Romancham Box Office Collection: 2 కోట్ల బడ్జెట్ - యాభై కోట్ల కలెక్షన్స్ - వండర్స్ క్రియేట్ చేస్తోన్న మలయాళ మూవీ
Romancham Box Office Collection: మలయాళంలో చిన్న సినిమాగా విడుదలైన రొమాంచం బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తోంది. రెండు కోట్లతో రూపొందిన ఈ సినిమా ఈ ఏడాది మలయాళంలో హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్‌గా నిలిచింది.
Romancham Box Office Collection: కొన్ని సార్లు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తోంటాయి. ట్రేడ్ వర్గాల అంచనాల్ని తలక్రిందులు చేస్తూ కాసుల వర్షాన్ని కురిపిస్తుంటాయి. మలయాళ సినిమా రొమాంచం అందుకు ఉదాహరణగా నిలుస్తోంది. సౌబిన్ షాహిర్, అర్జున్ అశోకన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ట్రెండింగ్ వార్తలు
కేవలం రెండు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ హారర్ సినిమా ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద 55 కోట్ల వసూళ్లను రాబట్టింది. మమ్ముట్టితో పాటు పలువురు స్టార్ హీరోల సినిమాల్ని అధిగమిస్తూ ఈ ఏడాది మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఔజా బోర్డ్ గేమ్ కారణంగా ఏడుగురు బ్యాచ్‌లర్స్ ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారనే పాయింట్‌తో సెటైరికల్ హారర్ కామెడీగాదర్శకుడు జీతూ మాధవన్ ఈ సినిమాను తెరకెక్కించారు.
సౌబన్ షాహిర్ యాక్టింగ్ థియేటర్లలో నవ్వులను పూయిస్తోంది. నిర్మాతలకు 20 రెట్లకుపైగా ఈ సినిమా లాభాలను తెచ్చిపెట్టింది. మలయాళంలో ఈ ఏడాది హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్‌గా రొమాంచం రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా 70 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు మలయాళ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.