నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం మూవీ.. ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న మూవీ-malayalam movie pattth ott streaming on manorama max ott releases this week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం మూవీ.. ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న మూవీ

నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం మూవీ.. ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న మూవీ

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి ఇప్పుడో మలయాళం మూవీ నేరుగా స్ట్రీమింగ్ కు వచ్చింది. అంతర్జాతీయ ఫిల్మ్స్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించిన తర్వాత థియేటర్లలో రిలీజ్ కాకుండా ఓటీటీలోకే మేకర్స్ తీసుకొచ్చారు. మరి ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.

నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం మూవీ.. ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న మూవీ

మలయాళం మూవీ పాత్ (Pattth) ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నేరుగా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. గతేడాది 29వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళలో ఈ మూవీని ప్రదర్శించారు. జితిన్ ఐజాక్ థామస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

ఓటీటీలోకి పాత్ మూవీ

మలయాళం మూవీ పాత్ శుక్రవారం (జూన్ 6) నుంచి మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళలో ప్రదర్శించిన తర్వాత మేకర్స్ ఈ మూవీని థియేటర్లలో విడుదల చేయలేదు. డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న మనోరమ మ్యాక్స్ ఎలాంటి ముందుస్తు సమాచారం లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది.

ఈ మూవీ కేవలం మలయాళం ఆడియో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉంది. మూవీకి ఫిల్మ్ ఫెస్టివల్లో వచ్చిన పాజిటివ్ రివ్యూలతో ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.

పాత్ మూవీ స్టోరీ ఏంటంటే?

ఆ పాత్ మూవీలో ఆషిక్ సఫియా అబూబాకర్, గౌతమి లక్ష్మి గోపన్ లీడ్ రోల్స్ లో నటించారు. కేతి, చెరియకాలన్, జాస్మిన్ కావ్య లాంటి వాళ్లు కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ మూవీ ఉన్ని అనే ఓ సినిమా ఎడిటర్ చుట్టూ తిరుగుతుంది.

సినిమాల్లో నిలదొక్కుకోవడానికి అతడు శ్రమిస్తుంటాడు. ఈ క్రమంలో అతడు ఓ కెన్యన్ ట్రావెల్ వ్లోగ్ లో పని చేస్తుంటాడు. అక్కడే అతడు తన నాన్నమ్మ తనకు వినిపించే ఓ ట్రైబల్ పాట వింటాడు. ఆ పాటను తాను కూడా పాడుతుంటాడు. ఈ పాటను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. అది తనకే కాదు.. కేరళలో చాలా మందికి తెలుసని అప్పుడు అతనికి తెలుస్తుంది.

దీంతో ఉన్ని, తన గర్ల్‌ఫ్రెండ్ తో కలిసి అసలు ఆ పాట మూలాలు వెతికే పనిలో పడతాడు. ఈ పాట తెలుసని చెప్పిన ఎంతోమందిని కలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ మూవీ స్టోరీ. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళలో ఈ పాత్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో చూడాలనుకుంటే మనోరమ మ్యాక్స్ లో ఉన్న ఈ సినిమాను చూడొచ్చు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం