Malayalam OTT: ఓటీటీలోకి బిచ్చగాడు హీరోయిన్ మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ - బ్యాంకు ఉద్యోగులే స్కామ్ చేస్తే!
Malayalam OTT: బిచ్చగాడు ఫేమ్ సాట్నా టైటస్ హీరోయిన్‌గా నటించిన మలయాళం మూవీ పార్ట్‌నర్స్ ఓటీటీలోకి వస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ సైనా ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాలో ధ్యాన్ శ్రీనివాసన్, రోనీ డేవిడ్ కళాభవన్ షాజాన్ కీలక పాత్రలు పోషించారు.
Malayalam OTT:మలయాళం మూవీ పార్ట్‌నర్స్ ఓటీటీలోకి వస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ధ్యాన్ శ్రీనివాసన్, కళాభవన్ షాజాన్, రోనీ డేవిడ్‌తో పాటు బిచ్చగాడు ఫేమ్ సాట్నా టైటస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ సైనా ప్లే ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జనవరి 31 నుంచి పార్టనర్స్ మూవీ సైనా ప్లేలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

యావరేజ్...
గత ఏడాది జూలైలో థియేటర్లలో రిలీజైన పార్ట్‌నర్స్ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. థియేటర్లలో రిలీజైన ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. పార్ట్‌నర్స్ సినిమాకు నవీన్ జాన్ దర్శకత్వం వహించాడు. 1990, 2024... రెండు టైమ్ పీరియడ్స్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యాంక్ స్కామ్స్ చుట్టూ దర్శకుడు ఈ కథను నడిపించాడు. ఐదుగురు స్నేహితులు తమకు జరిగిన అన్యాయంపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నారన్నదే ఈ మూవీ కథ.
బ్యాంకు స్కామ్...
కాసర్‌ఘడ్ దగ్గరలో ఉన్న ఓ పల్లెటూరి ప్రైవేట్ బ్యాంకులో పెద్ద స్కామ్ జరిగిందని ఐటీ కమీషనర్ పార్థసారధికి సమాచారం అందుతుంది. ఆ స్కామ్‌కు సంబంధించి ఎక్వైరీ మొదలుపెడతాడు. ఆ స్కామ్‌లో బ్యాంకు మేనేజర్ కృష్ణకుమార్‌తో పాటు మరో నలుగురు ఉద్యోగులకు సంబంధం ఉందని కృష్ణకుమార్ అనుమానిస్తాడు. వారిని అరెస్ట్ చేయాలని పోలీసులు ప్రయత్నిస్తారు. ఆ ఐదుగురు ఎవరు? ఈ స్కామ్‌లో వాళ్లు ఎలా ఇరుక్కున్నారు? తమపై పడిన నిందను తొలగించుకునేందుకు ఎలాంటి పోరాటం సాగించారు పార్ట్‌నర్స్ మూవీ కథ.
మైనస్...
పార్ట్‌నర్ మూవీలోని కొన్ని ట్విస్ట్‌లతో పాటు హీరో విలన్ పోరాటాన్ని దర్శకుడు ఆవిష్కరించిన తీరు ఆడియెన్స్‌ను మెప్పించింది. కానీ ఆ మెరుపులు కొన్నే ఉండటం సినిమాకు మైనస్‌గా మారింది. మోస్తారు కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది.
బిచ్చగాడు హీరోయిన్...
బిచ్చగాడు ఫేమ్ సాట్నా టైటస్ పార్ట్‌నర్స్ మూవీతోనే హీరోయిన్‌గా మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళ మూవీ పిచ్చైకారణ్ సినీ కెరీర్‌ను ప్రారంభించింది సాట్నా టైటస్. తమిళంతో పాటు తెలుగులో ఈ మూవీ పెద్ద విజయాన్ని సాధించింది. అయినా ఆమెకు అంతగా అవకాశాలు దక్కలేదు. తెలుగులో శ్రీవిష్ణు హీరోగా నటించిన నీది నాది ఒకే కథ సినిమాలో కథానాయికగా కనిపించింది సాట్నా టైటస్.మరోవైపు సక్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా మలయాళంలో హీరోగా, విలన్‌గా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తోన్నాడు ధ్యాన్ శ్రీనివాసన్. 2024 ఏడాదిలో ధ్యాన్ శ్రీనివాసన్ ఏకంగా పదిహేను సినిమాలు చేయడం గమనార్హం.