బంధాలు, త్యాగాల కలయిక ఇది, చరిత్ర క్రియేట్ చేయబోతున్నాం.. సూపర్ స్టార్ మోహన్ లాల్ వృషభ డైరెక్టర్ నంద కిషోర్ కామెంట్స్-malayalam super star mohanlal vrushabha release date announced director nanda kishore producer ekta kapoor comments ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  బంధాలు, త్యాగాల కలయిక ఇది, చరిత్ర క్రియేట్ చేయబోతున్నాం.. సూపర్ స్టార్ మోహన్ లాల్ వృషభ డైరెక్టర్ నంద కిషోర్ కామెంట్స్

బంధాలు, త్యాగాల కలయిక ఇది, చరిత్ర క్రియేట్ చేయబోతున్నాం.. సూపర్ స్టార్ మోహన్ లాల్ వృషభ డైరెక్టర్ నంద కిషోర్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ సినిమా వృషభ. ఈ సినిమాకు నంద కిశోర్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నిర్మాతలు శోభా కపూర్, ఏక్తా కపూర్‌తోపాటు తదితరులు నిర్మిస్తున్నారు. తాజాగా వృషభ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసిన సందర్భంగా దర్శకుడు నంద కిశోర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

బంధాలు, త్యాగాల కలయిక ఇది, చరిత్ర క్రియేట్ చేయబోతున్నాం.. సూపర్ స్టార్ మోహన్ లాల్ వృషభ డైరెక్టర్ నంద కిషోర్ కామెంట్స్

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు కంప్లీట్ యాక్టర్ అనే పేరు కూడ ఉంది. మోహన్ లాల్ సినిమా అంటే మలయాళంతోపాటు పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో స్పెష‌ల్‌ క్రేజ్ ఉంటుంది. అన్ని భాష‌ల ఆడియెన్స్ మోహ‌న్‌ లాల్‌ సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు.

బాలీవుడ్ నిర్మాతలతోపాటు

ప్ర‌స్తుతం మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియ‌న్ మూవీ ‘వృష‌భ‌’లో హీరోగా నటించారు మోహన్ లాల్. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై ‘వృషభ’ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలు శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్‌తోపాటు సీకే పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మించారు.

హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా

హిస్టారిక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీపై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. మ‌ల‌యాళ సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్ సినిమాల్లో ఒక‌టిగా రూపొందుతోన్న ‘వృష‌భ‌’ సినిమాకు నంద కిషోర్ దర్శకత్వం వహించారు.

డైరెక్టర్ నంద కిషోర్ కామెంట్స్

ఈ ప్రెస్టీజియ‌స్ మూవీ వృషభను న‌వంబ‌ర్ 6న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ లెవ‌ల్‌లో విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ నంద కిషోర్, నిర్మాత ఏక్తా కపూర్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

చరిత్రను క్రియేట్ చేయబోతున్నాం

చిత్ర ద‌ర్శ‌కుడు నంద కిషోర్ మాట్లాడుతూ.. "నవంబర్ 6న ‘వృష‌భ‌’ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నామ‌ని తెలియ‌జేయ‌టానికి ఎంతో ఆనందంగా ఉంది. వృష‌భ సినిమాతో ఓ చ‌రిత్ర‌ను క్రియేట్ చేయ‌బోతున్నాం" అని అన్నారు.

సంక్లిష్టమైన కథ

"బ‌ల‌మైన భావోద్వేగాల‌తో పాటు అద్భుత‌మైన విజువ‌ల్స్‌తో సినిమాను రూపొందించాం. బంధాలు, త్యాగాల క‌ల‌యిక‌గా రూపొందిన ఈ సినిమా ఆడియెన్స్‌కు గొప్ప‌గా క‌నెక్ట్ అవుతుంది. ఇదొక ప్ర‌త్యేక‌మైన‌, సంక్లిష్ట‌మైన క‌థ‌. దీనికి ప్రాణం పోయ‌టానికి ఎంటైర్ టీమ్ ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డారు. న‌వంబ‌ర్ 6న సినిమాను చూసే ప్రేక్ష‌కులు ఓ గొప్ప అనుభూతికి లోన‌వుతారు" అని డైరెక్టర్ నంద కిశోర్ తెలిపారు.

హృదయానికి దగ్గరైన కథ

ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ మాట్లాడుతూ.. "ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీగా రూపొందించిన సనిమా ‘వృష‌భ‌’. ఇది నా హృద‌యానికి ఎంతో ద‌గ్గ‌రైన క‌థ‌. బ‌లమైన భావోద్వేగాలు, లార్జ‌ర్ దేన్ లైఫ్ డ్రామాతో ఇండియ‌న్ సినిమాను గొప్ప‌గా ఆవిష్క‌రిస్తున్నాం. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కుల‌కు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌టానికి సిద్ధంగా ఉన్నాం" అని అన్నారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం