థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత మలయాళ హారర్ థ్రిల్లర్ మూవీ వడక్కన్ మరో ఓటీటీలోకి రాబోతుంది. సూపర్ నేచురల్ పవర్స్, ఘోస్ట్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్.. లాంటి కీ ఎలిమెంట్స్ తో సాగే ఈ మూవీ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమే. తెలుగు సినిమాల్లో విలన్, సపోర్టింగ్ రోల్స్ చేసే కిశోర్ ఈ మూవీలో లీడ్ క్యారెక్టర్ లో అదరగొట్టారు.
ఈ ఏడాది మార్చి 7న థియేటర్లలో రిలీజైన వడక్కన్ మూవీకి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ మలయాళ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ఆడియన్స్ ను బాగానే ఎంగేజ్ చేసింది. ఈ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళ ఫస్ట్ పారానార్మల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ మే 5 న ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. ఇంగ్లిష్, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.
ఫస్ట్ మలయాళ పారానార్మల్ థ్రిల్లర్ గా వచ్చిన వడక్కన్ ఇప్పుడు మరో ఓటీటీలోకి రాబోతోంది. ఆహా తమిళ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. తమిళ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు సిద్ధమైంది. జూన్ 6 నుంచి ఆహా తమిళ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కు రాబోతోందని ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేసింది.
వడక్కన్ మూవీ పారానార్మల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఓ టీవీ రియాలిటీ షో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు చేస్తున్నారనేది అంతుబట్టదు. ఈ మిస్టరీని ఛేదించేందుకు కిశోర్ రంగంలోకి దిగుతాడు. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ లో కిశోర్ ఈ మూవీలో యాక్టింగ్ తో అదరగొట్టాడు. అయితే ఈ హత్యలకు కారణం ఎవరనేది విచారించే క్రమంలో పురాతన సంప్రదాయాలకు సంబంధించిన డార్క్ సీక్రెట్స్ బయటపడతాయి.
ద్రావిడ జానపద కథల్లోని అతీంద్రియ శక్తిని ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పొందుతాడు. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తిరిగింది? ఆ హత్యల వెనుక ఉన్నది ఎవరు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
సాజిద్ డైరెక్షన్ లో వచ్చిన వడక్కన్ మూవీ లో కిశోర్, శ్రుతి మీనన్, మెరిని ఫిలిప్, మీనాక్షి ఉన్నిక్రిష్ణన్, మాల పార్వతి తదితరులు కీ రోల్స్ పోషించారు. ఈ సినిమాను ఆఫ్ బీట్ స్టూడియోస్ పై జైదీప్ సింగ్, భవ్య నిధి శర్మ నిర్మించారు. ఈ సినిమా థియేటర్ రిలీజ్ కు ముందే సత్తాచాటింది. 2024లో కెంటుకీలో జరిగిన ఫ్రైట్ నైట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ మూవీ బెస్ట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ అవార్డు అందుకుంది. ఫ్రాన్స్ లో రెడ్ మూవీ అవార్డుల్లో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ గా నిలిచింది.
సంబంధిత కథనం