Romantic Thriller OTT: తెలుగులోకి వచ్చిన మలయాళం రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ - భార్య మాజీ ప్రియుడిపై భ‌ర్త రివేంజ్‌-malayalam romantic comedy thriller movie mandakini telugu version now streaming on etv win ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Romantic Thriller Ott: తెలుగులోకి వచ్చిన మలయాళం రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ - భార్య మాజీ ప్రియుడిపై భ‌ర్త రివేంజ్‌

Romantic Thriller OTT: తెలుగులోకి వచ్చిన మలయాళం రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ - భార్య మాజీ ప్రియుడిపై భ‌ర్త రివేంజ్‌

Nelki Naresh HT Telugu

Mandakini OTT: మ‌ల‌యాళం రొమాంటిక్ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ మందాకిని తెలుగులోకి వ‌చ్చింది. గురువారం ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. మందాకిని మూవీలో అల్తాఫ్ స‌లీమ్‌, అనార్క‌లి మ‌రిక్క‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టించారు

రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ

Romantic Thriller OTT: మలయాళం క‌మెడియ‌న్ అల్తాఫ్ స‌లీమ్ హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ మందాకిని తెలుగులోకి వచ్చింది. గురువారం ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. ఎలాంటి ముంద‌స్తు అనౌన్స్‌మెంట్ లేకుండా సెలైంట్‌గా ఈ మూవీని ఈటీవీ విన్ ఓటీటీలోకి తీసుకొచ్చింది. ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోన్న విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్న‌ది. మందాకిని మూవీకి వినోద్ లీలా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అనార్క‌లి మ‌రిక్క‌ర్ హీరోయిన్‌గా న‌టించింది.

మూడు కోట్ల క‌లెక్ష‌న్స్‌...

ఎలాంటి అంచానాలు లేకుండా గ‌త ఏడాది మే నెల‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన మందాకిని మూవీ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. కోటి రూపాయల లోపు బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన మందాకిని మూవీ మూడు కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. వైరెటీ కాన్సెప్ట్‌తో పాటు కామెడీతో ఈ మూవీ అభిమానుల‌ను మెప్పించింది. ముఖ్యంగా అల్తాఫ్ స‌లీమ్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. మందాకిని మూవీ మ‌ల‌యాళ వెర్ష‌న్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

మందాకిని క‌థ ఇదే...

అరోమ‌ల్ (అల్తాఫ్‌ స‌లీమ్‌), అంబిలికి (అనార్క‌లి మ‌రిక్క‌ర్‌) పెద్ధ‌లు పెళ్లి జ‌రిపిస్తారు. ఫ‌స్ట్ నైట్ రోజు అరోమ‌ల్ ఫ్రెండ్స్ కూల్ డ్రింక్‌లో మ‌ద్యం క‌లిపి అత‌డి చేత సీక్రెట్‌గా తాగించాల‌ని ప్లాన్ చేస్తారు. అనుకోకుండా మ‌ద్యం క‌లిపిన కూల్ డ్రింక్‌ను అంబిలి తాగేస్తుంది.

తాగిన మ‌త్తులో త‌న ల‌వ్ ఎఫెర్ గురించి భ‌ర్త‌తో చెబుతుంది. సుజీత్ అనే వ్య‌క్తి ప్రేమ పేరుతో త‌న‌ను వంచించాడ‌నే నిజం బ‌య‌ట‌పెడుతుంది. అంబిలి ల‌వ్ ఎఫైర్ గురించి ఫ‌స్ట్ నైట్ రోజే బ‌య‌ట‌ప‌డ‌టంతో అరోమ‌ల్ ఏం చేశాడు? అంబిలినిమోసం చేసిన సుజీత్‌పై అరోమ‌ల్‌తో పాటుఅత‌డి కుటుంబం ఎలా రివేంజ్ తీర్చుకున్నారు? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

2018 డైరెక్ట‌ర్‌...

మందాకిని మూవీలో మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 2018 ద‌ర్శ‌కుడు జూడ్ అంథోనీ జోస‌ఫ్‌తో పాటు ది గ్రేట్ ఇండియ‌న్ కిచెన్ డైరెక్ట‌ర్ జియో బేబీ ఓ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. ప్రేమ‌మ్ సినిమాతో క‌మెడియ‌న్‌గా మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇచ్చాడు అల్తాఫ్ స‌లీమ్‌. మందాకిని మూవీ ద్వారా హీరోగా మారాడు. మందాకిని కంటే ముందు ఒరు అదార్ ల‌వ్‌, ఆప‌రేష‌న్ జావా, ముకుంద‌న్ ఉన్ని అసోసియేట్స్‌, గోల్డ్‌, ప్రేమ‌లుతో పాటు ప‌లు సినిమాల్లో హీరో ఫ్రెండ్‌గా, క‌మెడియ‌న్‌గా విభిన్న‌మైన క్యారెక్ట‌ర్స్‌లో క‌నిపించాడు.

నివీన్ పాల్‌తో...

క‌మెడియ‌న్‌గానే కాకుండా ద‌ర్శ‌కుడిగా నివీన్ పాల్‌తో ఓ సినిమా చేశాడు అల్తాఫ్ స‌లీమ్‌. నందుకలుడే నత్తిల్ ఒరిడవేలా టైటిల్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. అనార్క‌లి మ‌రిక్క‌ర్ కూడా మ‌ల‌యాళంలో విమానం, ఉయ‌రే, అమ‌ల‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేసింది.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం