మలయాళం హారర్ మూవీ హంట్ థియేటర్లలో రిలీజైన ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. మనోరమా మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే రిలీజ్ కానున్నట్లు ఓ పోస్టర్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్ అభిమానులతో పంచుకున్నది. మార్చి 28న ఈ మూవీ మనోరమా మ్యాక్స్‌లోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
హంట్ మూవీలో భావన హీరోయిన్‌గా నటించింది. ఈ హారర్ మూవీకి మలయాళం సీనియర్ డైరెక్టర్ షాజీ కైలాస్ దర్శకత్వం వహించాడు. హంట్ మూవీలో భావనతో పాటు రెంజీ ఫణిక్కర్, అజ్మల్ అమీర్ కీలక పాత్రల్లో నటించారు. 2006లో రిలీజైన చింతామణి కోలాకేస్ తర్వాత 18 ఏళ్ల అనంతరం భావన, డైరెక్టర్ షాజీ కైలాస్ కాంబినేషన్‌లో వచ్చిన హంట్ మూవీపై రిలీజ్‌కు ముందు భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు షాజీ కైలాస్ విభిన్నమైన ప్రయోగంగా తెరకెక్కించాడు.
గత ఏడాది ఆగస్ట్ 29న థియేటర్లలో రిలీజైన హంట్ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.పగతో రగిలిపోయే ఆత్మ...రివేంజ్ తీర్చుకోవడం వంటి రొటీన్ అంశాలతో తెరకెక్కడంతో అంతగా ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. భావన మాత్రం తన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నది.
కీర్తి (భావన) ఫోరెన్సిక్ డాక్టర్. వృత్తిలో భాగంగా ఓ మహిళా హత్య కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తుంది. చాలా ఏళ్ల క్రితం చనిపోయిన డాక్టర్ సారా డెడ్‌బాడీ అదని కీర్తి కనిపెడుతుంది. అప్పటినుంచే కీర్తి జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. సారా ఆత్మ ఆమెను వెంటాడటం మొదలుపెడుతుంది. సారా ఎలా చనిపోయింది? ఆమె మరణానికి కీర్తి బాస్ పొట్టికి ఉన్న సంబంధం ఏమిటి? తన మరణంపై కీర్తి సాయంతో సారా ఎలా రివేంజ్ తీర్చుకున్నది అనే అంశాలతో హంట్ మూవీ రూపొందింది.
మలయాళంలో భావన గత కొన్నాళ్లుగా థ్రిల్లర్ సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతోంది భావన. ఆమె గత సినిమాలు కేస్ ఆఫ్ కొండన్న, రెయిన్ ది రియల్ స్టోరీ, గోవిందా గోవిందా థ్రిల్లర్ కథాంశాలతోనే తెరకెక్కాయి. ప్రస్తుతం భావన హీరోయిన్‌గా నటిస్తోన్న పింక్ నోట్, ఉత్తర కాండ , ది డోర్ సినిమాలు హారర్ థ్రిల్లర్ స్టోరీస్‌తో రూపొందుతోండటం గమనార్హం.
మలయాళం టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న భావన తెలుగు తన లక్‌ను పరీక్షించుకున్నది. మూడు సినిమాలు చేసింది. గోపీచంద్ ఒంటరి మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కృష్ణవంశీ మహాత్మతో పాటు రవితేజ నిప్పులో హీరోయిన్‌గా నటించింది. పరాజయాల కారణంగా తెలుగులో భావనకు అవకాశాలు అంతగా రాలేదు.
సంబంధిత కథనం