OTT Suspense Thriller: ఓటీటీలోకి ట్విస్ట్‌ల‌తో సాగే మ‌ల‌యాళం స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ - ఏ ఓటీటీలో చూడాలంటే?-malayalam suspence thriller movie secret streaming on sun nxt and manorama max ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Suspense Thriller: ఓటీటీలోకి ట్విస్ట్‌ల‌తో సాగే మ‌ల‌యాళం స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ - ఏ ఓటీటీలో చూడాలంటే?

OTT Suspense Thriller: ఓటీటీలోకి ట్విస్ట్‌ల‌తో సాగే మ‌ల‌యాళం స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ - ఏ ఓటీటీలో చూడాలంటే?

Nelki Naresh Kumar HT Telugu
Jan 10, 2025 02:53 PM IST

OTT Suspense Thriller: మ‌ల‌యాళం స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ సీక్రెట్ ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం నుంచి స‌న్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మ‌ల‌యాళం మూవీలో ధ్యాన్‌ శ్రీనివాస‌న్‌, అప‌ర్ణ దాస్ హీరోహీరోయిన్లుగా న‌టించారు.

స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్  ఓటీటీ
స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ఓటీటీ

OTT Suspense Thriller: మ‌ల‌యాళం స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ సీక్రెట్ ఓటీటీలోకి వ‌చ్చింది స‌న్ నెక్స్ట్ ఓటీటీలో శుక్ర‌వారం రిలీజైంది. ఇప్ప‌టికే ఈ మూవీ మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా స‌న్స్ నెక్స్ట్ ద్వారా ఈ సినిమా ఓటీటీ ఆడియెన్స్ ముందుకొచ్చింది. రెండు ఓటీటీల‌లో కేవ‌లం మ‌ల‌యాళ వెర్ష‌న్ మాత్ర‌మే అందుబాటులో ఉంది.

yearly horoscope entry point

ధ్యాన్ శ్రీనివాస‌న్‌...

సీక్రెట్ మూవీలో ధ్యాన్‌ శ్రీనివాస‌న్‌, అప‌ర్ణ దాస్ హీరోహీరోయిన్లుగా న‌టించారు.ఈ సినిమాకు ఎస్‌.ఎస్ స్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గ‌త ఏడాది జూలై లోథియేట‌ర్ల‌లో ఈ మూవీ విడుద‌లైంది. ఐఎమ్‌డీబీలో ప‌దికిగాను 7.3 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. దేవుడు, జాత‌కాల‌పై న‌మ్మ‌కం లేని ఓ వ్య‌క్తి విధిని ఎదురించి ఎలాంటి పోరాటం చేశాడ‌నే అంశాల‌తో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో సీక్రెట్ మూవీని ద‌ర్శ‌కుడు స్వామి పొందించాడు.

సీక్రెట్ క‌థ ఇదే...

మిథున్ (ధ్యాన్ శ్రీనివాస‌న్‌) త‌న ముగ్గురు ప్రాణ స్నేహ‌తుల‌తో క‌లిసి ఓ పెళ్లికి వెళ‌తాడు. అనుకోకుండా ఓ జ్యోతిష్యుడిని మిథున్ క‌లుస్తాడు. మిథున్ పెళ్లి చేసుకోబోతున్న‌ అమ్మాయి శ్రేయ తొంద‌ర‌లోనే చ‌నిపోతుంద‌ని జోతిష్యుడు చెబుతాడు. జాత‌కాల‌పై న‌మ్మ‌కం లేని మిథున్ అత‌డి మాట‌ల్ని కొట్టేప‌డేస్తాడు. జ్యోతిష్యుడు చెప్పిన‌ట్లే వ‌రుస‌గా శ్రేయ‌కు ప్ర‌మాదాలు జ‌రుగుతుంటాయి. శ్రేయ‌ను మిథున్ కాపాడుకున్నాడా? జ్యోతిష్యుడు చెప్పిందే జ‌రిగిందా? విధికి, న‌మ్మ‌కాల‌కు మ‌ధ్య‌జ‌రిగిన పోరాటంలో మిథున్ ఎలాంటి సంఘ‌ర్ష‌ణ‌ను ఎదుర్కొన్నాడ‌న్న‌దే ఈ మూవీ క‌థ‌.

15 సినిమాలు రిలీజ్‌...

సీక్రెట్ మూవీలో మ‌ల‌యాళ సీనియ‌ర్ డైరెక్ట‌ర్లు రంజిత్‌, రెంజీ ఫ‌ణిక్క‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మ‌ల‌యాళంలో న‌టుడిగా, డైరెక్ట‌ర్‌గా, స్టోరీ రైట‌ర్‌గా మ‌ల్టీ టాలెంటెడ్‌గా ధ్యాన్ శ్రీనివాస‌న్ రాణిస్తోన్నాడు. 2014లో ధ్యాన్ శ్రీనివాస‌న్ న‌టించిన 15 సినిమాలు రిలీజ‌య్యాయి. నెల‌కో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. వీటిలో చాలా సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ ఫెయిల్యూర్స్‌గా నిలిచాయి. ధ్యాన్ శ్రీనివాస‌న్‌ అన్న‌య్య వినీత్ శ్రీనివాస‌న్ మ‌ల‌యాళంలో పాపుల‌ర్ హీరోగా డైరెక్ట‌ర్‌గా పేరుతెచ్చుకున్నాడు.

ఆదికేశ‌వ సినిమాలో...

సీక్రెట్ మూవీలో హీరోయిన్‌గా న‌టించిన అప‌ర్ణ‌దాస్ తెలుగులో ఓ సినిమా చేసింది. మెగాహీరో వైష్ణ‌వ్‌తేజ్ ఆదికేశ‌వ‌లో ఓ కీల‌క పాత్ర పోషించింది. మంజుమ్మేల్ బాయ్స్ యాక్ట‌ర్ దీప‌క్ ప‌రంబోల్‌ను ఇటీవ‌లే పెళ్లాడింది అప‌ర్ణ దాస్‌.

Whats_app_banner