OTT Malayalam Mystery Thriller: మలయాళం థ్రిల్లర్ మూవీస్ లవర్స్ కు ఓ గుడ్ న్యూస్. మూడు నెలల తర్వాత ఓ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి వస్తుంది. ఈ మూవీ పేరు అం అ: (Am Ah). ఓ డిఫరెంట్ టైటిల్ తో వచ్చిన ఈ సినిమాలో సీనియర్ నటుడు దిలీష్ పోతన్ లీడ్ రోల్లో నటించాడు. జనవరిలో థియేటర్లలో రిలీజైన మూవీ.. మొత్తానికి ఓటీటీలోకి వస్తోంది.
మలయాళం మూవీ అం అ: జనవరి 24న థియేటర్లలో రిలీజైంది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ సంపాదించిన ఈ సినిమా మూడు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఏప్రిల్ 18 నుంచి సన్ నెక్ట్స్ (Sun NXT) ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది.
మలయాళ సీనియర్ నటుడు దిలీష్ పోతన్ లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది. ఇందులో జాఫర్ ఇడుక్కి, దేవదర్శిని కూడా కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ ఓటీటీలో మలయాళం ఆడియోలోనే అందుబాటులోకి రానుంది. అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తోనూ చూడొచ్చు.
అం అ: మూవీని థామస్ కే సెబాస్టియన్ డైరెక్ట్ చేశాడు. ఇందులో దిలీష్ పోతన్, జాఫర్ ఇడుక్కితోపాటు దేవదర్శిని, మీరా వాసుదేవ్, టీజీ రవి, మాలా పార్వతి, శృతి జయన్, అలెన్సియర్ లోపెజ్ లాంటి వాళ్లు కూడా నటించారు. ఈ మూవీలో స్టీఫెన్ (దిలీష్ పోతన్) అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతడో రోడ్డు నిర్మాణ సూపర్‌వైజర్.
తన పనిలో భాగంగా కవంత అనే ఓ కొండ ప్రాంతంలోని గ్రామానికి వెళ్తాడు. అక్కడ అతనికి ఓ మహిళ (దేవదర్శిని), ఆమె మనవరాలు పరిచయం అవుతారు. వాళ్ల గురించి మరింత తెలుసుకోవడానికి అతడు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో స్టీఫెన్ కు ఎదురయ్యే అనుభవాలు ఎలాంటివన్నది ఈ సినిమాలో చూడొచ్చు.
డైరెక్టర్ అయిన దిలీష్ పోతన్ తర్వాత నటనలోకి అడుగుపెట్టాడు. ఫహాద్ ఫాజిల్ నటించిన జోజిలాంటి థ్రిల్లర్ సినిమాలను డైరెక్ట్ చేసిన అతడు.. తర్వాత తలవన్, మాలిక్, జోసెఫ్, ట్రాన్స్ లాంటి సినిమాల్లోనూ నటించాడు. ఈ సినిమాలన్నీ ప్రస్తుతం వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
సంబంధిత కథనం