Malayalam Survival Thriller Movies: మలయాళంలో తప్పకుండా చూడాల్సిన బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ ఇవే-malayalam survival thriller movies manjummel boys 2018 virus malayankunju helen in hotstar sonyliv prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Malayalam Survival Thriller Movies Manjummel Boys 2018 Virus Malayankunju Helen In Hotstar Sonyliv Prime Video

Malayalam Survival Thriller Movies: మలయాళంలో తప్పకుండా చూడాల్సిన బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ ఇవే

Hari Prasad S HT Telugu
Mar 21, 2024 10:18 PM IST

Malayalam Survival Thriller Movies: మలయాళంలో ఈ మధ్యే వచ్చి అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచిన సర్వైవల్ థ్రిల్లర్ మంజుమ్మెల్ బాయ్స్. ఈ సినిమాలాగే ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ ఏంటో చూడండి.

మలయాళంలో తప్పకుండా చూడాల్సిన బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ ఇవే
మలయాళంలో తప్పకుండా చూడాల్సిన బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ ఇవే

Malayalam Survival Thriller Movies: జానర్ ఏదైనా సరే మలయాళం ఫిల్మ్ మేకర్స్ తీసినట్లుగా అత్యంత సహజంగా, అతి తక్కువ బడ్జెట్ లో, రియాల్టీకి అతి దగ్గరగా ఉండేలా మరెవరూ తీయలేరంటే అతిశయోక్తి కాదు. ఇక సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ అయితే చెప్పాల్సిన పనిలేదు.

ఈ మధ్యే వచ్చిన మంజుమ్మెల్ బాయ్స్ రూ.200 కోట్లకుపైగా వసూలు చేసిన సంగతి తెలుసు కదా. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పటికే ఓటీటీల్లో ఉన్న బెస్ట్ మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ ఏవో తెలుసా?

2018: ఎవ్రీవన్ ఈజ్ ఎ హీరో - సోనీలివ్

గతేడాది మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మూవీ 2018. కేరళను వరదలు ముంచెత్తిన ఏడాదినే టైటిల్ గా పెట్టి సినిమా తీశారు. టొవినో థామస్ నటించిన ఈ సినిమాను జూడ్ ఆంథనీ జోసెఫ్ డైరెక్ట్ చేశాడు. మంజుమ్మెల్ బాయ్స్ కంటే ముందు అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమా ఇదే. ప్రస్తుతం ఈ మూవీ సోనీలివ్ ఓటీటీలో అందుబాటులో ఉంది. 2018లో కేరళను ముంచెత్తిన వరదల సమయంలో మలయాళీలు ఒకరికొకరు ఎలా అండగా నిలబడి ఈ విపత్తును దీటుగా ఎదుర్కొన్నారో ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు.

మలయన్‌కుంజు - ప్రైమ్ వీడియో

ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ మలయన్‌కుంజు మూవీ కూడా ఓ నిజ జీవిత ఘటన ఆధారంగానే తెరకెక్కించారు. ఇడుక్కిలో కొండ చరియలు విరిగిపడిన ఘటనను ఆధారంగా చేసుకొని సినిమా తీశారు. 2022లో థియేటర్లలో రిలీజైంది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో మూవీ అందుబాటులో ఉంది. మహేష్ నారాయణన్ కథ అందించగా. సజిమోన్ ప్రభాకర్ మూవీని డైరెక్ట్ చేశాడు.

హెలెన్ - ప్రైమ్ వీడియో

హెలెన్ మూవీ కూడా ఓ సర్వైవల్ థ్రిల్లరే. నిజ జీవిత ఘటన ఆధారంగా రూపొందినా.. కల్పితమైన స్టోరీయే ఎక్కువ. కెనడాకు వెళ్లాలని కలలు కనే ఓ సాధారణ అమ్మాయి ఓ రోజు కనిపించకుండా పోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆమె తనకు ఎదురైన సవాళ్లను ఎదుర్కొని ఎలా మనుగడ సాగించిందన్నది ఈ హెలెన్ మూవీలో చూడొచ్చు. 2019లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

వైరస్ - ప్రైమ్ వీడియో/జీ5

కేరళతోపాటు మొత్తం ఇండియాను వణికించిన నిపా వైరస్ చుట్టూ తిరిగే కథే ఈ వైరస్ మూవీ. 2019లో ఈ సినిమా రిలీజైంది. ఆశిఖ్ అబు డైరెక్ట్ చేసిన వైరస్ మూవీ.. కేరళ వాసులు ఈ వైరస్ ను ఎలా కలిసికట్టుగా ఎదుర్కొన్నారో చూపిస్తుంది. ఈ సినిమా ప్రైమ్ వీడియో, జీ5లలో అందుబాటులో ఉంది. ఈ మూవీలో టొవినో థామస్, పార్వతి తిరువోతు, ఆసిఫ్ అలీ నటించారు.

టేక్ ఆఫ్ - హాట్‌స్టార్, జియో సినిమా

2014లో ఇండియాకు చెందిన నర్స్‌లు ఇరాక్ లో పడిన కష్టాలకు సినిమా రూపమే ఈ టేక్ ఆఫ్. 2017లో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ నారాయణన్ డైరెక్ట్ చేశాడు. ఫహాద్ ఫాజిల్, పార్వతి తిరువోతు, ఆసిఫ్ అలీ నటించిన టేక్ ఆఫ్ మూవీ ఓ అద్భుతమైన సర్వైవల్ థ్రిల్లర్.

IPL_Entry_Point