OTT Family Drama: డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఫ్యామిలీ డ్రామా చిత్రం.. పాపులర్ మూవీకి రీమేక్‍గా.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడు?-malayalam film the great indian kitchen hindi remake sanya malhotra mrs movie will be streaming on zee5 ott from ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Family Drama: డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఫ్యామిలీ డ్రామా చిత్రం.. పాపులర్ మూవీకి రీమేక్‍గా.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడు?

OTT Family Drama: డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఫ్యామిలీ డ్రామా చిత్రం.. పాపులర్ మూవీకి రీమేక్‍గా.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడు?

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 26, 2025 05:50 PM IST

OTT Family Drama: ‘మిసెస్’ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేయనుంది. ఓ మలయాళ మూవీకి రీమేక్‍గా ఈ చిత్రం రూపొందింది. సాన్య మల్హోత్రా ప్రధాన పాత్ర పోషించిన ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రం స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.

OTT Family Drama: ప్రశంసలు పొందిన మలయాళ మూవీకి రీమేక్.. నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్.. ఎప్పుడంటే..
OTT Family Drama: ప్రశంసలు పొందిన మలయాళ మూవీకి రీమేక్.. నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్.. ఎప్పుడంటే..

మలయాళ సినిమా ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ చాలా పాపులర్ అయింది. ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రం 2021లో ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చింది. కొత్తగా పెళ్లయిన అమ్మాయి..ఎదుర్కొనే సవాళ్లు, కష్టాల చుట్టూ ఈ మూవీ సాగుతుంది. నిమిషా సంజయ్, సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి భారీ ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా 2023లో తమిళంలో రీమేక్ అయింది. ఇప్పుడు హిందీలోనూ ఈ సినిమా రీమేక్‍ అయింది. ‘మిసెస్’ (Mrs.) పేరుతో హిందీలో ఈ మూవీ నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తోంది. డేట్ ఖరారైంది.

స్ట్రీమింగ్ వివరాలు ఇవే

మిసెస్ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రంలో సాన్య మల్హోత్రా ప్రధాన పాత్ర పోషించారు. ఈ మూవీ ట్రైలర్ కూడా వచ్చింది. ఫిబ్రవరి 7న ఈ చిత్రం నేరుగా జీ5 ఓటీటీలో అడుగుపెట్టనుంది.

మిసెస్ మూవీకి ఆర్తి కడవ్ దర్శకత్వం వహించారు. దేశంలో చాలా మంది మహిళలు ఎదుర్కొనే సవాళ్లు ఈ చిత్రంలో ఉంటాయి. కొత్తగా పెళ్లయిన అమ్మాయి.. అత్తారింట్లో భర్త, కుటుంబ సభ్యుల ప్రవర్తనతో ఇబ్బందులు పడుతుంది. గృహిణిగా నిత్యం ఇంటి పనులతో శారీరకంగా, మానసికంగా సవాళ్లను ఆమె ఎదుర్కోవడం చుట్టూ ఈ మూవీ ఉంటుంది.

మిసెస్ చిత్రంలో గృహిణి రిచా పాత్రను సాన్య మల్హోత్రా పోషించారు. నిశాంత్ దహియా మరో లీడ్ రోల్ చేశారు. కన్వాల్జిత్ సింగ్, అపర్ణ ఘోషల్, మృణాల్ కులకర్ణి, నిత్య మోహల్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని జ్యోతి దేశ్‍పాండే, పమ్మి భవేజా, హర్మన్ భవేజా ప్రొడ్యూజ్ చేశారు.

మిసెస్ స్టోరీలైన్ ఇదే

డ్యాన్సర్ అయిన రిచా (సాన్య మల్హోత్రా).. దివాకర్ (నిశాంత్)ను పెళ్లాడుతుంది. ఎన్నో ఆశలతో అత్తారింట్లో రిచా అడుగుపెడుతుంది. అయితే, గృహిణిగా ఆ ఇంట్లో ఆమె నిత్యం విశ్రాంతి లేకుండా పనులు చేయాల్సి వస్తుంది. వంటతో పాటు ఇంటి పని మొత్తం చేస్తుంటుంది. భర్త, అత్తామామల ప్రవర్తన, మాటలతోనూ రిచా సవాళ్లు ఎదుర్కొంటూ ఉంటుంది. శారీకంగా, మానసికంగా ఇబ్బందులు పడుతుంది. దీనిచుట్టే మిసెస్ మూవీ సాగుతుందని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. మలయాళ మూవీ ది గ్రేట్ ఇండియన్ కిచెన్ కథను మేకర్స్ పెద్దగా మార్పులు చేయకుండా రీమేక్ చేసినట్టు తెలుస్తోంది.

ది గ్రేట్ ఇండియన్ కిచెన్ చిత్రం మలయాళంలో 2021లో నీస్ట్రీమ్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. భారీగా ప్రశంసలు పొందింది. 2023లో ఐశ్వర్య రాజేశ్, రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రల్లో తమిళంలో అదే పేరుతో ఈ చిత్రం రీమేక్‍గా వచ్చింది. థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు హిందీలో మిసెస్‍గా ఈ మూవీ రీమేక్ అయింది. ఫిబ్రవరి 7న జీ5 ఓటీటీలో మిసెస్ మూవీ స్ట్రీమింగ్‍కు రానుంది.

Whats_app_banner

సంబంధిత కథనం