OTT: ఈరోజే ఓటీటీలోకి వచ్చిన ఈ మలయాళం మూవీపై ప్రశంసల వర్షం.. ఈ ఏడాది బెస్ట్ అంటూ పొగిడేస్తున్న ప్రేక్షకులు.. మీరు చూశారా?
OTT: ఓటీటీలోకి కొత్తగా వచ్చిన ఓ మలయాళం కామెడీ యాక్షన్ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో లీడ్ పాత్ర పోషించిన బేసిల్ జోసెఫ్ నటనకు బ్రహ్మరథం పడుతున్నారు. అతని కెరీర్లోనే ఇదే బెస్ట్ యాక్షన్ అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
OTT: ఓ చిన్న లైన్ నే సినిమా కథగా మార్చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవడం మలయాళం ఫిల్మ్ మేకర్స్ కు వెన్నెతో పెట్టిన విద్య. ఓటీటీ వచ్చిన తర్వాత అక్కడి చిన్న చిన్న సినిమాలు కూడా డబ్ అయి తెలుగు వాళ్ల ముందుకు వస్తున్నాయి. అలా శుక్రవారం (మార్చి 14) జియోహాట్‌స్టార్ ద్వారా వచ్చిన సినిమాయే పోన్‌మ్యాన్ (Ponman).
పోన్‌మ్యాన్‌పై ప్రశంసల వర్షం
ఈ ఏడాది జనవరిలో మలయాళంలో రిలీజైన మూవీ పోన్‌మ్యాన్. బేసిల్ జోసెఫ్ నటించిన ఈ సినిమా కామెడీని పంచడంతోపాటు ప్రేక్షకులను ఎమోషనల్ చేసేస్తోంది. శుక్రవారం (మార్చి 14) జియోహాట్‌స్టార్ ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ కు వచ్చింది. తెలుగులోనూ రావడంతో ఇక్కడి ప్రేక్షకులు కూడా బాగానే చూస్తున్నారు. ఈ ఏడాది వచ్చిన బెస్ట్ మలయాళం మూవీ ఇదే అని సర్టిఫికెట్ కూడా ఇస్తున్నారు.
జనవరి 30న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ఊహించిన రెస్పాన్స్ రాలేదు. అయితే ఓటీటీలోకి అడుగుపెట్టిన తొలి రోజే సినిమా చాలా బాగుందంటూ ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. జోతిష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బేసిల్ జోసెఫ్ నటన అద్భుతమని కొనియాడుతున్నారు. ఈ ఏడాది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇదేననీ చెబుతున్నారు. నిజానికి కామెడీ జానర్లో మూవీ వచ్చినా.. ఎమోషనల్ సీన్లతోనూ పోన్‌మ్యాన్ అలరిస్తున్నాడు.
పోన్‌మ్యాన్ స్టోరీ ఏంటంటే?
మలయాళం మూవీస్ భిన్నమైన కథలతో వచ్చి వివిధ భాషల ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి. అలా వచ్చిందే ఈ పోన్‌మ్యాన్ కూడా. నిజానికి ఇదో డిఫరెంట్ స్టోరీ. పెళ్లిళ్లలో నగలు పెట్టలేని కుటుంబాలకు ఆ నగలను ఇచ్చి.. పెళ్లిలో చదివింపుల రూపంలో వచ్చిన డబ్బును ప్రతిగా తీసుకునే అజేష్ అనే ఓ యువకుడి చుట్టూ తిరిగే కథ.
అలా ఆ యువకుడు ఓ కుటుంబానికి 25 సవర్ల బంగారం ఇస్తాడు. ఆ ఇంటి అమ్మాయి పెళ్లి అయిన వెంటనే చదివింపుల డబ్బును తనకివ్వాలని షరతు పెడతాడు. అయితే ఆ పెళ్లికి అనుకున్న స్థాయిలో చదివింపులు రావు. 25 సవర్ల బంగారానికిగాను 13 సవర్ల బంగారం డబ్బులే వస్తాయి.
మిగిలిన బంగారం తనకు తిరిగి ఇవ్వాలని అతడు డిమాండ్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయిని చేసుకున్న యువకుడు, వాళ్ల కుటుంబం దానికోసమే పెళ్లి చేసుకోవడంతో అది అంత సులువు కాదు. మరి ఆ బంగారాన్ని అతడు తిరిగి రాబట్టుకున్నాడా? అతని జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? ఆ అమ్మాయి జీవితం ఏం అవుతుంది? అన్నది ఈ సినిమాలో చూడొచ్చు.
ఈ సినిమా జియోహాట్‌స్టార్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే బేసిల్ జోసెఫ్ మూవీస్ ఎన్నో తెలుగులోనూ వచ్చాయి. వాటిలో ది బెస్ట్ అంటున్న ఈ సినిమాను ఈ వీకెండ్ మీరు కూడా చూసేయండి.
సంబంధిత కథనం