మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్లు కాగా.. మరికొన్ని ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా ఆకట్టుకున్నాయి. అలాంటిదే తాజాగా ఓటీటీలోకి వచ్చిన మూవీ సర్కీట్ (Sarkeet). ఈ ఫ్యామిలీ డ్రామాకు థియేటర్లలో కంటే ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ అయిన తర్వాత సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
మలయాళ నటుడు ఆసిఫ్ అలీ కొత్త సినిమా 'సర్కీట్' సెప్టెంబర్ 26, 2025న మనోరమ మ్యాక్స్ లోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. జీవితంలో కష్టాలు ఎదుర్కొంటున్న ఓ యువకుడికి, హైపర్‌యాక్టివ్ పిల్లాడికి మధ్య ఉన్న మనసుకు హత్తుకునే బంధాన్ని చూపించే సినిమా ఇది. ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచి చాలా మంది ప్రేమను గెలుచుకుంది.
ముఖ్యంగా ఆసిఫ్ అలీ పర్ఫార్మెన్స్‌ను చూసి నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది మరొక అద్భుతమైన మూవీ పొన్‌మ్యాన్ తో పోలుస్తున్నారు. అది బేసిల్ జోసెఫ్ కు హిట్ ఇవ్వగా.. ఇది ఆసిఫ్ అలీకి పొన్‌మ్యాన్ లాంటిది అని కొందరు అనడం విశేషం.
మలయాళ ఫ్యామిలీ డ్రామా అయిన ‘సర్కీట్’లో ఆసిఫ్ అలీ లీడ్ రోల్‌లో నటించాడు. దీనిని తామర్ కేవీ డైరెక్ట్ చేశాడు. మే 8న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూస్ వచ్చినా.. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ పోయిన వారం ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత.. సర్కీట్ వ్యూయర్స్ ను మెప్పించగలిగింది. చాలా వరకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.
ఒక నెటిజన్ స్పందిస్తూ.. 'సర్కీట్' ఒక "నిజమైన ఫీల్-గుడ్ డ్రామా. కష్టపడుతున్న మధ్యతరగతి యువకులందరినీ ఆసిఫ్ అలీ టెర్రిఫిక్‌గా రిప్రెజెంట్ చేశాడు. ఈ సంవత్సరం ఆసిఫ్ అలీ ‘పొన్‌మ్యాన్’కు హ్యాట్సాఫ్" అని అన్నారు.
కొంతమంది అయితే మలయాళ సినిమా ప్రస్తుత జనరేషన్‌లో అత్యుత్తమ నటుడిగా భావించే ఫహాద్ ఫాజిల్‌తో కూడా ఆసిఫ్‌ను పోల్చారు. మరికొంతమంది నెటిజన్లు సినిమా యావరేజ్‌గా ఉందని భావించినప్పటికీ ఆసిఫ్ అలీ పర్ఫార్మెన్స్, ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ఇంప్రెసివ్‌గా ఉందని కామెంట్స్ చేశారు.
"సాలిడ్ ఎమోషనల్ డ్రామా ఫిల్మ్.. బాగా నచ్చేసింది. ఆసిఫ్ అలీ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్" అని ఒకరు.. "సర్కీట్ బాగుంది. ఆసిఫ్ దాన్ని ఎఫర్ట్‌లెస్ గా క్యారీ చేశాడు" అని మరొకరు అన్నారు.
ఈ సినిమా ఏడీహెచ్‌డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్) ఉన్న ఒక చిన్నపిల్లాడు, వాడి పేరెంట్స్ తమ బిజీ కెరీర్‌ల మధ్య వాడిని జాగ్రత్తగా చూసుకోవడానికి పడుతున్న కష్టం చుట్టూ తిరుగుతుంది. గతంలో '1001 నూనకల్' తీసిన డైరెక్టర్ తామర్ కేవీ.. ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన సబ్జెక్ట్‌ను ఎంచుకుని, దానిని సెన్సిటివ్‌గా చూపించినందుకు ప్రశంసలు అందుకున్నాడు.
ఓర్హాన్ హైదర్.. జప్పు అనే పిల్లాడి పాత్ర పోషించగా.. దివ్య ప్రభా, దీపక్ పరంబోల్ అతని పేరెంట్స్‌గా కనిపించారు. రమ్య సురేష్, అలెగ్జాండర్, ప్రశాంత్ కూడా ఈ సినిమాలో ఉన్నారు. మరోవైపు బేసిల్ జోసెఫ్ నటించిన 'పొన్‌మ్యాన్' ఈ ఏడాది మొదట్లో రిలీజ్ అయింది. జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత బేసిల్ జోసెఫ్ మూవీకి కూడా అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి.
సంబంధిత కథనం