OTT Malayalam: నాలుగు నెలల తర్వాత సడెన్‍గా ఓటీటీలోకి వచ్చిన మలయాళ సైన్స్ ఫిక్షన్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడ?
Gaganachari OTT Streaming: మలయాళ మూవీ గగనాచారి ఎట్టకేలకు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ సైన్స్ ఫిక్షన్ కామెడీ మూవీ నేడే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది.
మలయాళంలో కొన్ని చిత్రాలు డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో వస్తుంటాయి. అలాంటి చిత్రమే గగనాచారి. ఈ చిత్రంలో గణేశ్ కుమార్, గోకుల్ సురేశ్, అజు వర్గీస్, ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 21వ తేదీన థియేటర్లలో రిలీజైంది. అరుణ్ చందు దర్శకత్వం వహించిన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే, ఈ గగనాచారి చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.
స్ట్రీమింగ్ వివరాలు
గగనాచారి చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో నేడు (అక్టోబర్ 26) స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ముందస్తుగా ప్రచారం లేకుండా సడెన్‍లో స్ట్రీమింగ్ మొదలైంది. ఈ చిత్రం ప్రస్తుతం మలయాళం ఆడియోలో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇతర భాషల డబ్బింగ్ వెర్షన్‍లపై ఇంకా క్లారిటీ రాలేదు.
గగనాచారి చిత్రం థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చింది. ఈ చిత్రం ఈ ఏడాది జూన్‍లో థియేటర్లలోకి వచ్చింది. డిఫరెంట్ మూవీగా టాక్ తెచ్చుకుంది. డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్, కామెడీ అంశాలతో ఈ చిత్రాన్ని దర్శకుడు అరుణ్ చందూ తెరకెక్కించారు.
ఈ చిత్రంలో గోకుల్, అజు, గణేశ్‍తో పాటు అనార్కలీ మరికర్ కూడా ముఖ్యమైన పాత్ర చేశారు. జాన్ కైప్పల్లిల్, ఆనంద్ బీఎస్, అనంత్ రామన్ కీరోల్స్ చేశారు. ఈ చిత్రానికి శంకర్ శర్మ సంగీతం అందించారు. గగనాచారి చిత్రాన్ని అజిత్ వినాయక ఫిల్మ్స్, కృష్ణద్ ఫిల్మ్స్ బ్యానర్లపై వినాయక అజిత్ ప్రొడ్యూజ్ చేశారు.
గగనాచారి స్టోరీలైన్
కేరళలో 2040 సంవత్సరంలో గగనాచారి మూవీ సాగుతుంది. అప్పుడే యుద్ధం ముగిసి మొత్తాన్ని ప్రభుత్వం నియంత్రిస్తూ ఉంటుంది. ప్రజలను కూడా కట్టడి చేస్తుంటుంది. ఓ ఖాళీ అపార్ట్‌మెంట్‍లోని బంకర్‌లో ఏలియన్ హంటర్ విక్టర్ (గణేశ్ కుమార్), అలన్ (గోకుల్ సురేశ్), వైబ్ వైభవ్ (అజూ వర్గీస్) ఉంటారు. అయితే, వారి బంకర్‌లోకి ఓ ఏలియన్ మహిళ వస్తుంది. ఆ తర్వాత ఆ ముగ్గురికి సవాళ్లు ఎదురవుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ఏలియన్ వల్ల సమస్యలు ఏమైనా వచ్చాయా? అనేది ఈ సినిమాలో ఉంటుంది. ప్రేమ, మూఢనమ్మకాలు, పక్షపాతం అంశాలు ఈ మూవీలో ఉంటాయి.
ప్రైమ్ వీడియోలో ‘శ్వాగ్’
తెలుగు కామెడీ థ్రిల్లర్ చిత్రం ‘శ్వాగ్’ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ శుక్రవారం (అక్టోబర్ 25) సడెన్‍గా అడుగుపెట్టింది. శ్రీవిష్ణు, రితూ వర్మ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. ఐదు పాత్రల్లో నటనలో, గెటప్‍ల్లో వేరియేషన్లతో విష్ణు మెప్పించారు. అక్టోబర్ 4న థియేటర్లలో రిలీజైన శ్వాగ్ మూవీ మూడు వారాల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రానికి హర్షిత్ గోలీ దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీలో మీరా జాస్మీన్, దక్ష నాగర్కర్, సునీల్, రవిబాబు కూడా కీరోల్స్ చేశారు. శ్వాగ్ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఇప్పుడు చూసేయవచ్చు.