Malayalam OTT: వెరైటీ టైటిల్‌తో వ‌చ్చిన మ‌ల‌యాళం థ్రిల్ల‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?-malayalam survival thriller movie 90 minutes to stream on manorama max ott from this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Malayalam Ott: వెరైటీ టైటిల్‌తో వ‌చ్చిన మ‌ల‌యాళం థ్రిల్ల‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Malayalam OTT: వెరైటీ టైటిల్‌తో వ‌చ్చిన మ‌ల‌యాళం థ్రిల్ల‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Nelki Naresh Kumar HT Telugu
Jan 22, 2025 10:17 AM IST

Malayalam OTT: మ‌ల‌యాళం మూవీ 90 మిన‌ట్స్ ఓటీటీ రిలీజ్ డేట్ క‌న్ఫామ్ అయ్యింది. స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో జ‌న‌వ‌రి 24 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. టీవీ హోస్ట్ ఆర్య కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ సినిమాకు నితిన్ థామ‌స్ ద‌ర్వ‌క‌త్వం వ‌హించాడు.

మ‌ల‌యాళం ఓటీటీ
మ‌ల‌యాళం ఓటీటీ

Malayalam OTT: మ‌ల‌యాళం స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ 90 మిన‌ట్స్ ఓటీటీలోకి వ‌స్తోంది. ఈ నెల 24 నుంచి మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ థ్రిల్ల‌ర్ మూవీ మ‌ల‌యాళ టాప్‌ టీవీ హోస్ట్ ఆర్య బాబు హీరోయిన్‌గా న‌టించింది. అరుణ్ కుమార్‌, సంతోష్, శ్రీరామ్ రామ‌చంద్ర‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు. నితిన్ థామ‌స్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

yearly horoscope entry point

రెండేళ్ల త‌ర్వాత‌...

90 మిన‌ట్స్ మూవీ 2023 మార్చిలో థియేట‌ర్ల‌లో రిలీజైంది. దాదాపు రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. కేవ‌లం రెండు పాత్ర‌ల‌తో సింగిల్ లొకేష‌న్‌లో ప్ర‌యోగాత్మ‌కంగా ద‌ర్శ‌కుడు నితిన్ ఈ సినిమాను తెర‌కెక్కించాడు.

90 మిన‌ట్స్ మూవీ ర‌న్ టైమ్ గంట న‌ల‌భై నాలుగు నిమిషాలు మాత్ర‌మే కావ‌డం గ‌మ‌నార్హం. ప‌లు ఫిలిం ఫెస్టివ‌ల్స్‌లో అవార్డుల‌ను అందుకున్న ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం స‌రైన విజ‌యాన్ని ద‌క్కించుకోలేక‌పోయింది.

గ్యాస్ పైప్‌లైన్‌లో చిక్కుకుపోతే...

సీఎస్‌జీ గ్యాప్‌పైప్‌లైన్‌లో ఇరుక్కుపోయిన ఓ యువ‌తీయువ‌కుడు అక్క‌డి నుంచి ప్రాణాల‌తో ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు అనే పాయింట్‌తో 90 మిన‌ట్స్ మూవీ రూపొందింది. అన్సీ, సిబి ఇన్వెస్టిగేట్ జ‌ర్న‌లిస్ట్‌లుగా ప‌నిచేస్తుంటాడు. ఓ సీఎన్‌జీ గ్యాప్ కంపెనీలో అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం అందుతుంది.

కొన్ని డాక్యుమెంట్స్ కోసం సీక్రెట్‌గా సంస్థ‌లోకి ఎంట‌ర్ అవుతారు. అనుకోకుండా గ్యాస్ పైప్‌లైన్‌లో చిక్కుకుపోతారు. వారు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌టానికి 90 నిమిషాలు మాత్ర‌మే టైమ్ ఉంటుంది. ఆ లోపు ఏం జ‌రిగింది? ఆ పైప్‌లైన్ నుంచి త‌ప్పించుకోవ‌డానికి అన్సీ, సిబి ఏం చేశారు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

టాప్ యాంక‌ర్‌గా...

టీవీ హోస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించింది ఆర్య‌. ప‌లు కామెడీ షోల‌కు యాంక‌ర్‌గా ప‌నిచేసింది. మ‌ల‌యాళంలో నంబ‌ర్ వ‌న్ హోస్ట్‌గా పేరును సొంతం చేసుకున్న‌ది. టీవీ షోస్ మాత్ర‌మే కాకుండా ప‌లు టీవీ సీరియ‌ల్స్‌లో కీల‌క పాత్ర‌లు పోషించింది. సుదీర్ఘ కెరీర్‌లో 30కిపైగా టీవీ సీరియ‌ల్స్ చేసింది. బిగ్‌బాస్ మ‌ల‌యాళం సీజ‌న్ 2లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న‌ది.

సినిమాల్లో...

టీవీ షో ద్వారా వ‌చ్చిన గుర్తింపుతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఆర్య‌. ఒరు సెకండ్ క్లాస్ యాత్, పావా, గాన‌గంధ‌ర్వ‌న్‌, ఉరియండితో పాలు ప‌లు సినిమాల్లో కీల‌క పాత్ర‌లు చేసింది.

Whats_app_banner