Premalu Sequel: సూపర్ డూపర్ హిట్ మలయాళం మూవీ సీక్వెల్ వచ్చేస్తోంది.. అనౌన్స్ చేసిన మేకర్స్-malayalam super hit romantic comedy premalu sequel announced mamitha baiju movie sequel to come next year ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Premalu Sequel: సూపర్ డూపర్ హిట్ మలయాళం మూవీ సీక్వెల్ వచ్చేస్తోంది.. అనౌన్స్ చేసిన మేకర్స్

Premalu Sequel: సూపర్ డూపర్ హిట్ మలయాళం మూవీ సీక్వెల్ వచ్చేస్తోంది.. అనౌన్స్ చేసిన మేకర్స్

Hari Prasad S HT Telugu
Apr 19, 2024 10:31 PM IST

Premalu Sequel: మలయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమలు సీక్వెల్ అనౌన్స్ చేశారు. అన్ని సౌత్ భాషల్లోనూ రానున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

సూపర్ డూపర్ హిట్ మలయాళం మూవీ సీక్వెల్ వచ్చేస్తోంది.. అనౌన్స్ చేసిన మేకర్స్
సూపర్ డూపర్ హిట్ మలయాళం మూవీ సీక్వెల్ వచ్చేస్తోంది.. అనౌన్స్ చేసిన మేకర్స్

Premalu Sequel: ఈ ఏడాది మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన సూపర్ హిట్ మూవీ ప్రేమలు. నస్లెన్ కే గఫూర్, మమితా బైజు నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. తెలుగులోనూ రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమాకు తాజాగా సీక్వెల్ అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని మేకర్స్ శుక్రవారం (ఏప్రిల్ 19) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ప్రేమలు సీక్వెల్

మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమలు సినిమా ఈ ఏడాది ఏకంగా రూ.135 కోట్లకుపైగా వసూలు చేసిన విషయం తెలిసిందే. తెలుగులోనూ రూ.15 కోట్లకుపైగా వచ్చాయి. దీంతో మూవీ సీక్వెల్ తీయాలని మేకర్స్ నిర్ణయించారు. ప్రేమలు 2 పేరుతో ఈ సినిమా రానుంది. ఎక్స్ ద్వారా మూవీ సీక్వెల్, టైటిల్ ను రివీల్ చేశారు.

"మలయాళం సినిమాలో గతంలో ఎన్నడూ లేని అతిపెద్ద రొమాంటిక్ కామెడీ బ్లాక్ బస్టర్ మూవీ 2025లో మళ్లీ వస్తోంది. ప్రేమలు 2 చేసుకుందాం" అనే క్యాప్షన్ తో ఈ సీక్వెల్ ను అనౌన్స్ చేశారు. మలయాళంతోపాటు తెలుగు, తమిళ భాషల్లో టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

సీక్వెల్ కు కూడా గిరీష్ ఏడీ దర్శకత్వం వహించనున్నాడు. తమ క్యూట్ లవ్ స్టోరీతో మరోసారి అలరించడానికి నస్లెన్, మమితా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రేమలు మూవీని హీరో సచిన్ యూకే వెళ్తున్న సీన్ తో ముగించారు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కంటిన్యూ చేద్దామని చెప్పి అతనికి నుదిటిపై ముద్దు పెట్టి వెళ్లిపోతుంది హీరోయిన్ రీనూ రాయ్. దీంతో సీక్వెల్లో వీళ్ల లవ్ స్టోరీ ఎలా ముందుకు సాగుతుందో అన్న ఆసక్తి నెలకొంది.

ప్రేమలు ఎలా ఉందంటే?

యూత్‌ఫుల్ ల‌వ్ స్టోరీస్ చాలా వ‌ర‌కు బాధ్య‌త‌లేకుండా జులాయిగా తిరిగే మాస్ అబ్బాయి, మంచి పొజిష‌న్ ఉన్న క్లాస్ అమ్మాయి జీవితాల‌ చుట్టే తిరుగుతుంటాయి. ఈ ఎవ‌ర్‌గ్రీన్ కాన్సెప్ట్‌ను ఎంతో మంది ద‌ర్శ‌కులు ఎన్నో ర‌కాలుగా తెర‌కెక్కించారు. ప్రేమ‌లు కూడా అలాంటి రొటీన్ ల‌వ్‌స్టోరీనే.

జీవితంలో సెటిల్ కానీ, ఎలాంటి బ‌రువు బాధ్య‌త‌లు లేకుండా తిరిగే కుర్రాడు ఎలా ఉంటాడో అలాగే హీరో పాత్ర క‌నిపిస్తుంది. హీరోయిన్ పాత్ర‌లో స‌గ‌టు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌లానే జోవియ‌ల్‌గా క‌నిపిస్తుంది. ఆఫీస్ టెన్ష‌న్స్‌, ప్ర‌పోజ‌ల్స్‌, రిజెక్ట్ చేస్తే వ‌చ్చే ఇబ్బందుల‌ను క్యాజువ‌ల్‌గా స్క్రీన్‌పై ఆవిష్క‌రించాడు. నేటి అమ్మాయిలు, అబ్బాయిల మ‌ధ్య స్నేహాలు, స‌ర‌దాల‌ను చాలా క్లీన్‌గా ఎలాంటి వ‌ల్గారిటీ లేకుండా చూపించాడు.

ఈ సినిమాకు మిమితా బైజు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. రీనూ పాత్ర‌లో త‌న క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌, నాచుర‌ల్ ప‌ర్ఫార్మెన్స్‌తో ఫిదా చేసింది. బొమ్మ‌రిల్లులో జెనిలీయాలో సినిమా మొత్తం త‌న డామినేష‌న్‌క‌నిపిస్తుంది. స‌చిన్ పాత్ర‌లో న‌స్లేన్ కూడా ఆక‌ట్టుకున్నాడు. స‌గ‌టు కుర్రాడి పాత్ర‌కు ప‌ర్‌ఫెక్ట్‌గా స‌రిపోయాడు.

ఈ సినిమాను తెలుగులో రాజమౌళి తనయుడు కార్తికేయ తీసుకొచ్చాడు. ఈ మూవీ అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ డబ్బింగ్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు ప్రేమలు 2 మూవీని కూడా కార్తికేయనే తీసుకురానున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది.

Whats_app_banner