ఈ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ చూడాల్సిందే.. పోలీస్ స్టేషన్‌లోనే పోలీసోడి గుండెల్లోకి బుల్లెట్.. చంపిందెవరన్నదే మిస్టరీ-malayalam suspense thriller movie iratta free streaming on youtube joju george anjali movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఈ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ చూడాల్సిందే.. పోలీస్ స్టేషన్‌లోనే పోలీసోడి గుండెల్లోకి బుల్లెట్.. చంపిందెవరన్నదే మిస్టరీ

ఈ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ చూడాల్సిందే.. పోలీస్ స్టేషన్‌లోనే పోలీసోడి గుండెల్లోకి బుల్లెట్.. చంపిందెవరన్నదే మిస్టరీ

Hari Prasad S HT Telugu

మంచి మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకుంటే ఇప్పుడు చెప్పబోయే ఈ మూవీ మిస్ కాకుండా చూడండి. పోలీస్ స్టేషన్ లోనే మిట్ట మధ్యాహ్నం వేళ ఓ పోలీసోడి గుండెల్లోకి బుల్లెట్ దూసుకెళ్తుంది. ఆ చంపిందెవరన్న మిస్టరీతోనే మూవీ మొత్తం సాగుతుంది.

ఈ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ చూడాల్సిందే.. పోలీస్ స్టేషన్‌లోనే పోలీసోడి గుండెల్లోకి బుల్లెట్.. చంపిందెవరన్నదే మిస్టరీ

మలయాళం థ్రిల్లర్ మూవీస్ ఎన్ని చూసినా తనివి తీరడం లేదా? మరింత థ్రిల్ కోసం చూస్తున్నారా? అయితే ఆ ఇండస్ట్రీ స్టార్ యాక్టర్ జోజు జార్జ్, అంజలి నటించిన ఇరట్టా (Iratta) మూవీ మిస్ కాకుండా చూడండి. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ తోపాటు యూట్యూబ్ లోనూ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఓ పోలీస్ స్టేషన్ లో శవమై కనిపించిన ఏఎస్సై మృతి విచారణ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.

ఇరట్టా మూవీ స్టోరీ ఇదే..

ఇరట్టా మూవీలో జోజు జార్జ్ డ్యుయల్ రోల్లో నటించాడు. రెండూ పోలీసు పాత్రలే. ఒకటి ఏఎస్సై వినోద్ కాగా.. మరొకటి డీవైఎస్పీ ప్రమోద్. తన అన్నను ఎంతగానో ద్వేషించే వినోద్ ఓ రోజు పోలీస్ స్టేషన్ లోనే గుండెల్లోకి బుల్లెట్ దూసుకెళ్లి రక్తపు మడుగులో కనిపిస్తాడు.

అదే సమయానికి ఆ పోలీస్ స్టేషన్ కు మంత్రి రావాల్సి ఉండటంతో బయట పోలీసులు, మీడియా హడావిడి ఉంటుంది. అలాంటి సమయంలో పోలీస్ స్టేషన్ లో నుంచి గన్ పేలిన శబ్దం వినిపించడంతో అందరూ లోపలికి వెళ్లి చూస్తారు. అప్పటికే వినోద్ రక్తపు మడుగులో పడి ఉంటాడు. ఆ సమయంలో స్టేషన్ లో మరో ముగ్గురు పోలీసులు ఉంటారు.

దీంతో వాళ్లలో ఎవరో ఒకరే ఈ హత్య చేసి ఉంటారని భావిస్తారు. తన తమ్ముడి మృతి కేసులో అన్న ప్రమోద్ కూడా అనుమానితుడిగా ఉంటాడు. అయితే చివరికి అతడే ఈ కేసు విచారణ చేపడతాడు. ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వినోద్, ప్రమోద్ ఇద్దరి గతాలను కూడా మూవీలో చూపిస్తారు.

అసలు తన అన్నను వినోద్ ఎందుకంతలా ద్వేషిస్తాడు? పోలీస్ స్టేషన్ లో అతడు రక్తపు మడుగులో కనిపించడానికి కారణం ఎవరు? మద్యం మత్తులో వినోద్ చేసిన ఓ ఘోర తప్పిదం అతని మరణానికి ఎలా కారణమైందన్నది ఈ ఇరట్టా మూవీలో చూడొచ్చు.

ఇరట్టా ఎందుకు చూడాలంటే?

సాధారణంగా మలయాళం మూవీ మేకర్స్ ఓ చిన్న లైన్ నే కథగా అల్లి అదిరిపోయే థ్రిల్లర్ మూవీస్ తీస్తుంటారు. అందులోనూ మర్డర్ మిస్టరీలు, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అయితే.. క్లైమ్యాక్స్ వరకూ అసలు ఏం జరిగిందో అన్న ఉత్కంఠతో ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోతారు.

అలాంటిదే ఈ ఇరట్టా మూవీ కూడా. ఓ పోలీస్ స్టేషన్ లోనే మంత్రి పర్యటనకు కొద్ది నిమిషాల ముందు ఓ పోలీస్ అధికారి చనిపోయి పడి ఉండటం, ఆ కేసు విచారణ సాగే తీరు, అందులో పోలీసే అయిన అన్న కూడా అనుమానితుడిగా ఉండటం, అసలు ఎవరి ఊహకందని క్లైమ్యాక్స్ ఈ ఇరట్టా మూవీ బలాలుగా చెప్పొచ్చు.

రోహిత్ ఎంజీ కృష్ణన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2023లో రిలీజైంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ తోపాటు యూట్యూబ్ లోనూ తెలుగులో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్లు కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం