Malayalam movies OTT: ఈ వారం ఓటీటీల్లోకి రానున్న రెండు మలయాళం సినిమాలు.. ఒకటి యాక్షన్.. మరొకటి కామెడీ
OTT Malayalam movies: ఈ వారం ఓటీటీల్లోకి రెండు మలయాళం సినిమాలు అడుగుపెడుతున్నాయి. మమ్ముట్టి హీరోగా నటించిన టర్బో చిత్రం ఓటీటీలోకి వస్తోంది. ఈ చిత్రం తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.
ఓటీటీల్లో మలయాళం సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. వేరే భాషల ప్రేక్షకులు కూడా కొత్త మలయాళ మూవీస్ కోసం ఎదురుచూస్తుంటారు. ఈ వారం మరిన్ని మలయాళ చిత్రాలు ఓటీటీల్లో అడుగుపెడుతున్నాయి. అందులో రెండు పాపులర్ సినమాలు ఉన్నాయి. మలయాళ మెగాస్టార్ మమ్మట్టి నటించిన టర్బో ఈవారమే ఓటీటీలోకి రానుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవనుంది. మరో మలయాళ మూవీ కూడా ఈవారం ఓటీటీలోకి రానుంది. ఆ వివరాలు ఇవే..
టర్బో.. తెలుగులో కూడా..
యాక్షన్ డ్రామా సినిమా ‘టర్బో’ సూపర్ హిట్ అయింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన ఈ చిత్రం మే 23న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఈ వారంలోనే టర్బో సినిమా ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఆగస్టు 9వ తేదీన ‘సోనీలివ్’ ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. మొత్తంగా నాలుగు భాషల్లో ఈ మూవీ అడుగుపెట్టనుంది. మలయాళంతో పాటు తెలుగు, తమళం, కన్నడ, హిందీ భాషల్లో సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుంది.
టర్బో చిత్రంలో మమ్ముట్టితో పాటు రాజ్ బీ శెట్టి, అంజన జయప్రకాశ్, శబరీష్ వర్మ, కబీర్ దుహాన్ సింగ్ కీలకపాత్రలు పోషించారు. స్నేహితుడు జెర్రీ కోసం చిక్కుల్లో పడి చెన్నైకు మారి గ్యాంగ్‍స్టర్‌తో తలపడే జీప్ డ్రైవర్ జోస్ టర్బో (మమ్ముట్టి) చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఈ కథలో కొన్ని ట్విస్టులు ఉంటాయి. టర్బో చిత్రానికి వైశాఖ్ దర్శకత్వం వహించారు. క్రిస్టో గ్జేవియర్ సంగీతం అందించారు.
రూ.25కోట్ల లోపు బడ్జెట్‍తో రూపొందిన టర్బో చిత్రం రూ.70కోట్లకుపైగా రాబట్టి సూపర్ హిట్ అయింది. మమ్ముట్టి కంపెనీ పతాకంపై హీరో మమ్ముట్టినే ఈ మూవీని నిర్మించారు. ఎట్టకేలకు ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. సోనీ లివ్ ఓటీటీలో ఆగస్టు 9 నుంచి టర్బో సినిమాను చూడొచ్చు.
నదన్న సంభవం
మలయాళ కామెడీ డ్రామా మూవీ నదన్న సంభవం థియేటర్లలో జూన్ 21వ తేదీన రిలీజైంది. పాజిటివ్ రెస్పాన్ దక్కించుకుంది. ఈ మూవీలో బిజూ మీనన్, సూరజ్ వంజరమూదు ప్రధాన పాత్రలు పోషించారు. విల్లా కమ్యూనిటీ, అందులో ఉండే ఉన్ని (బిజూ మీనన్), అజిత్ (సూరజ్) మధ్య ఉండే గొడవల చుట్టూ సాగుతుంది. ఈ చిత్రాన్ని కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు దర్శకుడు విష్ణు నారాయణ్.
నదన్న సంభవం చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. ఆగస్టు 9వ తేదీన ‘మనోరమమ్యాక్స్’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మూవీలో బిజూ, సూరజ్‍తో పాటు శృతి రామచంద్రన్, లిజోమోల్ జోస్, సుధి కప్పా, లాలూ అలెక్స్, జానీ ఆంటోనీ, సౌషాద్ అలీ, అథిరా హరికుమార్ కీరోల్స్ చేశారు. ఈ మూవీని అనూప్ కన్నన్ స్టోరీస్ పతాకంపై అనూప్ కన్నన్, రేణు ఏ నిర్మించారు. ఈ చిత్రానికి అంకిత్ మీనన్ సంగీతం అందించారు. ఆగస్టు 9 నుంచి మనోరమ మ్యాక్స్ ఓటీటీలో నదన్న సంభవం వీక్షించొచ్చు.