Aattam OTT: ఓటీటీలో అడుగుపెట్టిన మరో మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ
Aattam OTT Streaming: విమర్శకుల ప్రశంసలు పొందిన మలయాళ మూవీ ‘ఆట్టం’ ఓటీటీలోకి అడుగుపెట్టింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం వచ్చింది. ఈ సినిమా ఏ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చిందంటే..
Aattam Movie OTT Streaming: మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి వస్తున్న చాలా థ్రిల్లర్ మూవీలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రశంసలను పొందుతున్నాయి. తాజాగా, మరో మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. విమర్శకుల ప్రశంసలను పొందిన ‘ఆట్టం’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈ ఏడాది జనవరి 5న ఈ చిత్రం మలయాళంలో థియేటర్లలో రిలీజ్ అయింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.
ఆట్టం సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ సినిమా మలయాళం భాషలో మాత్రమే స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎంగేజింగ్ స్టోరీ లైన్, అద్భుతమైన యాక్టింగ్ పర్ఫార్మెన్సులతో కూడిన ఈ థ్రిల్లర్ చాంబర్ డ్రామా మూవీని ఇప్పుడు ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.
ఆట్టం మూవీ గురించి..
ఆట్టం చిత్రంలో జరీన్ షిహాబ్, కళాభవన్ షరోజాన్, వినయ్ ఫోర్ట్, అజి తిరువంకులం, జాలీ ఆంథోనీ, మదన్ బాబు, నందన్ ఉన్ని ప్రధాన పాత్రలు పోషించారు. ఆనంద్ ఏకర్షి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బాసిల్ సీజే సంగీతం అందించారు. జాయ్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై అజిత్ జాయ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఆట్టం సినిమా పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోని ప్రదర్శితమైంది. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. థియేటర్లలో రిలీజయ్యాక ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కించుకుంది. కథ, కథనంలో సస్పెన్స్, టేకింగ్ ఈ చిత్రానికి హైలైట్లుగా ఉన్నాయనే టాక్ వచ్చింది.
స్టోరీ బ్యాక్‍డ్రాప్ ఇదే
నాటకాలు ప్రదర్శించే ఓ టీమ్‍లో ఉండే ఓ అమ్మాయిపై లైంగిక దాడి జరగడం, తప్పు చేసింది ఎవరని గుర్తించడం చుట్టూ ఆట్టం మూవీ కథ తిరుగుతుంది. జెండర్ పాలిటిక్స్, మనుషుల్లో ఉండే కపటత్వాన్ని ఈ చిత్రంలో దర్శకుడు చూపించారు. నాటకాలు ప్రదర్శించే ఓ టీమ్‍లో 12 మంది పురుషులు ఉండగా.. ఒకే ఒక్క అమ్మాయి అంజలి (జరీన్ షిహాబ్) ఉంటారు. ఒకరోజు అంజలిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడతారు. అయితే, ఈ నేరానికి పాల్పడింది ఎవరో గుర్తించేందుకు టీమ్‍లోని సభ్యులు ఏ మీటింగ్ పెడతారు. ఇందులో అందరూ తమ వాదనలను, అభిప్రాయాలను చెబుతారు. ఒకరిపై ఒకరు నిందలు కూడా వేసుకుంటారు. ఈ తరుణంలో చాలా అనుమానాలు రేకెత్తుతాయి. గ్రూప్‍లో ఉన్న విబేధాలతో పాటు చాలా విషయాలు బయటికి వస్తాయి. అసలు అంజలిపై దాడి చేసింది ఎవరనేది బయటపడిందా.. ఏ విషయాలు వెల్లడయ్యాయనేదే ఆట్టం మూవీ కథగా ఉంది.
ఈవారంలోనే ఓటీటీలోకి భ్రమయుగం
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన భ్రమయుగం సినిమా ఈవారంలోనే సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మార్చి 15వ తేదీన ఈ మూవీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. మలయాళంలో ఫిబ్రవరి 15న థియేటర్లలో రిలీజైన ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి మంచి వసూళ్లు వచ్చాయి. తెలుగులోనూ వారం తర్వాత థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. రాహుల్ సదాశివం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సోనీ లివ్‍లో మార్చి 15వ తేదీ నుంచి భ్రయయుగం చిత్రాన్ని చూడొచ్చు.