ఈ మలయాళ సూపర్ నేచురల్ కామెడీ మూవీ చూశారా.. ఒకరి శరీరంలోకి మరొకరు వెళ్తే.. ఐఎండీబీలో 7.5 రేటింగ్.. తెలుగులోనూ స్ట్రీమింగ్-malayalam supernatural comedy padakkalam movie review padakkalam streaming on jiohotstar ott with over 7 imdb rating ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఈ మలయాళ సూపర్ నేచురల్ కామెడీ మూవీ చూశారా.. ఒకరి శరీరంలోకి మరొకరు వెళ్తే.. ఐఎండీబీలో 7.5 రేటింగ్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఈ మలయాళ సూపర్ నేచురల్ కామెడీ మూవీ చూశారా.. ఒకరి శరీరంలోకి మరొకరు వెళ్తే.. ఐఎండీబీలో 7.5 రేటింగ్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి ఈ మధ్యే వచ్చిన మలయాళ సూపర్ నేచురల్ కామెడీ మూవీ పాడక్కలమ్ (Padakkalam) చూశారా? ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి నవ్విస్తున్న ఈ సినిమా థియేటర్లలోనే కాదు ఓటీటీలోనూ ఇరగదీస్తోంది. ఐఎండీబీలో 7.5 రేటింగ్ సాధించిన సినిమా ఇది.

ఈ మలయాళ సూపర్ నేచురల్ కామెడీ మూవీ చూశారా.. ఒకరి శరీరంలోకి మరొకరు వెళ్తే.. ఐఎండీబీలో 7.5 రేటింగ్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

భిన్నమైన కథలే కాదు వాటిని తెరపై మరింత భిన్నంగా ప్రజెంట్ చేయడంలోనూ మలయాళం ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడూ ముందే ఉంటారు. అలా ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాయే పాడక్కలమ్ (Padakkalm). అంటే యుద్ధభూమి అని అర్థం. జియోహాట్‌స్టార్ ఓటీటీలో మంగళవారం (జూన్ 10) నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందో చూడండి.

పాడక్కలమ్ మూవీ స్టోరీ ఇదీ

మలయాళం మూవీ పాడక్కలమ్ మే 8న థియేటర్లలో రిలీజ్ కాగా.. నెల రోజుల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ పేరుకు అర్థం యుద్ధభూమి. ఓ కాలేజీనే యుద్ధభూమిగా మార్చేసి ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ స్టూడెంట్ ఎలా ఓ వెరైటీ ఆటను ఎలా ఆడారన్నదే ఈ పాడక్కలమ్ మూవీ స్టోరీ. కేరళలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ కథ జరుగుతుంది.

కొన్ని వందల ఏళ్ల నాటి ఓ పాచికల ఆట ద్వారా ఎదుటి వ్యక్తులను తన నియంత్రణలోకి తెచ్చుకునే ప్రొఫెసర్ రంజీత్ (షరాఫుద్దీన్).. అతని ఆట కట్టించడానికి ప్రయత్నించే జితిన్ (సందీప్ ప్రదీప్), ఆ రంజీత్ ద్వారా తన హెడ్‌వోడీ పదవి కోల్పోయిన షాజీ (సూరజ్ వెంజరమూడు) అనే మరో ప్రొఫెసర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. పరకాయ ప్రవేశం అంటే ఒకరి శరీరంలోకి మరొకరు వెళ్లే కాన్సెప్ట్ తో రూపొందిన సూపర్ నేచురల్ కామెడీ మూవీ ఇది.

పాడక్కలమ్ ఎలా ఉందంటే?

పాడక్కలమ్ మూవీ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమాను మను స్వరాజ్ తెరకెక్కించాడు. అయితే ఆ కాన్సెప్ట్ ను స్క్రీన్ పై ప్రజెంట్ చేసిన తీరే కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. ఒకరి శరీరంలోకి మరొకరు వెళ్లిన ఓ స్టూడెంట్, ఇద్దరు ప్రొఫెసర్లు మళ్లీ ఎలా వెనక్కి రాగలిగారన్నదే ఈ మూవీ ప్రధాన స్టోరీ.

దీనికి కామెడీ జోడించి డైరెక్టర్ స్వరాజ్ తెరకెక్కించాడు. అయితే థియేటర్లలో రిలీజైన తర్వాత మూవీకి మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. ప్రేక్షకులు మాత్రం ఐఎండీబీలో 7.5 రేటింగ్ ఇచ్చి తమకు సినిమా నచ్చిందని చెప్పకనే చెప్పారు. పాచికల ఆట, పరకాయ ప్రవేశం, ఆ ఆటను పూర్తి చేయడం.. దీనిని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడంలో మాత్రం డైరెక్టర్ కాస్త తడబడ్డాడు.

సినిమా మధ్యలో గందరగోళంగా అనిపిస్తుంది. అయితే ఓ భిన్నమైన కాన్సెప్ట్ చూసిన ఫీలింగ్ మాత్రం కలుగుతుంది. జియోహాట్‌స్టార్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం