచ్చిన సినిమా ఇది. సీబీఐ ఫ్రాంఛైజీలో భాగంగా వచ్చిన మూవీ. ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఓ మంత్రి, ఓ జర్నలిస్ట్, ఓ పోలీస్ అధికారి హత్యల చుట్టూ తిరిగే మూవీ ఇది. ఇందులో సీబీఐ అధికారి సేతురామ అయ్యర్ పాత్రలో మమ్ముట్టి నటించాడు. ఈ సినిమాను కే. మధు డైరెక్ట్ చేశాడు.

మంచి మిస్టరీ థ్రిల్లర్ మూవీ చూడాలనుకుంటే యూట్యూబ్‌లోనూ ఫ్రీగా అందుబాటులో ఉన్న ఈ సీబీఐ 5 మిస్ కావద్దు. బాస్కెట్ కిల్లింగ్స్ గా పిలిచే కేసును సీనియర్ సీబీఐ ఆఫీసర్ ఎలా ఛేదించాడన్నది ఈ మూవీలో చూడొచ్చు. ఇందులో భాగంగా వచ్చే ఊహించని ట్విస్టులు థ్రిల్ పంచుతాయి.

సీబీఐ 5 స్టోరీ ఏంటంటే?

సీబీఐ 5 స్టోరీ ఓ ఐపీఎస్ ట్రైనీల కోసం సీబీఐ అధికారులు నిర్వహించే ట్రైనింగ్ తో మొదలవుతుంది. ఇందులో భాగంగా డీఎస్పీ బాలగోపాల్, సీఐ వినయ్.. గతంలో సీబీఐ విజయవంతంగా పరిష్కరించిన కేసుల గురించి వివరిస్తారు. అందులో ఓ బాస్కెట్ కిల్లింగ్ కేసు గురించి కూడా చెబుతారు. అది 2012లో జరిగిన కేసు. కేరళ హోంమంత్రి ఓ విమానంలో అనుకోకుండా చనిపోవడంతో ఈ కేసు మొదలవుతుంది.

ఆ తర్వాత జర్నలిస్ట్ భాసురన్, పోలీస్ అధికారి జోస్మన్ కూడా హత్యకు గురవుతారు. ఈ హత్యల వెనుక ఇసుక మాఫియా హస్తం ఉందని మొదట భావించినా.. ఆ తర్వాత కేసు విచారణ జరిగిన కొద్దీ ఒక్కో ఊహించని నిజం బయటపడుతుంది. స్థానిక పోలీసులను తప్పించి విచారణను సీబీఐకి అప్పగించడం నుంచి.. వాళ్లు ఈ కేసును పరిష్కరించే వరకు ఎన్నో ట్విస్టులు వస్తుంటాయి. ఈ ట్విస్టులే సినిమాను చివరి వరకూ ఆసక్తిగా చూసేలా చేస్తాయి.

ఈ సినిమా ఎందుకు చూడాలంటే?

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ తీయడంలో మలయాళం ఫిల్మ్ మేకర్స్ ను మించిన వాళ్లు లేరని చెప్పొచ్చు. ఈ సీబీఐ 5 కూడా అలాంటిదే. సాధారణంగానే ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ కథనాలు ఆసక్తి రేపుతాయి. సీబీఐ 5లోని ట్విస్టులు ఆ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లాయి.

ఇక మెగాస్టార్ మమ్ముట్టి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ సీనియర్ సీబీఐ అధికారిగా తనదైన స్టైల్లో సులువుగా చేసేశాడు. మంత్రి, జర్నలిస్ట్, పోలీస్ అధికారి హత్యలే ఈ సినిమాపై ఆసక్తి రేపడానికి ప్రధాన కారణం. అయితే ఆ హత్యలకు కారణమేంటన్నది మన ఊహలకందని విధంగా సాగుతుంది. క్లైమ్యాక్స్ కూడా అంతే. మంచి ట్విస్టులతో కూడిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకుంటే ఈ సీబీఐ 5: ది బ్రెయిన్ మిస్ కావద్దు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం