Malayalam Movie OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మలయాళ బ్లాక్‍బస్టర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
Aadujeevitham OTT Release: ఆడుజీవితం సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ సర్వైవల్ డ్రామా మూవీ రేపు (జూలై 19) స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది.
ఆడుజీవితం (ది గోట్‍లైఫ్) సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా రోజులుగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మార్చి 28నే ఈ మలయాళ సర్వైవల్ డ్రామా మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందించిన ఆడుజీవితం చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ మూవీ భారీ కలెక్షన్లతో భారీ బ్లాక్‍బస్టర్ అయింది. అయితే, మూడు నెలలు దాటినా ఈ చిత్రం ఓటీటీలోకి రాకపోవటంతో నిరీక్షణ కొనసాగింది. అయితే, ఎట్టకేలకు ఈ మూవీ మరికొన్ని గంటల్లో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది.
స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఆడుజీవితం సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రేపు (జూలై 19) స్ట్రీమింగ్‍కు రానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ అర్ధరాత్రే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. దీంతో మరికొన్ని గంటల్లోనే ఓటీటీలో ఈ చిత్రాన్ని చూసేయవచ్చు.
113 రోజుల తర్వాత..
ఆడుజీవితం సినిమాపై భారీగా ప్రశంసలు రావడంతో పాటు కమర్షియల్‍గానూ చాలా హిట్ అయింది. ముఖ్యంగా మలయాళంలో భారీ వసూళ్లను రాబట్టింది. అయితే, ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఎప్పటికప్పుడు ఆలస్యమవుతూ వచ్చింది. మొత్తంగా థియేటర్లలో రిలీజైన 113 రోజుల తర్వాత రేపు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుంది.
ఆడుజీవితం మూవీ యూనిట్ ముందుగా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీతో స్ట్రీమింగ్ హక్కుల డీల్‍పై చర్చించినట్టు తెలిసింది. అయితే, మూవీ టీమ్ చెప్పిన ధరకు హక్కులను తీసుకునేందుకు హాట్‍స్టార్ అంగీకరించలేదట. ఈ చర్చలు సాగటంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఆలస్యమైంది. ఆ తర్వాత నెట్‍ఫ్లిక్స్ ఓటీటీతో ఆడుజీవితం టీమ్ డీల్ చేసుకుంది. దీంతో రేపు (జూలై 18) ఈ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి ఎట్టకేలకు అడుగుపెట్టనుంది.
ఆడుజీవితం చిత్రానికి బ్లెస్సీ దర్శకత్వం వహించారు. బెన్యామిన్ రచించిన ఆడుజీవితం పుస్తకం ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రాన్ని రూపొందించారు. పని కోసం సౌదీ అరేబియాకు వెళ్లి చిక్కుల్లో పడి.. తప్పించుకునేందుకు ఎడారిలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న నజీబ్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. నజీబ్ పాత్రను పృథ్విరాజ్ సుకుమారన్ పోషించారు. ఈ మూవీలో ఆయన నటనకు చాలా ప్రశంసలు వచ్చాయి. ఈ పాత్ర కోసం బరువు తగ్గేందుకు కూడా ఆయన చాలా కష్టపడ్డారు. మొత్తంగా మరోసారి తన నటనతో భేష్ అనిపించారు పృథ్విరాజ్.
ఆడుజీవితం కలెక్షన్లు ఇలా..
ఆడుజీవితం చిత్రం సుమారు రూ.160కోట్ల కలెక్షన్లను దక్కించుకొని భారీ బ్లాక్‍బస్టర్ అయింది. సుమారు రూ.80 కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందింది. మలయాళంలో కలెక్షన్ల వర్షం కురిసింది. అయితే, తెలుగులో అంచనాలకు తగ్గట్టుగా వసూళ్లు రాలేదు. విజువల్ రొమాన్స్, జెట్ మీడియా ప్రొడక్షన్స్, అల్టా గ్లోబల్ మీడియా పతాకాలపై బ్లెస్సీ, జిమ్మీ జీన్స్ లూయిస్, స్టీవెన్ ఆడమ్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా ప్రొడ్యూజ్ చేశారు. ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ ఈ మూవీకి సంగీతం అందించారు.