ఈ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ చూస్తే మైండ్ బ్లాంక్.. పిచ్చెక్కించే ట్విస్టులు.. రేపే తెలుగులో ఓటీటీలోకి.. యూట్యూబ్‌లోనూ..-malayalam mystery thriller movie pendulum review free streaming in youtube etv win ott to stream in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఈ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ చూస్తే మైండ్ బ్లాంక్.. పిచ్చెక్కించే ట్విస్టులు.. రేపే తెలుగులో ఓటీటీలోకి.. యూట్యూబ్‌లోనూ..

ఈ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ చూస్తే మైండ్ బ్లాంక్.. పిచ్చెక్కించే ట్విస్టులు.. రేపే తెలుగులో ఓటీటీలోకి.. యూట్యూబ్‌లోనూ..

Hari Prasad S HT Telugu

మలయాళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి ప్రేక్షకులను థ్రిల్ చేసింది. లూసిడ్ డ్రీమింగ్, టైమ్ ట్రావెల్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా రెండేళ్ల కింద థియేటర్లలో రిలీజ్ కాగా.. గురువారం (మే 22) నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ కాబోతోంది.

ఈ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ చూస్తే మైండ్ బ్లాంక్.. పిచ్చెక్కించే ట్విస్టులు.. రేపే తెలుగులో ఓటీటీలోకి.. యూట్యూబ్‌లోనూ..

మలయాళంలో ప్రయోగాత్మక సినిమాలు ఎక్కువే. స్టోరీ కంటే కూడా దానిని చెప్పే విధానంలో అక్కడి ఫిల్మ్ మేకర్స్ తన ప్రతిభను చూపిస్తారు. అలా వచ్చిందే మిస్టరీ థ్రిల్లర్ మూవీ పెండులమ్ (Pendulum). టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో చాలా సినిమాలే వచ్చాయి. అయితే దానికి లూసిడ్ డ్రీమింగ్ అనే సరికొత్త కాన్సెప్ట్ జోడించి ఈ మూవీని మరింత ఆసక్తికరంగా మార్చే ప్రయత్నం చేశారు.

పెండులమ్ మూవీ స్టోరీ ఏంటంటే?

నిద్రలో కలలు రావడం కామనే. కానీ మీరెప్పుడైనా వేరే వాళ్ల కలలోకి వెళ్లారా? లేక మీరు వాళ్లను మీ కలలోకి ఆహ్వానించారా? లేదంటే వాళ్ల కలలను మీరు నియంత్రించారా? ఇది వినడానికే చాలా వింతగా ఉంది కదూ. లూసిడ్ డ్రీమింగ్ ఇలాంటిదే. హాలీవుడ్ లో 2010లో వచ్చిన ఇన్సెప్షన్ (Inception) మూవీ చూశారా? ఓ దొంగ ఓ భారీ దోపిడీ కోసం ఓ పెద్ద సంస్థ సీఈవో కలలోకి చొరబడి.. అతని మెదడులో లేని ఓ ఆలోచనను ప్లాంట్ చేస్తాడు. కాస్త ఆ సినిమాను గుర్తుకు తెచ్చేలా ఈ పెండులమ్ కూడా సాగుతుంది.

ఇది మహేష్ నారాయణన్ అనే ఓ డాక్టర్ కథ. తన ఫ్యామిలీతో కలిసి ఒక రోజు ట్రిప్ కోసం అతడు వెళ్తాడు. అక్కడ అతనికి ఊహకందని కొన్ని ఘటనలు ఎదురవుతాయి. తన ఫ్యామిలీతోపాటు ఓ ఇంట్లో ఉన్నా.. మరుసటి రోజు ఉదయం మరో చోట స్పృహ కోల్పోయి పడి ఉంటాడు. ఆ సమయంలో అతడు మరొకరి కలలోకి వెళ్తాడు. అది ఎప్పుడో ఎన్నో ఏళ్ల కింద ఆమిర్, ఏంజెల్ అనే ఇద్దరు స్కూల్ స్టూడెంట్స్ కల. అందులోకి మహేష్ అనుకోకుండా వెళ్తాడు.

ఊహకందని మలుపులు

ఇలా మరొకరి కలలోకి వెళ్లడం అనేదే మనకు అంతుబట్టని విషయం. అయితే తనకు మెలుకవ వచ్చిన తర్వాత తన కలలో కనిపించిన ఆ ఇద్దరూ ఎవరు? అంతకుముందే తన కొడుకును వెతికి పెట్టాలంటూ వచ్చిన ఓ పెద్దాయన అదే కలలో ఎందుకు కనిపిస్తాడు?

ఎప్పుడో 15 ఏళ్ల కిందటే తుక్కుగా మార్చేసిన లారీ అతన్ని ఎలా ఢీకొట్టింది? అసలు ఆ ఆమిర్, ఏంజెల్ ఎవరు? అవతలి వాళ్లను తన కలలోకి తీసుకొచ్చే శక్తి ఆమిర్ కు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఇద్దరూ ఎవరూ తెలుసుకునే ప్రయత్నంలో రియాల్టీలో డాక్టర్ మహేష్ కు ఎదురయ్యే పరిస్థితులు ఏంటి అన్నది ఈ పెండులమ్ మూవీలో చూడొచ్చు.

కలో నిజమో తెలియక..

అసలు ఈ పెండులమ్ మూవీ కాన్సెప్ట్ మనకు చాలా కొత్తది. హాలీవుడ్ లో ఈ కాన్సెప్ట్ పై చాలా సినిమాలే వచ్చినా.. మలయాళంలోగానీ, తెలుగులోగానీ రాలేదు. అలా చూస్తే ఈ సినిమా స్టోరీ మనకు చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. కానీ దానిని తెరపైన చూపించిన విధానం మాత్రం గందరగోళానికి గురి చేస్తోంది. ఒక దశలో సినిమా మధ్యలోకి వెళ్లిన తర్వాత అసలు మనం చూస్తున్నది కలో నిజమో తెలియని స్థితిలోకి వెళ్లిపోతాం.

లూసిడ్ డ్రీమింగ్, టైమ్ ట్రావెల్ కలగలసిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీని రెజిన్ బాబు డైరెక్ట్ చేశాడు. అతనికి ఇదే తొలి సినిమా. తొలి మూవీలోనే ఇలాంటి కాన్సెప్ట్ తీసుకోవడం సాహసమే. 2023లో థియేటర్లలో వచ్చిన ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ప్రస్తుతం యూట్యూబ్ లో హిందీ వెర్షన్ ఫ్రీగా అందుబాటులో ఉంది. గురువారం (మే 22) నుంచి ఈటీవీ విన్ తెలుగులో స్ట్రీమింగ్ చేయనుంది. ప్రయోగాత్మక సినిమాలు, కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చే మూవీస్ ను ఆదరించే వాళ్లు దీనిని చూడొచ్చు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం