OTT: ఓటీటీల్లో 5 బెస్ట్ మలయాళ సర్వైవల్ థ్రిల్లర్స్.. ఉత్కంఠతో మెప్పించేలా!
OTT Malayalam Survival Thrillers: మలయాళంలో కొన్ని సర్వైవల్ థ్రిల్లర్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఉత్కంఠభరిత కథనంలో మెప్పించాయి. అలాంటి వాటిలో ఐదు సినిమాల గురించి ఇక్కడ చూడండి. ఏ ఓటీటీల్లో ఉన్నాయో తెలుసుకోండి.
మలయాళ ఇండస్ట్రీ నుంచి సర్వైవల్ థ్రిల్లర్ జానర్‌లో చాలా సినిమాలు వచ్చాయి. కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ సక్సెస్ సాధించటంతో పాటు చాలా పాపులర్ అయ్యాయి. ప్రేక్షకులను ఉత్కంఠతో ఊపేసి మెప్పించాయి. కలెక్షన్లలో దుమ్మురేపాయి. వాటిలో ఐదు మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి. ఈ సినిమాలను ఇంకా చూడపోతే తప్పకుండా ట్రై చేయవచ్చు. అవేవంటే..
మంజుమ్మల్ బాయ్స్
సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం మంజుమ్మల్ బాయ్స్ భారీ హిట్ సాధించింది. మలయాళ ఇండస్ట్రీలో రూ.200కోట్ల కలెక్షన్ల మార్క్ దాటిన తొలి చిత్రంగా నిలిచింది. గతేడాది ఫిబ్రవరిలో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. ప్రమాదకరమైన లోతైన గుహలో పడిపోయిన స్నేహితుడిని కాపాడుకునేందుకు కొందరు యువకులు చేసే ప్రయత్నాల చుట్టూ ఈ సాగుతుంది. డైరెక్టర్ చిదంబరం తెరకెక్కించిన ముంజుమ్మల్ బాయ్స్ ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. ఈ స సినిమాలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసీ, దిలాన్ డెరిన్, బాలు వర్గీస్, గణపతి, లాల్ జూనియర్ ప్రధాన పాత్రలు పోషించారు. మంజుమ్మల్ బాయ్స్ సినిమా ప్రస్తుతం జియోహాట్‍స్టార్ ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తప్పకుండా చూడాల్సిన సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఇది.
మలయంకుంజు
ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన మలయంకుంజు (2022) చిత్రం చాలా ప్రశంసలను దక్కించుకుంది. ఈ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీకి సాజిమోన్ ప్రభాకర్ దర్శకత్వం వహించారు. ఇల్లు కుంగిపోయి అండర్ గ్రౌండ్ నీటిలో చిక్కుకొని తప్పించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించే ఓ మెకానిక్ చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఎమోషనల్‍గానూ టచ్ చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఉన్న మలయంకుంజు చిత్రాన్ని కూడా అసలు మిస్ అవకూడదు.
2018
కేరళలో సంభవించిన వరద విలయం ఆధారంగా 2018 సినిమా తెరకెక్కింది. 2023లో రిలీజైన ఈ చిత్రానికి భారీగా ప్రశంసలు దక్కటంతో పాటు కమర్షియల్‍గానూ భారీ సక్సెస్ సాధించింది. ఈ మూవీలో టివినో థామస్, కుంచకో బోబన్, ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రలు పోషించగా.. జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వం వహించారు. 2018 నాటి వరద విలయాన్ని ఎమోషనల్‍గా ఈచిత్రంలో చూపించారు డైరెక్టర్. వరదల్లో ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు కొందరు చేసిన సాహసాలకు నివాళిగానూ ఈ చిత్రం అనిపిస్తుంది. 2018 సినిమా సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
హెలెన్
మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం హెలెన్ (2019) కూడా ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. అత్యంత చల్లగా ఉండే ఫ్రీజర్ రూమ్‍లో బీఎస్‍సీ నర్సింగ్ విద్యార్థి చిక్కుకోవడం, ఎలా బయటికి వచ్చిందనే విషయాల చుట్టూ ఈ మూవీ ఉంటుంది. ఈ సినిమాలో అన్నా బెన్, లాల్ లీడ్ రోల్స్ చేశారు. ఈ చిత్రానికి ముత్తుకుట్టి గ్జేవియర్ దర్శకత్వం వహించారు. హెలెన్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది.
నీరలి
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించిన నీరలి (2018) కూడా సూపర్ హిట్ అయింది. ఈ మూవీలో సూరజ్ వెంజరమూడు కూడా ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. కొండ అంచున కారు చిక్కుకోవడం, బయటికి వచ్చేందుకు చేసే ప్రయత్నాలు ఈ మూవీలో ప్రధాన అంశాలుగా ఉంటాయి. ఈ మూవీకి అజోయ్ వర్మ దర్శకత్వం వహించారు. నీరలి సినిమాను సన్‍నెక్స్ట్ ఓటీటీలో చూడొచ్చు.
సంబంధిత కథనం