ఫ్యామిలీ ఎమోషన్ డ్రామాతో కూడిన మలయాళ సినిమా ‘అన్పోడు కన్మణి’ మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ.. ఇప్పుడు మరో ఓటీటీలో అడుగుపెట్టింది. థియేటర్లలో రిలీజైన అయిదు నెలల తర్వాత ఈ ఫిల్మ్ రెండో ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.
అన్పోడు కన్మణి అనే మలయాళ సినిమా ఈ రోజు (జూలై 5) మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఈ ఏడాది జనవరి 24న ఈ చిత్రం థియేటర్లలో రిలీజైంది. మార్చి 28న ఈ సినిమా ఓటీటీలో అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు తాజాగా మనోరమ మ్యాక్స్ ఓటీటీలోకి కూడా వచ్చేసింది ఈ మూవీ. శనివారం నుంచే మనోరమ మ్యాక్స్ లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా.
నకులన్ (అర్జున్ అశోకన్), శాలిని (అనఘ నారాయణన్) కొత్తగా పెళ్లి చేసుకుంటారు. కన్నూర్ లోని ఓ గ్రామంలో నకులన్ క్వారీ బిజినెస్ చేస్తుంటాడు. శాలినిని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటాడు. మొదట్లో చిన్న చిన్న సరసాలు, ఆనందాలు, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ బాగానే ఉంటారు. కానీ రోజులు గడిచే కొద్దీ వీళ్ల మధ్య అపార్థాలు వస్తాయి. ఇక ఏమైనా గుడ్ న్యూస్ ఉందా? పిల్లలెప్పుడు అనే ప్రశ్నలు ఈ కొత్త దంపతులను విసిగిస్తాయి.
ఓ వైపు సమాజం.. మరోవైపు కుటుంబ సభ్యుల నుంచి ఈ దంపతులపై ప్రెషర్ పెరిగిపోతుంది. పిల్లలను కనాలంటూ వీళ్లను ఒత్తిడికి గురి చేస్తారు. దీంతో వ్యక్తిగత జీవితంలో సంతోషం అనేది లేకుండా పోతుంది. ఎమోషనల్ గా సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. మధ్యలో ఓ ఘటనతో కథ మలుపు తీసుకుంటుంది. మరి చివరకు ఏం జరిగిందో మూవీ చూసి తెలుసుకోవాలి.
అన్పోడు కన్మణి మూవీ ఓ మంచి మెసేజ్ ను ఇస్తుంది. వ్యక్తిగత జీవితాలపై ఇతరులు, సమాజం పెట్టుకునే అంచనాలు ఎలా ఉంటాయి? బయటి వాళ్ల వల్ల ఎలాంటి ఒత్తిడి ఎదుర్కుంటాం? ఓ రిలేషన్ షిప్ లో ఎలాంటి ప్రెషర్ ఉంటుంది? అనే విషయాలను ఈ మూవీలో చూపించారు. థియేటర్లలో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజాయతీగా చెప్పాల్సిన స్టోరీ చెప్పారని, సినిమాలో క్యారెక్టర్లను చూస్తే మనల్ని మనం చూసుకున్నట్లే ఉంటుందని ఆడియన్స్ ఫీల్ అయ్యారు.
ఈ సినిమాకు లీజు థామస్ డైరెక్టర్. అర్జున్ అశోకన్, అనఘ నారాయణన్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. క్రియేటివ్ ఫిష్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.
సంబంధిత కథనం