L2 Empuraan: సూపర్ స్టార్ మోహన్ లాల్ హిట్ మూవీ సీక్వెల్ ఎల్2 ఎంపురాన్ రిలీజ్ డేట్ ఇదే- సలార్ విలన్ డైరెక్టర్!-malayalam super star mohanlal l2 empuraan release date announced officially directed by prithviraj sukumaran ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  L2 Empuraan: సూపర్ స్టార్ మోహన్ లాల్ హిట్ మూవీ సీక్వెల్ ఎల్2 ఎంపురాన్ రిలీజ్ డేట్ ఇదే- సలార్ విలన్ డైరెక్టర్!

L2 Empuraan: సూపర్ స్టార్ మోహన్ లాల్ హిట్ మూవీ సీక్వెల్ ఎల్2 ఎంపురాన్ రిలీజ్ డేట్ ఇదే- సలార్ విలన్ డైరెక్టర్!

Sanjiv Kumar HT Telugu

L2 Empuraan Release Date Announced: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ లూసిఫర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిందే ఎల్2 ఎంపురాన్. ఈ సినిమాకు సలార్ విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఎల్2 ఎంపురాన్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

సూపర్ స్టార్ మోహన్ లాల్ హిట్ మూవీ సీక్వెల్ ఎల్2 ఎంపురాన్ రిలీజ్ డేట్ ఇదే- సలార్ విలన్ డైరెక్టర్!

L2 Empuraan Release Date Announced: మలయాళ సూపర్ స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్‌ లాల్ హీరోగా సలార్ విలన్ పృథ్వీరాజ్ సుకుమార్ తెరకెక్కించిన లూసిఫర్‌కు సీక్వెల్‌గా ‘ఎల్2 ఎంపురాన్’ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలు పెంచిన ఎల్2 ఎంపురాన్ రిలీజ్ డేట్‌ను తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

మళ్లీ తెరపైకి

ఎల్2 ఎంపురాన్ మూవీని మార్చి 27న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్‌ చేశారు. మురళి గోపి అందించిన ఈ కథను లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై సుబాస్కరన్, ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. మోహన్ లాల్ ఖురేషి-అబ్రామ్ అలియా స్టీఫెన్ నెడుంపల్లిగా తెరపైకి మళ్లీ రాబోతోన్నారు.

ఎల్2 ఎంపురాన్ కీలక పాత్రలు

ఎల్2 ఎంపురాన్ చిత్రంలో డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్‌తోపాటు స్టార్ హీరో టోవినో థామస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయికుమార్, బైజు సంతోష్, ఫాజిల్, సచిన్ ఖేదేకర్, నైలా ఉష, గిజు జాన్, నందు, శివాజీ గురువాయూర్, ఎస్ మణికుట్టన్, మణికుట్టన్ కీలక పాత్రలు పోషించారు.

వివిధ దేశాల్లో షూటింగ్

అలాగే, ఓనెల్, ఎరిక్ ఎబౌనీ, మిఖాయిల్ నోవికోవ్, కార్తికేయ దేవ్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. అక్టోబర్ 5, 2023న ఫరీదాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఆ తర్వాత సిమ్లా, లేహ్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్, చెన్నై, గుజరాత్, హైదరాబాద్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ముంబై, కేరళతో సహా పలు ప్రదేశాలలో షూటింగ్ జరిగింది.

ప్రధాన ఆకర్షణగా

1:2.8 రేషియోతో అనమోర్ఫిక్ ఫార్మాట్‌లో ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్, ఎడిటర్ అఖిలేష్ మోహన్, ఆర్ట్ డైరెక్టర్ మోహన్‌దాస్, స్టంట్ డైరెక్టర్ స్టంట్ సిల్వా, క్రియేటివ్ డైరెక్టర్ నిర్మల్ సహదేవ్, మ్యూజిక్ డైరెక్టర్ దీపక్ దేవ్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నారు.

గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్

కాగా, జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫిబ్రవరి 9న సినిమాలోని పాత్రను పరిచయం చేస్తూ వదిలిన గ్లింప్స్ అందరినీ మెప్పించింది. ఆశీర్వాద్ సినిమాస్, లైకా ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానెల్‌లలో గత కొన్ని రోజులుగా సినిమాలోని అన్ని పాత్రలను రివీల్ చేస్తూ వదిలిన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఐదు భాషల్లో రిలీజ్

ఫిబ్రవరి 26న ఖురేషి-అబ్రహం అలియాస్ స్టీఫెన్ నేడుంపల్లిగా మోహన్‌లాల్ పాత్రను గ్రాండ్‌గా రివీల్ చేయడంతో అభిమానులలో అంచనాలను మరింత పెంచింది. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని మార్చి 27న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ హై ఆక్టేన్, స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం సూపర్ స్టార్ మోహన్ లాల్ అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మరి వారి అంచనాలను ఎల్2 ఎంపురాన్ అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం