చాలా మంది ఎదురుచూస్తున్న ‘మరణమాస్’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ సమీపించింది. మలయాళ స్టార్ బాసిల్ జోసెఫ్ నటించిన ఈ డార్క్ కామెడీ మూవీ ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైంది. ఈ మూవీ ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ కొట్టింది. ఐదు వారాలకు ఓటీటీలోకి వస్తోంది. మరణమాస్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలివే..
మరణమాస్ సినిమా నేటి (మే 14) సాయంత్రం 5 గంటలకు సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుంది. ముందుగా 15వ తేదీన తీసుకురానున్నట్టు సోనీ లివ్ వెల్లడించింది. అయితే, కొన్ని గంటల ముందుగా నేటి సాయంత్రమే స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీలోనూ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది.
మరణమాస్ చిత్రానికి శివప్రసాద్ దర్శకత్వం వహించారు. ఓ సీరియల్ కిల్లర్, చేయని నేరానికి పోలీసులకు చిక్కిన యూట్యూబర్ చుట్టూ ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమాలో కామెడీ బాగా నవ్విస్తుంది. ఊహించని ట్విస్టులు కూడా హైలైట్‍గా ఉంటాయి. ఈ చిత్రం ఎక్కువ శాతం ఎంటర్‌టైనింగ్‍గా సాగుతుంది.
మరణమాస్ సినిమాలో బాసిల్ జోసెఫ్ యాక్టింగ్ మరో హైలైట్. జనాల సీక్రెట్లను బయటపెట్టే యూట్యూబర్‌గా అతడు మెప్పించారు. డిఫరెంట్ గెటప్‍లో యాక్టింగ్ అదరగొట్టారు. మరోసారి తన నటనతో మ్యాజిక్ చేశారు. చేయని నేరానికి పోలీసులకు చిక్కడం, అనుకోని పరిస్థితులను ఎదుర్కొవడం చుట్టూ మంచి సీన్లు ఉంటాయి. అన్నీసీన్లలో బాసిల్ పర్ఫార్మెన్స్‌తో సూపర్ అనిపించారు. ఈ చిత్రాన్ని డిఫరెంట్ నరేషన్‍తో తెరకెక్కించారు శివప్రసాద్. క్లైమాక్స్ కూడా కొత్తగా అనిపిస్తుంది.
మరణమాస్ సినిమా థియేట్రికల్ రన్‍లో సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం రూ.19కోట్ల కలెక్షన్లు దక్కించుకుంది. ఈ మూవీకి అయిన బడ్జెట్ రూ.8కోట్లు. బాసిల్ జోసెఫ్ చిత్రాలకు మంచి క్రేజ్ ఉండడం, ఈ మూవీకి బజ్ నెలకొనడం, ఐదు భాషల్లో వస్తుండటంతో మరణమాస్ చిత్రం ఓటీటీలోనూ అదరగొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏ రేంజ్‍లో వ్యూస్ దక్కించుకుంటుందో చూడాలి.
మరణమాస్ మూవీలో ల్యూక్ అనే లీడ్ రోల్‍లో బాసిల్ జోసెఫ్ నటించగా.. రాజేశ్ మాధవన్, బాబు ఆంటోనీ, సిజు సన్నీ, ఆనిష్మ, పూజా మోహన్‍రాజా, సురేశ్ కృష్ణ కీరోల్స్ చేశారు. గురు సుందరం, హీరో టొవినో థామస్ క్యామియో పాత్రల్లో కాసేపు కనిపించారు. ఈ మూవీలో నటీనటుల యాక్టింగ్ మెప్పించేలా ఉంటుంది. ఈ చిత్రానికి జేకే సంగీతం అందించారు. టొవినో థామస్, టింగ్‍స్టన్ థామస్, రఫేల్, తంజీర్ సలామ్ నిర్మించారు.
సంబంధిత కథనం