OTT Crime Thriller: ఎట్టకేలకు ఓటీటీలోకి వస్తున్న మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో కూడా స్ట్రీమింగ్.. డేట్ ఇదే
Thalavan OTT Release Date: తలవన్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో రిలిజైన సుమారు నాలుగు నెలల తర్వాత ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.
మలయాళం మూవీ ‘తలవన్’ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆసిఫ్ అలీ, బిజూ మీనన్ ప్రదాన పాత్రలు పోషించిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం మే 24వ తేదీనే థియేటర్లలో రిలీజ్ అయింది. జిస్ జాయ్ దర్శకత్వం వహించిన ఈ తలవన్ చిత్రానికి మంచి కలెక్షన్లు వచ్చాయి. అయితే, ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్‍కు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఎట్టకేలకు ఈ తలవన్ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.
ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే
తలవన్ సినిమా సెప్టెంబర్ 12వ తేదీన సోనీలివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లో అందుబాటులోకి వస్తుంది. సెప్టెంబర్ 12న సోనీలివ్‍లో ఈ చిత్రంలో రానున్నట్టు అనౌన్స్‌మెంట్ వచ్చింది.
ఆలస్యంగా..
తలవన్ చిత్రాన్ని థియేటర్లలో రిలీజైన 40 రోజుల్లోగా స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని ముందుగా మేకర్స్ అనుకున్నారు. అయితే, థియేట్రికల్ రన్ కొనసాగడంతో ఆలస్యమవుతూ వచ్చింది. సుమారు 80 రోజుల తర్వాత ఈ సినిమా స్ట్రీమింగ్‍కు సోనీలివ్‍లో అడుగుపెట్టేందుకు రెడీ అయింది.
తలవన్ చిత్రంలో ఆసిఫ్ అలీ, బిజూ మీనన్‍తో పాటు మియా జార్జ్, దిలీశ్ పోతన్, అనుశ్రీ, సుజీత్ శంకర్, శంకర్ రామకృష్ణన్, రంజిత్ కీలకపాత్రలు పోషించారు. ఓ హత్య కేసులో పోలీస్ చిక్కుకోవడం, దర్యాప్తు జరగడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. దర్శకుడు జిస్ జాయ్ కొన్ని టిస్టులతో థ్రిల్లింగ్‍గా ఈ మూవీని ముందుకు నడిపారు. ఈ మూవీకి ఎక్కువగా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.
తలవన్ చిత్రాన్ని అరుణ్ నారాయణ్ ప్రొడక్షన్స్, లండన్ స్టూడియోస్ పతాకంపై అరుణ్ నారాయణ్, సిజో సెబాస్టియన్ నిర్మించారు. ఈ చిత్రానికి దీపక్ దేవ్ సంగీతం అందించారు. శరణ్ వెలాయుధన్ సినిమాటోగ్రఫీ చేయగా.. సూరజ్ ఈఎస్ ఎడిటింగ్ చేశారు. తక్కువ బడ్జెట్‍తో రూపొందిన ఈ సినిమా సుమారు రూ.25కోట్ల కలెక్షన్లను రాబట్టింది.
తలవన్ స్టోరీలైన్
సీఐ జయశంకర్ (బిజూ మీనన్), ఎస్‍ఐ కార్తీక్ (ఆసిఫ్ అలీ) చుట్టూ తలవన్ స్టోరీ తిరుగుతుంది. సీఐ జయశంకర్ ఇంట్లో ఓ అమ్మాయి శకం దొరుకుతుంది. దీంతో అతడు నిందితుడిగా మారతాడు. ఈ కేసులను కార్తీక్‍కు విచారణకు అప్పగిస్తారు ఉన్నతాధికారులు. జయశంకర్ నిజంగా హత్య చేశాడా? అతడు కాకపోతే మరెవరూ ఈ ఘోరం చేశారు? అతడిని ఎందుకు ఇరికించాలనుకున్నారు? దర్యాప్తులో లేని నిజాలేంటి? అనే విషయాలు తలవన్ సినిమాలో ప్రధాన అంశాలుగా ఉంటాయి.
ఇటీవలే ‘టర్బో’
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన టర్బో సినిమా ఇటీవలే సోనీలివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోనే స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ యాక్షన్ డ్రామా మూవీ ఆగస్టు 9న ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. సోనీలివ్‍లో మలయాళం, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో టర్బో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి వైశాఖ్ దర్శకత్వం వహించారు. మే 23న థియేటర్లలో రిలీజైన ఈ టర్బో సూపర్ హిట్ అయింది. ఇప్పుడు సోనీలివ్‍లో స్ట్రీమింగ్ అవుతోంది.