Malayalam Movie on Youtube: ఓటీటీలోకి కాకుండా నేరుగా యూట్యూబ్‌లోకి వచ్చిన మలయాళం మూవీ.. ఇక్కడ చూడండి-malayalam movie parakramam ott streaming movie now in youtube channel cinema villa ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Malayalam Movie On Youtube: ఓటీటీలోకి కాకుండా నేరుగా యూట్యూబ్‌లోకి వచ్చిన మలయాళం మూవీ.. ఇక్కడ చూడండి

Malayalam Movie on Youtube: ఓటీటీలోకి కాకుండా నేరుగా యూట్యూబ్‌లోకి వచ్చిన మలయాళం మూవీ.. ఇక్కడ చూడండి

Hari Prasad S HT Telugu
Published Feb 11, 2025 08:06 PM IST

Malayalam Movie on Youtube: ఓ మలయాళం మూవీ థియేటర్లలో నుంచి నేరుగా యూబ్యూట్ లోకి వచ్చింది. అక్కడ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా పేరు పరాక్రమం. మరి ఈ మూవీని ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

ఓటీటీలోకి కాకుండా నేరుగా యూట్యూబ్‌లోకి వచ్చిన మలయాళం మూవీ.. ఇక్కడ చూడండి
ఓటీటీలోకి కాకుండా నేరుగా యూట్యూబ్‌లోకి వచ్చిన మలయాళం మూవీ.. ఇక్కడ చూడండి

Malayalam Movie on Youtube: ఈ మధ్యే ప్రతి మూవీ థియేటర్ నుంచి ఓటీటీలోకి వచ్చిన తర్వాతే టీవీ, యూట్యూబ్ లలోకి వెళ్తోంది. కానీ మలయాళం మూవీ పరాక్రమం మాత్రం గతేడాది నవంబర్ లో థియేటర్లలో రిలీజై.. ఓటీటీలోకి అడుగుపెట్టకుండానే యూట్యూబ్ లోకి ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. ఐఎండీబీలో 7.5 రేటింగ్ ఉన్న ఈ సినిమా ఏ యూట్యూబ్ ఛానెల్లో స్ట్రీమింగ్ అవుతోందో చూడండి.

యూట్యూబ్‌లో పరాక్రమం మూవీ..

పరాక్రమం అనే మలయాళం మూవీ గతేడాది నవంబర్ 22న థియేటర్లలో రిలీజైంది. అయితే అక్కడ ఈ డ్రామాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు సుమారు మూడు నెలల తర్వాత సడెన్ గా యూట్యూబ్ లో ప్రత్యక్షమైంది.

దేవ్ మోహన్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాను సినిమా విల్లా (Cinema Villa) అనే యూట్యూబ్ ఛానెల్ స్ట్రీమింగ్ చేస్తోంది. కేవలం ఒక గంట 35 నిమిషాల నిడివితోనే ఈ సినిమా యూట్యూబ్ లోకి రావడం విశేషం.

పరాక్రమం మూవీ గురించి..

పరాక్రమం ఓ మలయాళ మూవీ. ఈ సినిమాను అర్జున్ రమేష్ డైరెక్ట్ చేయగా.. మిలిన్నియల్ ఫిల్మ్స్ నిర్మించింది. ఈ సినిమాలో దేవ్ మోహన్ తోపాటు సిజు సన్నీ, జోమోన్ జ్యోతిర్, అమిత్ మోహన్ రాజేశ్వరి, సంగీతాలాంటి వాళ్లు నటించారు. ఇందులో విశాఖ్ అనే పాత్రలో దేవ్ మోహన్ నటించాడు. ఓ ఆర్మీ మేజర్ కావాలన్నది అతని కలగా ఉంటుంది.

అయితే తనపై తనకే నమ్మకం లేని పరిస్థితుల్లో అందరూ అతన్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. అతని తండ్రి కల్నల్ సుకుమారన్ లాగా కావాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. ఈ క్రమంలో అతనికి స్నేహితులతోపాటు ఓ అమ్మాయి ప్రేమ లక్ష్యం దిశగా వెళ్లే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.

అయినా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటాడు. చివరికి అతడు తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా అన్నదే ఈ మూవీ స్టోరీ. థియేటర్లలో రిలీజైన మూడు నెలలకు ఇప్పుడు యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. సినిమా విల్లా యూట్యూబ్ ఛానెల్లో ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ సినిమాను చూడొచ్చు.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం