మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఓ గుడ్ న్యూస్. అలాంటిదో ఓ మూవీ ఇప్పుడు తెలుగులో వస్తోంది. ఈ సినిమా పేరు పెండులమ్ (Pendulum). ఎప్పుడో రెండేళ్ల కిందట అంటే జూన్, 2023లో థియేటర్లలో రిలీజైంది. ఆ సినిమాను ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీ తెలుగులో స్ట్రీమింగ్ చేయబోతోంది. ఆ వివరాలేంటో చూడండి.
మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా పెండులమ్ ఇప్పుడు తెలుగులో రాబోతోంది. ఈ సినిమాను మే 22 నుంచి అంటే ఈ గురువారం నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ వెల్లడించింది. మంగళవారం (మే 20) తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఆ ఓటీటీ ఈ విషయం తెలిపింది.
“మీ కలలు మీకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? అసలు నిజమేదో, భ్రమేదో తెలుసుకోలేని ఓ గ్రిప్పింగ్ మిస్టరీ థ్రిల్లర్ ను చూడటానికి సిద్ధంగా ఉండండి. పెండులమ్ తెలుగులో మే 22 నుంచి ప్రీమియర్ కానుంది. కేవలం ఈటీవీ విన్ లో” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.
పెండులమ్ 2023లో వచ్చిన ఓ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. రెజిన్ బాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో.. విజయ్ బాబు, అనుమోల్, ప్రకాశ్ బారేలాంటి వాళ్లు నటించారు. జూన్ 16, 2023లో రిలీజైంది. డాక్టర్ మహేష్ నారాయణన్ అనే వ్యక్తి చుట్టూ తిరిగే మూవీ ఇది. తన జీవితంలో జరిగిన ఓ అసాధారణ ఘటన గురించి అతడు తెలుసుకోవాలని అనుకుంటాడు.
దీనికోసం ఓ స్పష్టమైన కల కనడం ద్వారా తన గతం గురించి తెలుస్తుందని భావిస్తాడు. కేవలం గంటా 46 నిమిషాల వ్యవధితో ఉన్న ఈ సినిమాకు ఐఎండీబీలో 6.5 రేటింగ్ ఉంది. ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో వచ్చిన ఈ మూవీకి తెలుగులో మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులు మే 22 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
సంబంధిత కథనం