ఓటీటీల్లోకి ఈ వారం రానున్న రెండు మలయాళ సినిమాలు.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చు?-malayalam films alappuzha gymkhana and padakkalam ott streaming this week sonyliv jio hotstar ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీల్లోకి ఈ వారం రానున్న రెండు మలయాళ సినిమాలు.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చు?

ఓటీటీల్లోకి ఈ వారం రానున్న రెండు మలయాళ సినిమాలు.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చు?

ఈవారం ఓటీటీల్లోకి రెండు పాపులర్ మలయాళ చిత్రాలు అడుగుపెట్టనున్నాయి. ఒకటి స్పోర్డ్స్ డ్రామా కాగా.. మరొకటి సూపర్ నేచురల్ కామెడీ చిత్రంగా ఉంది. ఈ రెండు సినిమాలు తెలుగులోనూ అందుబాటులోకి రానున్నాయి.

ఓటీటీల్లోకి ఈ వారం రానున్న రెండు మలయాళ సినిమాలు.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చు?

ఓటీటీల్లో కొత్త మలయాళ చిత్రాల కోసం ఎదురుచూస్తున్నారా.. ఈవారం రెండు సినిమాలు అడుగుపెట్టనున్నాయి. చాలా మంది ఎదురుచూస్తున్న అలప్పుజ జింఖానా చిత్రం ఇదే వారం స్ట్రీమింగ్‍కు రానుంది. థియేట్రికల్ రన్‍లో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. మరో సూపర్ నేచురల్ ఫ్యాంటసీ కామెడీ చిత్రం కూడా స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. ఈ జూన్ రెండో వారం ఓటీటీల్లోకి రానున్న ఆ రెండు మలయాళ సినిమాల గురించి ఇక్కడ చూడండి.

అలప్పుజ జింఖానా

మలయాళ స్పోర్ట్స్ డ్రామా మూవీ అలప్పుజ జింఖానా చిత్రం జూన్ 13వ తేదీన సోనీలివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మూవీలో ప్రేమలు ఫేమ్ నెస్లన్ గఫూర్ హీరోగా నటించారు. జూన్ 13న మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ మూవీ సోనీ లివ్‍లో అడుగుపెట్టనుంది. ఒక రోజు ముందుగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అలప్పుజ జింఖాన చిత్రం థియేటర్లలో సూపర్ హిట్ అయింది. బాక్సింగ్ పోటీకి సన్నద్ధమ్యే స్టూడెంట్స్ గ్యాంగ్‍ చుట్టూ ఈ మూవీ స్టోరీ ఉంటుంది. ఈ సినిమాకు ఖాలీద్ రహమాన్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 10న మలయాళంలో ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. మంచి టాక్‍తో పాటు కలెక్షన్లలోనూ అదరగొట్టింది. ఆ తర్వాత తెలుగు వెర్షన్ ముందుకు వచ్చింది. సుమారు రూ.12కోట్లతో రూపొందిన ఈ చిత్రం సుమారు రూ.65కోట్ల కలెక్షన్లతో బ్లాక్‍బస్టర్ కొట్టింది.

అలప్పుజ జింఖానా మూవీలో నెస్లన్‍తో పాటు లక్మన్ అవరన్, గణపతి, సందీప్ ప్రదీప్, ఫ్రాన్కో ఫ్రాన్సిస్ ప్రధాన పాత్రలు చేశారు. ఈ సినిమాకు విష్ణు విజయ్ సంగీతం అందించారు. ఈ మూవీని జూన్ 13 నుంచి సోనీ లివ్‍లో చూసేయండి.

పడక్కలమ్

మలయాళ సూపర్ నేచురల్ ఫ్యాంటసీ కామెడీ మూవీ ‘పడక్కలమ్’ ఈ వారం జూన్ 10వ తేదీన జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. సందీప్ ప్రదీప్, సూరజ్ వెంజరమూడు, షరాఫుద్దీన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మే 8వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.

పడక్కలమ్ మూవీకి మనూ స్వరాజ్ దర్శకత్వం వహించారు. పరకాయ ప్రవేశం అంశం చుట్టూ ఓ ఇంజినీరింగ్ కాలేజీ బ్యాక్‍డ్రాప్‍లో కామెడీ ప్రధానంగా ఈ చిత్రం సాగుతుంది. విజయ్ బాబు, విజయ్ సుబ్రమణ్యం ప్రొడ్యూజ్ చేసిన ఈ చిత్రానికి రాజేశ్ మురుగేశన్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రం జూన్ 10న జియోహాట్‍స్టార్‌లో ఎంట్రీ ఇవ్వనుంది.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం