Malayalam OTT: ఓటీటీలోకి మహేష్ బాబు మహర్షి నటి మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ - ఎందులో చూడాలంటే?
Malayalam OTT: మహర్షి ఫేమ్ అనన్య హీరోయిన్‌గా నటించిన మలయాళం మూవీ స్వర్గం ఓటీటీలోకి వస్తోంది. త్వరలో మనోరమా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఫ్యామిలీ డ్రామా కథాంశంతో నాలుగు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ పది కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
Malayalam OTT: మహేష్‌బాబు మహర్షి ఫేమ్ అనన్య హీరోయిన్‌గా నటించిన మలయాళం మూవీ స్వర్గం ఓటీటీ ప్లాట్‌ఫామ్ కన్ఫామ్ అయ్యింది. మనోరమా మ్యాక్స్ ద్వారా త్వరలో ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ విషయాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో మనోరమా మ్యాక్స్‌లో స్వర్గం మూవీ రిలీజ్ కానున్నట్లు చెబుతోన్నారు. ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
నాలుగు కోట్ల బడ్జెట్...
స్వర్గం మూవీలో అనన్యతో పాటు అజు వర్గీస్, జాన్ ఆంటోనీ, మంజు పిల్లై కీలక పాత్రలు పోషించారు. ఇరవై మందికిపైగా మలయాళం సీనియర్ ఆర్టిస్టులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. స్వర్గం మూవీకి రెజీస్ ఆంటోనీ దర్శకత్వం వహించాడు. నాలుగు కోట్ల బడ్జెట్‌తో చిన్న సినిమాగా రిలీజైన ఈ మూవీ పది కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. కమర్షియల్ హిట్‌గా నిలిచింది.
ఉమ్మడి కుటుంబం విలువలతో...
భిన్న నేపథ్యాలు కలిగిన రెండు కుటుంబాల కథతో దర్శకుడు రెజీస్ ఆంటోనీ ఈ సినిమాను తెరకెక్కించాడు. డబ్బు, గౌరవం, పేరుప్రఖ్యాతుల్లో తేడాలు ఉన్న ఆ కుటుంబాల్లో బంధాలు, బంధుత్వాలు ఎలా ఉన్నాయి? ఉమ్మడిగా కలిసి ఉండే క్రమంలో ఆ కుటుంబసభ్యులు ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొన్నారు?
ఉమ్మడి కుటుంబం విలువను గొప్పతనాన్ని ఎలా చాటిచెప్పారు అనే పాయింట్‌తో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా సాగిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నది. ఈ మూవీలో సిసిలీ అనే క్యారెక్టర్‌లో అనన్య నటనకు ప్రశంసలు దక్కాయి.
జర్నీ మూవీతో...
జర్నీ మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది అనన్య. తమిళ మూవీ ఎంగేయుమ్ ఎప్పోదుమ్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో శర్వానంద్‌ను ప్రేమించిన అమ్మాయిగా నాచురల్ యాక్టింగ్‌తో మెప్పించింది. తెలుగులో డీసెంట్ హిట్‌గా నిలిచింది.
త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అఆ సినిమాలో నితిన్ సోదరి పాత్రలో కనిపించింది. మహేష్‌బాబు హీరోగా నటించిన మహర్షి సినిమాలో అల్లరి నరేష్‌ను ప్రేమించే అమ్మాయి పాత్రలో కనిపించింది. అమాయకుడు అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. మలయాళంలో, తమిళంలో 30కిపైగా సినిమాల్లో ఢిఫరెంట్ క్యారెక్టర్స్ చేసింది. పలు అవార్డులను అందుకున్నది.