OTT Malayalam Romantic Comedy: మలయాళం సినిమాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఈ వారం కొన్ని ఇంట్రెస్టింగ్ మలయాళం సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి. అయితే అందులో ఒక రొమాంటిక్ కామెడీ మాత్రం మూడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి అడుగుపెడుతోంది. ఈ సినిమా పేరు పెయిన్‌కిలీ (Painkili).
మొదట కేవలం మనోరమ మ్యాక్స్ లో మాత్రమే వస్తుందని చెప్పినా.. ఈ ఓటీటీలో వచ్చే ప్రతి మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అడుగుపెడుతోంది. ఆ లెక్కన పెయిన్‌కిలీ కూడా అదే రోజు మనోరమ మ్యాక్స్ తోపాటు ప్రైమ్ వీడియోలోకి వస్తుందని ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది.
దీంతోపాటు ఈ సినిమాను శుక్రవారం నుంచే స్ట్రీమింగ్ చేయనున్నట్లు సింప్లీ సౌత్ ఓటీటీ కూడా అధికారికంగా ప్రకటించింది. దీంతో ఒకే రోజు ఈ మూవీ మూడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి వస్తున్నట్లయింది.
పెయిన్‌కిలి మూవీలో సజిన్ గోపు, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమాలో సుకు అనే పాత్రలో సజిన్ నటించాడు. ఫహాద్ ఫాజిల్ నటించిన ఆవేశం మూవీలో అంబన్ పాత్రలో మెప్పించిన సజిన్.. ఈ పెయిన్‌కిలిలోనూ బాగానే నటించాడు. ఈ సినిమాలో అతడు పిచ్చివాడిగా నటిస్తాడు.
తన ఫ్రెండ్ మరణానికి తానే కారణమని భావించే అతడిని పిచ్చాసుపత్రిలో చేరుస్తారు. అక్కడే అతడు ప్రేమలో పడతాడు. ఇందులో షీబా అనే పాత్రలో అనస్వర నటించింది. ఎవరితోనైనా సరే లేచిపోవాలని చూసే పాత్ర ఆమెది. ఈ ఇద్దరూ కలిసిన తర్వాత మూవీ నవ్వులు పంచుతూ సాగుతుంది.
జిస్మా విమల్, రోషన్ షానవాస్, అబు సలీమ్, చందు సలీంకుమార్ లాంటి వాళ్లు ఈ మూవీలో నటించారు. శ్రీజిత్ బాబు ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. రోమాంచం, ఆవేశంలాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన జీతూ మాధవన్ కథ అందించాడు.
ఇక మరో మలయాళం మూవీ ఒరు జాతి జాతకం మూవీ కూడా మనోరమ మ్యాక్స్ ఓటీటీలోకే వచ్చింది. వినీత్ శ్రీనివాసన్ లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది. ఏప్రిల్ 1 నుంచే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఇది ఓ కామెడీ ఎంటర్టైనరే. ఎం. మోహనన్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో నిఖిల విమల్, కయదు లోహర్, ఇందు తంపి, సయోనారా ఫిలిప్ లాంటి వాళ్లు కూడా నటించారు.