ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన మలయాళం సీరియల్ కిల్లర్ మూవీస్ ఇవే.. సూపర్ థ్రిల్ గ్యారెంటీ-malayalam serial killer movies on ott if you like maranamass watch on sony liv prime video sun nxt ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన మలయాళం సీరియల్ కిల్లర్ మూవీస్ ఇవే.. సూపర్ థ్రిల్ గ్యారెంటీ

ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన మలయాళం సీరియల్ కిల్లర్ మూవీస్ ఇవే.. సూపర్ థ్రిల్ గ్యారెంటీ

Hari Prasad S HT Telugu

రీసెంట్ గా వచ్చిన మలయాళం సీరియల్ కిల్లర్ మూవీ మరణమాస్ నచ్చిందా? అయితే ఓటీటీలో ఉన్న ఈ సీరియల్ కిల్లర్ సినిమాలు కూడా మిస్ కాకుండా చూడండి. మీకు మంచి థ్రిల్ గ్యారెంటీగా వస్తుంది. ఆ మూవీస్ ఏవి? ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన మలయాళం సీరియల్ కిల్లర్ మూవీస్ ఇవే.. సూపర్ థ్రిల్ గ్యారెంటీ

సీరియల్ కిల్లర్ చుట్టూ తిరిగే కథతో వచ్చిన డార్క్ కామెడీ మూవీ మరణమాస్ ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే మలయాళంలో ఇలా కామెడీ కాకుండా సీరియస్ గా సాగే సీరియల్ కిల్లర్ సినిమాలు ఇంకా చాలానే ఉన్నాయి. వాటిలో బెస్ట్ మూవీస్ ఏవి? వాటిని ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూడాలో తెలుసుకోండి.

అంజామ్ పతీరా - సన్ నెక్ట్స్

మలయాళ స్టార్ నటుడు కుంచకో బొబన్ నటించిన మూవీ ఈ అంజామ్ పతీరా. సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో అయితే మిడ్ నైట్ మర్డర్స్ పేరుతో యూట్యూబ్ లోనూ ఉంది. పోలీస్ ఆఫీసర్లను లక్ష్యంగా చేసుకొని చంపే ఓ సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడానికి అన్వర్ హుస్సేన్ (కుంచకో బొబన్) అనే క్రిమినాలజిస్ట్ సాయం తీసుకుంటారు పోలీసులు. అతడు ఈ కేసును ఎలా పరిష్కరిస్తాడన్నది ఈ సినిమాలో ఆసక్తికర పాయింట్.

పాప్పన్ - జీ5 ఓటీటీ

జోషి డైరెక్ట్ చేసిన ఈ పాప్పన్ మూవీలో సురేష్ గోపి లీడ్ రోల్లో నటించాడు. ఓ హత్య కేసు పరిష్కరించడానికి రిటైర్డ్ క్రైమ్ బ్రాంచ్ ఎస్పీ అబ్రహం మాథ్యూ మాథన్ ను మళ్లీ పిలుస్తారు. ఈ కేసు దర్యాప్తు చాలా ఇంట్రెస్టింగా సాగుతుంది. ఈ పాప్పన్ మూవీకి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఐఎండీబీలో 6.7 రేటింగ్ ఉంది.

అంతాక్షరి - ప్రైమ్ వీడియో

అంతాక్షరి మూవీ
అంతాక్షరి మూవీ

సినిమా మొదటి నుంచి చివరి వరకూ అస్సలు ఎక్కడా మిస్ కాకుండా చూస్తేనే ఈ అంతాక్షరి అర్థమవుతుంది. ఇది కూడా ఓ సీరియల్ కిల్లర్ చుట్టూ తిరిగే స్టోరీయే. విపిన్ దాస్ డైరెక్ట్ చేశాడు. తన భార్య అయినా, క్రిమినల్స్ అయినా ఎవరితో అయినా అంతాక్షరి ఆడటాన్ని సరదాగా భావించే సీఐ దాస్.. ఈ సీరియల్ కిల్లర్ కేసును ఎలా పరిష్కరిస్తాడన్నది ఈ మూవీలో చూడొచ్చు. ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

గ్రాండ్‌మాస్టర్ - సన్ నెక్ట్స్ ఓటీటీ

మోహన్ లాల్ లీడ్ రోల్లో నటించిన మూవీ గ్రాండ్‌మాస్టర్. ఇందులో అతడు ఐపీఎస్ ఆఫీసర్ చంద్రశేఖర్ పాత్రలో నటించాడు. ఓ సీరియల్ కిల్లర్ వరుస హత్యలతో విసిరే సవాలును అతడు ఎలా స్వీకరిస్తాడన్నదే ఈ మూవీ స్టోరీ. సీరియల్ కిల్లర్ వదిలే అంతుచిక్కని క్లూస్ ద్వారా అతడు ఈ కేసును పరిష్కరించే ప్రయత్నం చేస్తాడు. ఈ మూవీని సన్ నెక్ట్స్ ఓటీటీలో చూడొచ్చు.

బౌగేన్‌విల్లే - సోనీలివ్ ఓటీటీ

ఇది వరుసగా మహిళలను హతమార్చే సీరియల్ కిల్లర్ చుట్టూ తిరిగే స్టోరీ. సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కుంచకో బొబన్, ఫహాద్ ఫాజిల్ లాంటి వాళ్లు నటించారు. ఈ మూవీలో చివర్లో వచ్చే ట్విస్ట్ మంచి థ్రిల్ పంచుతుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం