Manjummel Boys Telugu: మంజుమ్మెల్ బాయ్స్ తెలుగు వెర్షన్‌కు క్లీన్ యు సర్టిఫికెట్.. రన్‌టైమ్ తక్కువే
Manjummel Boys Telugu: మంజుమ్మెల్ బాయ్స్ తెలుగు వెర్షన్ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ మూవీకి సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ రాగా.. సినిమా రన్ టైమ్ కూడా తక్కువగానే ఉంది.
Manjummel Boys Telugu: ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మలయాళ సూపర్ డూపర్ హిట్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ తెలుగులో రాబోతోంది. శనివారం (ఏప్రిల్ 6) ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమా తెలుగు వెర్షన్ సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. మలయాళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందని భావిస్తున్నారు.

మంజుమ్మెల్ బాయ్స్.. రన్ టైమ్ తక్కువే..
మంజుమ్మెల్ బాయ్స్ ఓ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. మలయాళం ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరించారు. ఆ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా, రూ.200 కోట్ల మార్క్ అందుకున్న తొలి మూవీగా నిలిచింది. ఇప్పుడీ మూవీ తెలుగులో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ యు సర్టిఫికెట్ ఇవ్వడం విశేషం.
అంటే కుటుంబసమేతంగా ఈ సినిమాను చూడొచ్చు. ఇక సినిమా రన్ టైమ్ కూడా కేవలం 2 గంటల 15 నిమిషాలే ఉండటం కూడా ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షించే అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రధాన నగరాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు కూడా ఏర్పాటు చేశారు. మలయాళంతోపాటు తమిళంలోనూ మంచి రెస్పాన్స్ రావడంతో తెలుగులో రిలీజ్ కు ముందే హైప్ క్రియేటైంది.
ఓ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన మూవీ ఇది. డైరెక్టర్ చిదంబరం మూవీని చాలా ఆసక్తికరంగా తెరకెక్కించడంతో సినిమాకు థియేటర్లలో తొలి షో నుంచే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం కూడా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. మరో వారం పది రోజుల్లో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రేమలు రూట్‌లోనే..
ఇప్పటికే మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమలు తెలుగులోనూ రిలీజైన విషయం తెలిసిందే. మలయాళంలో రూ.130 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా.. తెలుగులోనూ రూ.15 కోట్లకుపైనే రాబట్టింది. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ డబ్బింగ్ మూవీగా నిలిచింది. ఇప్పుడు మంజుమ్మెల్ బాయ్స్ కూడా అలాంటి రికార్డునే క్రియేట్ చేస్తుందన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.
సినిమా హిట్ అవుతుందని అనుకున్నా.. మరీ రూ.200 కోట్లు వస్తాయని మాత్రం తాము అసలు ఊహించలేదని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ చిదంబరం చెప్పాడు. ఈ మూవీలో గుహలలో సీన్స్ కోసం తాము సెట్స్ వేసినట్లు వెల్లడించాడు. 2006లో కేరళకు చెందిన కొందరు యువకులు తమిళనాడులోని గుణ కేవ్స్ కు వెళ్లడం, అందులో ఒకరు ప్రమాదవశాత్తూ ఓ లోతైన గుహలోకి పడిపోవడం, అతన్ని రక్షించడానికి మిగిలిన స్నేహితులు చేసే ప్రయత్నమే ఈ మంజుమ్మెల్ బాయ్స్ మూవీ.
మరి మలయాళం, తమిళం భాషల్లో హిట్ అయినట్లే తెలుగులోనూ ఈ సినిమా సక్సెస్ అవుతుందా? ప్రేమలులాగే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అన్నది చూడాలి. ఈ సినిమాకు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్, టిల్లూ స్క్వేర్ మూవీస్ నుంచి పోటీ ఉంది.