Malayalam OTT: మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ అన్పోడు కన్మణి సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. మంగళవారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. అన్పోడు కన్మణి మూవీలో అర్జున్ అశోకన్, అనఘా నారాయణన్ హీరోహీరోయిన్లుగా నటించారు. అల్తాఫ్ ఆస్లామ్, మాలా పార్వతి కీలక పాత్రలు పోషించారు.లిజు తోమజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సామ్యూల్ అబే మ్యూజిక్ అందించాడు.
ఈ ఏడాది జనవరిలో థియేటర్లలో రిలీజైన అన్పోడు కన్మణి హిట్టు టాక్‌ను తెచ్చుకున్నది. సామాజిక కట్టుబాట్లకు, తమ స్వేచ్ఛ స్వాత త్య్రాలకు మధ్య నలిగిపోతూ ఓ జంట ఎలాంటి సంఘర్షణను ఎదుర్కొంది అన్నది ఫన్నీగా దర్శకుడు ఈ మూవీలో చూపించారు. బాడీ షేమింగ్, సంతాన లేమి వంటి సమస్యలను గురించి దర్శకుడు ఈ మూవీలో చర్చించారు. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా ప్రేక్షకుల మెప్పును అన్పోడు కన్మణి మూవీ సొంతం చేసుకున్నది. ఐఎమ్‌డీబీలో ఈ సినిమా 8.8 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
నకుల్, షాలిని లకు కొత్త పెళ్లవుతుంది. లైఫ్‌లో సెటిలైన తర్వాతే పిల్లల గురించి ఆలోచించాలని ఇద్దరు అనుకుంటారు. పెళ్లైనా కొద్ది రోజుల నుంచే పిల్లలను ఎప్పుడు కంటున్నారంటూ పెద్దల నుంచి కొత్త జంటకు ప్రశ్నలు ఎదురవుతుంటాయి.
మరోవైపు జెనెటిక్ ఈష్యూస్ వల్ల షాలిని బరువు పెరగడంతో గుడ్ న్యూస్ చెప్పేస్తున్నావా అంటూ బంధువులు ఆటపట్టిస్తుంటారు. చిన్నవిగానే కనిపించే ఈ మాటలు వారి జీవితాల్లో ఎలాంటి కల్లోలాన్ని రేపాయి. ఈ కట్టుబాట్లను ఎదురించి తమకు నచ్చినట్లు బతకాలనే క్రమంలో వారు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అన్నదే అన్నోడు కన్మణి కథ.
కమల్‌హాసన్ గుణ సినిమాలో కన్మణి అన్పోడు కాదలన్ సాంగ్ స్ఫూర్తితో ఈ సినిమాకు టైటిల్ పెట్టారు. మలయాళంలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు చేస్తోన్నాడు అర్జున్ అశోకన్. గత ఏడాది భ్రమయుగం, అబ్రహం ఓజ్లర్‌తో పాటు మరికొన్ని సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాడు. ఈ ఏడాది ఇటీవల రిలీజైన బ్రొమాన్స్ మూవీతో హీరోగా పెద్ద హిట్ దక్కించుకున్నాడు.
సంబంధిత కథనం