విజయ్ బాబు ప్రధాన పాత్ర పోషించిన మలయాళ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘పెండులమ్’ 2023 జూన్ 16వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీకి రెజిన్ ఎస్ బాబు దర్శకత్వం వహించారు. థియేట్రికల్ రన్‍తో మంచి టాకే వచ్చింది. డిఫరెంట్ నరేషన్‍తో ఇంట్రెస్టింగ్‍గా ఈ మూవీ సాగుతుంది. ఇప్పుడు పెండులమ్ సినిమా తెలుగు డబ్బింగ్‍లో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
పెండులమ్ సినిమా తెలుగు వెర్షన్ ఈటీవీ విన్ ఓటీటీలో నేడు (మే 22) స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. మలయాళంలో థియేటర్లలో విడుదలైన రెండేళ్ల తర్వాత తెలుగు డబ్బింగ్‍లో ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీని తెలుగులో ఈటీవీ విన్ ఓటీటీలో చూసేయవచ్చు.
పెండులమ్ చిత్రంలో విజయ్ బాబుతో పాటు రమేశ్ పిశ్రోడి, అనుమోల్, దేవకీ రాజేంద్రన్ , బినోజ్ విల్యా, ప్రకాశ్ బారే, ఇంద్రన్స్, షాజు శ్రీధర్ కీలకపాత్రలు పోషించారు. ఓ కల తర్వాత ఈ మూవీ స్టోరీలో ట్విస్ట్ ఎదురవుతుంది. ఆ తర్వాతి నుంచి గ్రిప్పింగ్‍గా సాగుతుంది. ఈ మూవీని మిస్టరీ ఎలిమెంట్లతో ఇంట్రెస్టింగ్‍గా తెరెకెక్కించారు డైరెక్టర్ రెజిన్.
పెండులమ్ సినిమాను లైట్స్ ఆన్ సినిమాస్, బాట్ బ్రోస్ ఇంటర్నేషనల్, మిథున్స్ మనీ మార్కెట్ బ్యానర్లపై దనిష్ కే అశోకన్, లిషా జోసెఫ్, బినోజ్ విల్యా ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీకి జీన్ పీ జాన్సన్ మ్యూజిక్ ఇవ్వగా.. అరుణ్ దామోదరన్ సినిమాటోగ్రఫీ చేశారు.
తన భార్య శ్వేత (దేవకి రాజేంద్రన్), కూతురు తనూతో కలిసి కొచ్చికి వెళతాడు మహేశ్ నారాయణన్ (విజయ్ బాబు). వాళ్లు ఓ రోజు ట్రిప్‍కు వెళితే.. మహేశ్ స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటాడు. తనను లారీ గుద్దిందని స్పృహలోకి వచ్చాక చెబుతాడు. అయితే అది తన కల అని మహేశ్ గుర్తిస్తాడు. అయితే తన కలతో ఆమిర్, ఏంజెల అనే ఇద్దరికి సంబంధం ఉందని మహేశ్‍కు తెలుస్తుంది. జాన్ మాస్టర్ (ప్రకాశ్ బారే)తో కలిసి ఆ కల ఏంటో తెలుసుకునే ప్రయత్నాన్ని మహేశ్ మొదలుపెడతాడు. అసలు ఆ కలలో ఏం జరిగింది? ఎదుకు దాని గురించి మహేశ్ ఆలోచిస్తాడు? దీని వెనుక మిస్టరీ ఏంటి? గతంలో ఏం జరిగిందనే విషయాలు పెండులమ్ సినిమాలో ఉంటాయి.
కాగా, ఈటీవీ విన్‍లో ప్రస్తుతం ‘అనగనగా’ సినిమా భారీ వ్యూస్ సాధిస్తోంది. సుమంత్ ప్రధాన పాత్ర పోషించిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా సినిమా గత వారం నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చింది.
సంబంధిత కథనం