OTT Suspense Thriller: ఓటీటీలోకి 11 నెలల తర్వాత వచ్చిన సూపర్ హిట్ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్.. ఐఎండీబీలో 8.2 రేటింగ్-malayalam suspense thriller movie kattis gang ott streaming sun nxt streaming the movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Suspense Thriller: ఓటీటీలోకి 11 నెలల తర్వాత వచ్చిన సూపర్ హిట్ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్.. ఐఎండీబీలో 8.2 రేటింగ్

OTT Suspense Thriller: ఓటీటీలోకి 11 నెలల తర్వాత వచ్చిన సూపర్ హిట్ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్.. ఐఎండీబీలో 8.2 రేటింగ్

Hari Prasad S HT Telugu

OTT Suspense Thriller: ఓటీటీలోకి సూపర్ హిట్ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. 11 నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కావడం విశేషం. మరి ఈ మూవీ ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

ఓటీటీలోకి 11 నెలల తర్వాత వచ్చిన సూపర్ హిట్ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్.. ఐఎండీబీలో 8.2 రేటింగ్

OTT Suspense Thriller: మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కట్టీస్ గ్యాంగ్ (Kattis Gang). ఐఎండీబీలో 8.2 రేటింగ్ సాధించి ప్రేక్షకుల ఆదరణ సంపాదించిన ఈ మూవీ.. మొత్తానికి 11 నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా ప్రస్తుతం సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

కట్టీస్ గ్యాంగ్ ఓటీటీ స్ట్రీమింగ్

మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన కట్టీస్ గ్యాంగ్ మూవీ గతేడాది మే 16వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం సూపర్ హిట్ అయింది. ఇప్పుడీ మూవీ సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నట్లు ఆ ప్లాట్‌ఫామ్ వెల్లడించింది.

“తన కలను నెరవేర్చుకోవడానికి ఆనంద్ బాషా సిద్ధంగా ఉన్నాడు. అతడు ఆ పని చేయగలడా? కట్టిస్ గ్యాంగ్ మూవీని సన్ నెక్ట్స్ లో చూడండి” అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని ఆ ఓటీటీ వెల్లడించింది. ఈ సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 8.2 రేటింగ్ నమోదు కావడం విశేషం.

కట్టీస్ గ్యాంగ్ మూవీ గురించి..

కట్టీస్ గ్యాంగ్ ఓ డైరెక్టర్ కావాలని కలలు కనే యువకుడి చుట్టూ తిరిగే కథ. తన కలను నెరవేర్చుకునే క్రమంలో అతని వ్యక్తిగత జీవితంలో ఓ విషాదం చోటుచేసుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో అతడు తన కలను సాకారం చేసుకోగలడా లేదా అన్నది ఈ కట్టీస్ గ్యాంగ్ మూవీ స్టోరీ. అనీల్ దేవ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. బిజిబల్ మ్యూజిక్ అందించాడు.

ఇక ఈ మూవీలో ఉన్ని లాలు, సౌందరరాజా, సజిన్ చెరుకాయిల్, అల్తాఫ్ సలీమ్, అమల్ రాజ్ దేవ్, ప్రమోద్ వేలియనాదన్ లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమాకు ప్రేక్షకులతోపాటు రివ్యూయర్ల నుంచి కూడా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే సుమారు ఏడాదిగా ఈ సినిమాకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ దొరకలేదు. మొత్తానికి ఇప్పుడు సన్ నెక్ట్స్ ఓటీటీ ఈ సినిమాను శుక్రవారం (ఏప్రిల్ 18) నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం