OTT Mystery Thriller: తొమ్మిది నెలల తర్వాత ఓటీటీలోకి మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
OTT Mystery Thriller: మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ బిగ్‌బెన్ థియేటర్లలో రిలీజైన తొమ్మిది నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. మార్చి 28 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మాలీవుడ్ మూవీలో అనుమోహన్, అదితి రవి, మియా జార్జ్ హీరోహీరోయిన్లుగా నటించారు.
OTT Mystery Thriller: మలయాళం మూవీ బిగ్‌బెన్ థియేటర్లలో రిలీజైన తొమ్మిది నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతోంది. మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో అను మోహన్, వినయ్ ఫోర్ట్, అదితి రివి, మియా జార్జ్ హీరోహీరోయిన్లుగా నటించారు. బినో అగస్టీన్ దర్శకత్వం వహించాడు.
సన్ నెక్స్ట్ ఓటీటీ...
మార్చి 28 నుంచి బిగ్‌బెన్ మూవీ సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని సన్ నెక్స్ట్ అఫీషియల్‌గా ప్రకటించింది. కేవలం మలయాళ వెర్షన్ మాత్రం రిలీజ్ అవుతోన్నట్లు వెల్లడించింది.
గత ఏడాది జూలైలో బిగ్‌బెన్ మూవీ థియేటర్లలో రిలీజైంది. విదేశీ చట్టాలపై అవగాహన లేక భారతీయులు పడే ఇబ్బందులను మిస్టరీ థ్రిల్లర్ అంశాలతో దర్శకుడు ఈ మూవీలో ఆవిష్కరించాడు.
కాన్సెప్ట్ బాగున్నా దానిని స్క్రీన్‌పై ఇంట్రెస్టింగ్‌గా డైరెక్టర్ ప్రజెంట్ చేయలేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.ఐఎమ్‌డీబీలో 7.4 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది. బిగ్‌బెన్ మూవీకి కైలాష్ మీనన్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాను చాలా వరకు యూకేలోనే షూట్ చేశారు.
బిగ్ బెన్ కథ ఇదే...
జీన్ ఆంటోనీ కేరళలో పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. జీన్ ఆంటోనీ భార్య లవ్‌లీ జాబ్ నిమిత్తం యూకేకు వెళుతుంది. భార్యకు తోడుగా ఆంటోనీ కూడా యూకే వెళతాడు. లవ్‌లీతో ఆమె ఆఫీస్‌లో పనిచేసే విల్సన్ అసభ్యంగా ప్రవర్తిస్తాడు. అతడితో ఆంటోనీ గొడవపడటంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేస్తారు.
చిన్నారి సంరక్షణ బాధ్యతలను సరిగ్గా చూసుకోవడం లేదని ఆంటోనీ, లవ్‌లీల కూతురుని అక్కడి చైల్డ్ వెల్ఫేర్ అధికారులు తీసుకెళ్లిపోతారు. తమ కూతురిని తిరిగి దక్కించుకోవడానికి లవ్‌లీ, ఆంటోనీ ఏం చేశారు? యూకే చట్టాలపై అవగాహన లేక ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? వారికి అరుణిమ, కుంజేట్టాన్, ఫ్రాన్సిస్ ఎలాంటి సాయం చేశారు అన్నదే ఈ మూవీ కథ.
ఉంగరాల రాంబాబు మూవీలో...
బిగ్‌బెన్ మూవీలో ఓ హీరోయిన్‌గా నటించిన మియా జార్జ్ తెలుగులో ఉంగరాల రాంబాబు అనే సినిమా చేసింది. ఈ కామెడీ లవ్‌స్టోరీలో సునీల్ హీరోగా నటించాడు. ఆమె నటించిన పలు తమిళం, మలయాళ సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి.
బిగ్‌బెన్‌లో ప్రధాన పాత్రలు పోషించిన అను మోహన్, వినయ్ ఫోర్ట్ మలయాళంలో హీరోలుగా, విలన్లుగా ...డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ రాణిస్తోన్నారు. టీవీ యాక్టర్స్‌గా కెరీర్ మొదలుపెట్టి బిగ్‌స్క్రీన్‌పై సత్తా చాటుతోన్నారు.
సంబంధిత కథనం