ఐదు భాషల్లో ఒక రోజు ముందే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన సూపర్ హిట్ మలయాళం కామెడీ మూవీ.. నవ్వించే సీరియల్ కిల్లర్-malayalam super hit comedy movie maranamass now streaming on sony liv ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఐదు భాషల్లో ఒక రోజు ముందే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన సూపర్ హిట్ మలయాళం కామెడీ మూవీ.. నవ్వించే సీరియల్ కిల్లర్

ఐదు భాషల్లో ఒక రోజు ముందే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన సూపర్ హిట్ మలయాళం కామెడీ మూవీ.. నవ్వించే సీరియల్ కిల్లర్

Hari Prasad S HT Telugu

మలయాళం సూపర్ హిట్ కామెడీ మూవీ ఒక రోజు ముందే ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఓ నగరాన్ని భయపెట్టే సీరియల్ కిల్లర్ ప్రేక్షకులను నవ్వించడానికి వచ్చేశాడు. ఈ ఏడాది అత్యధిక వసూళ్ల టాప్ 10 మలయాళం సినిమాల్లో ఇదీ ఒకటి.

ఐదు భాషల్లో ఒక రోజు ముందే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన సూపర్ హిట్ మలయాళం కామెడీ మూవీ.. నవ్వించే సీరియల్ కిల్లర్

మలయాళం స్టార్ హీరోల్లో ఒకడైన బేసిల్ జోసెఫ్ నటించిన మూవీ మరణమాస్ (Maranamass). గత నెల 10న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. చెప్పిన తేదీ కంటే ఒక రోజు ముందే అంటే బుధవారం (మే 14) మధ్యాహ్నం 3 గంటల నుంచే స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. తెలుగు సహా మొత్తంగా ఐదు భాషల్లో ఈ సినిమా చూడొచ్చు.

మరణమాస్ ఓటీటీ స్ట్రీమింగ్

ఈ ఏడాది మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన టాప్ 10 అత్యధిక వసూళ్ల సినిమాల్లో మరణమాస్ కూడా ఒకటి. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.19.5 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నిజానికి సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినా.. సక్సెస్ సాధించడం విశేషం. అయితే ఐఎండీబీలో మాత్రం 8 రేటింగ్ సంపాదించింది. ఈ సినిమా బుధవారం (మే 14) మధ్యాహ్నం నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

“ది మ్యాన్, ది మ్యాడ్‌నెస్, ది మాస్.. ల్యూక్ వచ్చేశాడు. గందరగోళానికి ఓ కొత్త పేరు ఇది” అనే క్యాప్షన్ తో సోనీలివ్ ఓటీటీ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని వెల్లడించింది. నిజానికి గురువారం (మే 15) నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ ఉంటుందని మొదట్లో చెప్పినా.. ఒక రోజు ముందే తీసుకొచ్చింది.

మరణమాస్ మూవీ గురించి..

మరణమాస్ మూవీని శివప్రసాద్ డైరెక్ట్ చేశాడు. ప్రముఖ మలయాళ నటుడు టొవినో థామస్ నిర్మాతల్లో ఒకడిగా ఉండటం విశేషం. ఇందులో బేసిల్ జోసెఫ్ లీడ్ రోల్లో నటించాడు. అతనితోపాటు రాజేష్ మాధవన్, సిజు సన్నీ, బాబు ఆంటోనీ, అనిష్మా అనిల్ కుమార్, సురేష్ కృష్ణ నటించారు.

ఈ మరణమాస్ మూవీ ఓ సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. అతడు ఓ నగరాన్ని వణికిస్తూ తిరుగుతుంటాడు. కానీ ఓ రాత్రి అనుకోకుండా అతనితోపాటు అతడు టార్గెట్ చేసిన వ్యక్తి, ఓ అమ్మాయి, అతని లవర్, కొందరు ఇతరులు ఓ బస్సులో చిక్కుకుంటారు. ఆ తర్వాత స్టోరీ సాగే తీరు, ఊహకందని క్లైమ్యాక్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ప్రస్తుతం మరణమాస్ మూవీ మలయాళంతోపాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఓటీటీలోకి ఇలా వచ్చిందో లేదో అప్పుడే ఐబొమ్మలాంటి పైరసీ సైట్లలోనూ ఈ సినిమా వచ్చేయడం గమనార్హం.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం