Krithi Shetty: కృతిశెట్టి నాకంటే మెచ్యుర్.. తెలుగులో సినిమా చేయమంది.. టొవినో థామస్ కామెంట్స్
Tovino Thomas About Krithi Shetty In Arm Pre Release Event: మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ తెలుగు బేబమ్మ కృతిశెట్టిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అతని లేటెస్ట్ మూవీ ఆర్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తనకంటే కృతిశెట్టి మెచ్యూర్‌గా ఆలోచిస్తుందని టొవినో థామస్ చెప్పాడు.
Tovino Thomas About Krithi Shetty: మాలీవుడ్ స్టార్ హీరో టోవినో థామస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా పాంటసీ మూవీ ఆర్మ్. తన కెరీర్‌లో 50వ సినిమాగా వస్తోన్న ఆర్మ్ సెప్టెంబర్ 12న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో విడుదల చేస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్స్‌గా చేశారు.
డెబ్యుటెంట్ డైరెక్టర్‌గా జితిన్ లాల్ ఆర్మ్ మూవీతో పరిచయం కానున్నారు. మ్యాజిక్ ఫ్రేమ్స్, యూజీఎమ్ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్, డాక్టర్ జకారియా థామస్ కలిసి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఆర్మ్ ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి స్పందన వచ్చింది. ఇటీవల ఆర్మ్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా నిర్వహించారు.
మైత్రీ మూవీ మేకర్స్ ఒక బ్రాండ్
ఆర్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే కృతిశెట్టిపై టొవినో థామస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. "అందరికీ నమస్కారం. మైత్రీ మూవీ మేకర్స్ అంటే ఒక బ్రాండ్. వారు మా సినిమాని తెలుగులో రిలీజ్ చేయడం గౌరవంగా భావిస్తున్నాం" అని టొవినో థామస్ అన్నాడు.
"దర్శకుడు ఈ కథ చెప్పి మూడు క్యారెక్టర్స్ ప్లే చేయమని అడిగినప్పుడు.. మూడు క్యారెక్టర్స్‌ని చేయగలనా ? అని అలోచించాను. మరో ఇద్దరు యాక్టర్స్‌ని తీసుకోవచ్చు కదా అని అడిగాను. మూడు పాత్రలని నేనే ఎందుకు చేయాలో వారు చెప్పిన తర్వాత కన్విన్స్ అయ్యాను. ఆక్కడ నుంచి ఈ సినిమా ఒక డ్రీమ్‌లా జరిగింది. మరో మూడు రోజుల్లో ఆ కల నిజం కాబోతోంది" అని టొవినో థామస్ తెలిపాడు.
పార్ట్ అవ్వాలని ఉంది
"ఆ ఆర్మ్ సినిమాపై మేమంతా చాలా నమ్మకంగా ఉన్నాం. రోహిణీ మేడం గారితో ఇది నా మూడో సినిమా. తను వండర్‌ఫుల్ పర్ఫార్మర్. హరీష్‌తో పని చేయడం మూడోసారి. ఇందులో తన పాత్ర అందరినీ అలరిస్తుంది. ఐశ్వర్య క్యారెక్టర్ ఈ కథకి డ్రైవ్. తను అద్భుతంగా నటించింది. కృతి నాకంటే చాలా మెచ్యూర్‌గా ఆలోచిస్తుంది. తను తెలుగులో సినిమా చేయమని చెప్పేది. నిన్న ఓ ఫంక్షన్‌కి వెళ్లినప్పుడు ఇక్కడ ప్రజలు ఎంతగా ప్రేమిస్తారో అర్ధమైంది. ఈ ఇండస్ట్రీలో పార్ట్ అవ్వాలని ఉంది" అని టొవినో చెప్పుకొచ్చాడు.
"సెప్టెంబర్ 12 "ఆర్మ్" త్రీడీ థియేటర్స్‌లోకి వస్తుంది. అందరూ చూడండి. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అందరం టీంగా పని చేశాం. అందరూ సినిమాని చూస్తారని ఆశిస్తున్నాను. సినిమా మీకు నచ్చుతుంది. సినిమా మీకు నచ్చితే ప్లీజ్ స్ప్రెడ్ ది వర్డ్. అది మాకు చాలా హెల్ప్ అవుతుంది. థాంక్ యూ సో మచ్" అని టొవినో థామస్ తన స్పీచ్ ముగించాడు.
టొవినో థామస్ సినిమాలు
కాగా మలయాళంలో పాపులర్ హీరోగా పేరు తెచ్చుకున్న టొవినో థామస్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మిన్నల్ మురళి వంటి సూపర్ హీరో మూవీతో మంచి విజయం అందుకున్నాడు. ఇక 2018, అన్వేషిప్పిన్ కండేతుమ్, ఫొరెన్సిక్, మాయానది సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. లూసీఫర్‌లో సైడ్ రోల్‌తో, మారి 2లో విలన్‌గా అలరించాడు.