మలయాళం మూవీ రాహెల్ మకాన్ కోరా తెలుగులోకి వచ్చింది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ బుధవారం సైనా ప్లే ఓటీటీలో రిలీజైంది. అన్సన్ పాల్, మెర్లిన్ ఫిలిప్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో స్మిను సిజో ఓ కీలక పాత్రలో నటించింది.
మలయాళంలో ఈ మూవీ 2023లోనే రిలీజైంది. తెలుగు వెర్షన్ మాత్రం రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. రాహెల్ మకాన్ కోరా మూవీకి ఉబైయిన్ అబ్రహం దర్శకత్వం వహించాడు. తల్లీకొడుకుల అనుబంధానికి లవ్‌స్టోరీ, కామెడీని జోడించి డైరెక్టర్ ఈ మూవీని రూపొందించాడు.
తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు గౌతమిపై పడతాడు. కాంట్రాక్ట్ కండక్టర్‌గా జాబ్‌లో జాయిన్ అవుతుంది. కండక్టర్ పోస్ట్‌కు రెగ్యులర్ ఎంప్లాయ్‌గా కోరా అపాయింట్ కావడంతో గౌతమి జాబ్ పోతుంది. ఈ విషయం తెలిసి కోరా బాధపడతాడు. ఓ బట్టల దుకాణంలో పనిచేస్తోన్న గౌతమితో పరిచయం పెంచుకుంటాడు. ఆమె ప్రభుత్వ ఉద్యోగం పొందేలా సహాయం చేస్తాడు. ఈ క్రమంలోనే కోరా, గౌతమి ప్రేమలో పడతారు. కానీ వారి పెళ్లికి కోరా తల్లి రాహెల్ ఓ కండీషన్ పెడుతుంది. అదేమిటి? భిన్న మతాలకు చెందిన కోరా, గౌతమి పెళ్లికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నదే ఈ మూవీ కథ.
రెహెల్ మకాన్ కోరా థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. స్మిను సిజో, అన్సన్ పాల్ కాంబో కామెడీ వర్కవుట్ అయినా మెయిన్ కాన్‌ఫ్లిక్ట్‌లో బలం లేకపోవడంతో మూవీ యావరేజ్‌గా నిలిచింది. ఎమ్మెల్యే పాత్రలో అల్తాఫ్ సలీమ్ క్యారెక్టర్ కామెడీ పరంగా ఈ సినిమాకు ప్లస్సయ్యింది.
మలయాళ హీరోయిన్ అయినా మెర్లిప్ ఫిలిప్ తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసింది. బద్మాష్‌గాళ్లకు బంపర్ ఆఫర్ తో పాటు మరికొన్ని చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించింది. మలయాళంలో కథానాయికగా నటిస్తూనే సూక్ష్మదర్శిని, వడక్కన్ వంటి సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసింది. వాథిల్, హ్యాపీ సర్ధార్ సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించింది.
అన్సన్ పాల్ కూడా తమిళ, మలయాళ భాషల్లో హీరోగా, విలన్‌గా పలు సినిమాలు చేశాడు. రాజేష్ ఎమ్ సెల్వ దర్శకత్వంలో రూపొందుతోన్న ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఈ మూవీలో అదితిరావ్ హైదరీ, కేతికా శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
సంబంధిత కథనం