Mohanlal About Akkineni Nageswara Rao Dil Raju Tollywood: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాలు ఖురేషి-అబ్రామ్ అలియాస్ స్టీఫెన్ నెడుంపల్లిగా మళ్లీ అలరించనున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎల్2 ఎంపురాన్. 2019లో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ లూసిఫర్‌కు ఇది సీక్వెల్.
ట్రయాలజీలో భాగంగా రెండో సినిమాగా తెరకెక్కిన ఎల్2 ఎంపురాన్ మూవీకి సలార్ విలన్, హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. మోహన్ లాల్-పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఎల్2 ఎంపురాన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగినవిధంగానే మార్చి 27న మలయాళంతోపాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఎల్2 ఎంపురాన్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా శనివారం (మార్చి 22) నాడు హైదరాబాద్‌లో ఎల్2 ఎంపురాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. యాంకర్ స్రవంతి చొక్కారపు హోస్ట్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, దిల్ రాజుతోపాటు ఇతర టెక్నిషీయన్స్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో మోహన్ లాల్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చారు.
సూపర్‌స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ మాట్లాడుతూ.. "మా సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న దిల్ రాజు గారికి థాంక్స్. 47 ఏళ్లుగా ఈ సినీ ఇండస్ట్రీలోని నా ప్రయాణంలో నాకు తెలుగు చిత్ర సీమతో ఎంతో అనుబంధం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు గారితో నటించే అదృష్టం నాకు కలిగింది. తెలుగు ప్రేక్షకులు చూపించే ప్రేమ ఇంకెక్కడా దొరకదు. ఇండియాలోనే టాలీవుడ్ ది బెస్ట్ ఇండస్ట్రీగా ఉంది" అని తెలిపారు.
"కేరళలో మేం అన్ని భాషల చిత్రాలను చూస్తాం. ఇప్పుడు మా సినిమాల్ని కూడా అన్ని భాషల వాళ్లు చూస్తున్నారు. ఇప్పుడు మేం పాన్ ఇండియా వైడ్‌గా చిత్రాలను చేస్తున్నాం. సినీ లవర్స్ అందరి కోసం మేం మూవీస్ తీస్తున్నాం. దిల్ రాజు గారు అన్ని వందల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తున్నారంటే దానికి కారణం మీరే ఆడియెన్స్" అని మోహన్ లాల్ అన్నారు.
"పృథ్వీరాజ్ ఈ చిత్రంతో తెరపై అద్భుతం చేశారు. మేం ముందుగా లూసిఫర్‌ను మూడు పార్టులుగా తీయాలని అనుకున్నాం. ఎల్2 ఎంపురాన్ బ్లాక్ బస్టర్ అయితే.. మూడో పార్ట్‌తో మళ్లీ వస్తాం. రెండేళ్లుగా ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాం. సుజిత్ కెమెరా వర్క్ అద్భుతంగా ఉంటుంది" అని సూపర్ స్టార్ మోహన్ లాల్ చెప్పారు.
"పాలిటిక్స్, యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా అన్ని రకాల అంశాలు ఈ ఎల్2 ఎంపురాన్ చిత్రంలో ఉంటాయి. అందరినీ అలరించేలా మా సినిమా ఉంటుంది. మార్చి 27న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి" అని కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తన స్పీచ్ ముగించారు.
సంబంధిత కథనం