ఐఎండీబీలో 9.2 రేటింగ్ ఉన్న మలయాళం రొమాంటిక్ మూవీ.. ఓటీటీలోకి వచ్చేస్తోంది-malayalam romantic drama abhilasham ott release date saiju kurup movie to stream on prime video from 23rd may ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఐఎండీబీలో 9.2 రేటింగ్ ఉన్న మలయాళం రొమాంటిక్ మూవీ.. ఓటీటీలోకి వచ్చేస్తోంది

ఐఎండీబీలో 9.2 రేటింగ్ ఉన్న మలయాళం రొమాంటిక్ మూవీ.. ఓటీటీలోకి వచ్చేస్తోంది

Hari Prasad S HT Telugu

ఓ మలయాళం రొమాంటిక్ డ్రామా సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ నటుడు సైజు కురుప్ నటించిన ఈ సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 9.2 రేటింగ్ ఉండటం విశేషం. మరి ఈ సినిమా ఓటీటీ వివరాలేంటో చూడండి.

ఐఎండీబీలో 9.2 రేటింగ్ ఉన్న మలయాళం రొమాంటిక్ మూవీ.. ఓటీటీలోకి వచ్చేస్తోంది

మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన లేటెస్ట్ డ్రామా అభిలాషం (Abhilasham). మార్చి 29న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. అయితే ఐఎండీబీలో మాత్రం ప్రేక్షకులు 9.2 రేటింగ్ ఇచ్చారు. ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. వచ్చే వారమే ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.

అభిలాషం ఓటీటీ రిలీజ్ డేట్

మలయాళం నటుడు సైజు కురుప్ నటించిన మూవీ అభిలాషం. ఈ సినిమా మే 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. కేవలం మలయాళం ఆడియోతోనే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ మూవీ రానుంది.

మార్చి 29న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఇందులో సైజు కురుప్ తోపాటు అర్జున్ అశోకన్, తన్వి రామ్ నటించారు. ఈ సినిమా మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. దీంతో బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

అభిలాషం మూవీ గురించి..

అభిలాషం మూవీ అభిలాష్ కుమార్ అనే ఓ వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. కొట్టక్కల్ లో అతడు ఓ అత్తరు షాపు, కొరియర్ సర్వీస్ నడుపుతుంటాడు. అతని స్కూల్ ఫ్రెండ్, చిన్ననాటి క్రష్ అయిన షెరిన్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ అదే టౌన్ కు తిరిగి వస్తుంది. అప్పటికే ఆమెకు పెళ్లై ఓ సంతానం కూడా ఉంటుంది.

సింగిల్ మదర్ కావడంతో అభిలాష్ మరోసారి ఆమెకు తన ఫీలింగ్ చెప్పడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ ఎప్పటికప్పుడు అది చెప్పలేక బాధపడుతుంటాడు. అతడు తనకిష్టమైన ఆ అమ్మాయి ముందు తన ఫీలింగ్స్ ను చెబుతాడా లేదా అన్నదే ఈ అభిలాషం మూవీ స్టోరీ. ఓ సింపుల్ స్టోరీకి కాస్త కామెడీని జోడించి ఈ సినిమాను తీసుకొచ్చారు.

ఆ అభిలాష్ పాత్రను సైజు కురుప్ పోషించగా.. తన్వీ రామ్ ఆ సింగిల్ మదర్ పాత్రలో నటించింది. ఈ సినిమాను షంజు జైబా డైరెక్ట్ చేశారు. అర్జున్ అశోకన్, బిను పప్పు, నవస్ వల్లిక్కున్ను, ఉమా కేపీ, నీరజ రాజేంద్రన్, షీతల్ జకారియా, అజిషా ప్రభాకరన్ లాంటి వాళ్లు నటించారు. సైజు ఈ మధ్యే వచ్చిన దావీద్ సినిమాలోనూ నటించాడు. ఈ సినిమా ఇప్పటికే జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం