మలయాళం బ్లాక్‌బస్టర్ క్రైమ్ థ్రిల్లర్, రూ.200 కోట్ల మూవీ ఓటీటీలోకి వచ్చేది ఆ రోజేనా.. స్ట్రీమింగ్ అయ్యేది ఈ ఓటీటీలోనే..-malayalam crime thriller movie thudarum ott release date mohanlal movie may stream from may 23 on jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  మలయాళం బ్లాక్‌బస్టర్ క్రైమ్ థ్రిల్లర్, రూ.200 కోట్ల మూవీ ఓటీటీలోకి వచ్చేది ఆ రోజేనా.. స్ట్రీమింగ్ అయ్యేది ఈ ఓటీటీలోనే..

మలయాళం బ్లాక్‌బస్టర్ క్రైమ్ థ్రిల్లర్, రూ.200 కోట్ల మూవీ ఓటీటీలోకి వచ్చేది ఆ రోజేనా.. స్ట్రీమింగ్ అయ్యేది ఈ ఓటీటీలోనే..

Hari Prasad S HT Telugu

మలయాళం బ్లాక్‌బస్టర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేవలం రూ.28 కోట్ల బడ్జెట్ తో రూపొంది.. ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేసిన సినిమా ఇది. తెలుగులోనూ రిలీజైన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు రానుందో చూడండి.

మలయాళం బ్లాక్‌బస్టర్ క్రైమ్ థ్రిల్లర్, రూ.200 కోట్ల మూవీ ఓటీటీలోకి వచ్చేది ఆ రోజేనా.. స్ట్రీమింగ్ అయ్యేది ఈ ఓటీటీలోనే..

మలయాళం ఇండస్ట్రీలో ప్రస్తుతం మోహన్ లాల్ ఊపు మీదున్నాడు. ఎల్2 ఎంపురాన్ మూవీతో అత్యధిక వసూళ్ల సినిమా రికార్డును బ్రేక్ చేసిన అతడు.. మరో రూ.200 కోట్ల వసూళ్ల సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా పేరు తుడరుమ్ (Thudarum). తెలుగులోనూ ఇదే పేరుతో రిలీజైన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకుల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తుడరుమ్ ఓటీటీ రిలీజ్ డేట్

తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. మోహన్ లాల్, శోభన లీడ్ రోల్స్ లో నటించిన ఈ తుడరుమ్ మూవీ మే 23 లేదా 30వ తేదీల్లో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించడంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఆసక్తి నెలకొంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను జియోహాట్‌స్టార్ సొంతం చేసుకుంది.

ఓటీటీ త్వరలోనే స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. మలయాళంతోపాటు తెలుగు ఆడియోలోనూ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఎల్2: ఎంపురాన్ సినిమా కూడా ఈ జియోహాట్‌స్టార్ లోనే స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. మోహన్ లాల్ నటించిన రెండు వరుస బ్లాక్‌బస్టర్ సినిమాలను ఈ ఓటీటీ సొంతం చేసుకుంది.

తుడరుమ్ మూవీ గురించి..

తుడరుమ్ మూవీని ప్రముఖ మలయాళ దర్శకుడు తరుణ్ మూర్తి డైరెక్ట్ చేశాడు. గతంలో ఆపరేషన్ జావా, సౌదీ వెల్లక్కే అనే మూవీస్ ను డైరెక్ట్ చేసిన అతడు.. తాజాగా తుడరుమ్ తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. కేవలం రూ.28 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేసింది.

ఈ సినిమాలో మోహన్‌లాల్.. షణ్ముగం అలియాస్ బెంజ్ అనే ట్యాక్సీ డ్రైవర్ పాత్రలో కనిపించాడు. ఇక అతని భార్య లలిత పాత్రలో శోభన నటించింది. రన్ని అనే ఓ చిన్న ఊళ్లో వీళ్లు తమ ఇద్దరు పిల్లలో హాయిగా జీవిస్తుంటారు. బెంజ్ కు ఓ బ్లాక్ అంబాసిడర్ కారు ఉంటుంది. అదంటే అతనికి ఎంతో ఇష్టం. ఒకరోజు బెంజ్ కొడుకు ఫ్రెండ్స్ ఆ కారును చెన్నైకి తీసుకెళ్తారు.

అదే కథను మలుపు తిప్పుతుంది. ఆ కారులో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారంటూ పోలీసులు సీజ్ చేస్తారు. బెంజ్ ఎంత వేడుకున్నా అక్కడి ఎస్ఐ కారును రిలీజ్ చేయడానికి అంగీకరించడు. తనకు ఎంతో ఇష్టమైన ఆ కారు కోసం అతడు ఏం చేస్తాడు? ఎంత వరకూ వెళ్తాడన్నదే ఈ తుడరుమ్ మూవీ స్టోరీ.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం