మలయాళం మూవీ ఇరు థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. పొలిటికల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో రాజీవ్ రాజన్, డయాన్ డేవిస్, నయన ఎల్జా, రెంజీ ఫణిక్కర్, విద్యా విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు.
ఇరు మూవీ 2023లో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. యూనివర్సిటీలో రాజకీయాలు ఎలా ఉంటాయి? గొప్పింటి అమ్మాయిని ప్రేమించిన దళిత యువకుడి జీవితం ఎలా ముగిసింది అనే అంశాలతో దర్శకుడు ఎఫ్.ఆర్ వర్గీస్ ఈ మూవీని రూపొందించారు.
రిషి, ప్రియ ఒకే కాలేజీలో చదువుతుంటారు. ప్రియ అగ్ర కులానికి చెందిన అమ్మాయి కావడంతో ఆమె తండ్రి వీరి ప్రేమను అంగీకరించదు. రిషి, ప్రియలను విడగొట్టడానికి పొలిటికల్ లీడర్ రవీంద్రన్ కాలేజీలో గొడవలు సృష్టిస్తాడు. ఈ గొడవలు వల్ల రిషి, ప్రియ జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? తన రాజకీయ స్వార్థం కోసం విద్యార్థుల జీవితాలతో రవీంద్రన్ ఎలా చెలగాటం ఆడాడు? అనే అంశాలతో దర్శకుడు వర్గీస్ ఈ సినిమాను తెరకెక్కించారు.
షేక్స్‌పియర్ రాసిన ఒథెల్లో స్ఫూర్తితో ఈ మూవీ రూపొందింది విషాదాంత ప్రేమకథగా దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించారు. కాన్సెప్ట్, టేకింగ్ బాగుందనే కామెంట్స్ వచ్చిన కమర్షియల్‌గా మాత్రం ఈ మూవీ సరైన విజాయన్ని సాధించలేదు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 6.4 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
ఇరు మూవీతోనే హీరోయిన్‌గా నయన ఎల్జా మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హలో జూన్, గార్డియన్, ఉల్లాసంతో పాటు మరికొన్ని సినిమాలు చేసింది. ఖుర్బానీ, క్రిస్టోఫర్ కొలంబస్, ఎట్ అనే సినిమాల్లో నటిస్తోంది. ఈ మూవీ ద్వారా చాలా మంది కొత్త నటులు మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
ఈ వారం ఓటీటీలోకి ఇరుతో పాటు హంట్, అభిలాషం సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. హంట్ మూవీలో భావన హీరోయిన్‌గా నటించింది. ఈ రెండు సినిమాలు మనోరమా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
సంబంధిత కథనం