Techno Thriller OTT: మలయాళం టెక్నో థ్రిల్లర్ మూవీ సడెన్‌గా ఓటీటీలో రిలీజ్ - ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో
OTT: ప్రేమలు ఫేమ్ నస్లీన్ హీరోగా నటించిన మలయాళం టెక్నో థ్రిల్లర్ మూవీ ఐ యామ్ కథలాన్ సడెన్‌గా మరో ఓటీటీలోకి వచ్చింది. ఇటీవలే మనోరమా మ్యాక్స్ ఓటీటీలో రిలీజైన ఈ మూవీ తాజాగా మంగళవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. రెండు ఓటీటీలలో కేవలం మలయాళ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది.
OTT: ప్రేమలు ఫేమ్ నస్లీన్ హీరోగా నటించిన ఐ యామ్ కథలాన్ మూవీ సడెన్‌గా మరో ఓటీటీలోకి వచ్చింది. మంగళవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే ఈ మలయాళం సినిమా మనోరమా మ్యాక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది. తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో కూడా మేకర్స్ ఈ మూవీని రిలీజ్ చేశారు. రెండు ఓటీటీలలో కేవలం మలయాళ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.
సైబర్ క్రైమ్ థ్రిల్లర్...
ఐయామ్ కథలాన్ మూవీకి ప్రేమలు ఫేమ్ గిరీష్ ఏడీ దర్శకత్వం వహించాడు. సైబర్ క్రైమ్ టెక్నో థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో అనీష్మా అనిల్‌కుమార్ హీరోయిన్‌గా నటించింది.
నస్లీన్, గిరీష్ కాంబోలో వచ్చిన ప్రేమలు మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడమే కాకుండా థియేటర్లలో వంద కోట్ల వసూళ్లను రాబట్టడంతో ఐ యామ్ కథలాన్‌పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ కథలో కొత్తదనం మిస్సవ్వడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఐదు కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందిన ఈమూవీ నాలుగు కోట్ల లోపే వసూళ్లను దక్కించుకున్నది. సైబర్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్, ట్విస్ట్‌లు, నస్లీన్ క్యారెక్టర్ మాత్రం కొంత మేర ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి.
ఐ యామ్ కథలాన్ స్టోరీ ఏంటంటే?
విష్ణు (నస్లీన్) ఇంజనీరింగ్ పూర్తిచేస్తాడు. బ్యాక్‌లాగ్స్ చాలా ఉండటంతో జాబ్ దొరకదు. ఎలాంటి బరువు బాధ్యతలు లేకుండా జులాయిగా తిరుగుతుంటాడు. కాలేజీ రోజుల నుంచి శిల్పను (అనీష్మా) ప్రేమిస్తాడు. శిల్ప తన తండ్రి ఫైనాన్స్ కంపెనీలోనే జాబ్‌లో జాయిన్ అవుతుంది. విష్ణు హ్యాకింగ్‌లో దిట్ట. శిల్పపై అనుమానంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను హ్యాక్ చేసి దొరికిపోతాడు.దాంతో విష్ణుకు బ్రేకప్ చెబుతుంది శిల్ప.
అదే టైమ్‌లో విష్ణు తండ్రి చిట్‌ఫండ్ కంపెనీలో డబ్బు పెట్టి మోసపోతాడు. మోసగాడిగా ముద్రపడటంతో ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సివస్తుంది. తన హ్యాకింగ్ టాలెంట్ ఉపయోగించి చిట్‌ఫండ్ కంపెనీ నుంచి తండ్రి కోల్పోయిన డబ్బును విష్ణు ఎలా డబ్బు రాబట్టాడు? జాబ్ సంపాదించి శిల్ప ప్రేమను ఎలా గెలిచాడు అనే అంశాలతో ఐ యామ్ కథలాన్ మూవీ రూపొందింది. ఈ మూవీ కథ.
2022లోనే షూటింగ్ మొదలు..
ప్రేమలు కంటే ముందే 2022లో ఐ యామ్ కథలాన్ మూవీ షూటింగ్ మొదలైంది. కానీ ప్రేమలు తర్వాతే థియేటర్లలోకి వచ్చింది. ఐ యామ్ కథలాన్ తర్వాత మలయాళంలో రెండు సినిమాలు చేస్తోన్నాడు నస్లీన్.